శంకర్‌దాదా టైప్ బిల్డప్.. మెడికల్ కాలేజీపై సుప్రీంకోర్టు సీరియస్..
Publish Date:Feb 15, 2022
Advertisement
మున్నాభాయ్ ఎంబీబీఎస్ బాలీవుడ్‌లో సూపర్ హిట్. తెలుగులో చిరంజీవితో చేసిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ కూడా అంతే బంపర్ హిట్. ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా సీన్ గురించి తాజాగా సుప్రీంకోర్టు గుర్తు చేసుకుంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీలో హీరో దాదా అయితే.. ఆ విషయం తన తల్లి తండ్రులకు తెలియకుండా ఉంచేందుకు, పేరెంట్స్ ఇంటికి వచ్చిన టైంలో ఓ నకిలీ హాస్పిటల్ క్రియేట్ చేసి.. ఆ రౌడీ తానొక డాక్టర్‌గా నటించి.. తల్లిదండ్రులను మభ్యపెడతాడు. ఇప్పుడు ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆ సినిమా ప్రస్తావన చేయడం ఆసక్తికరంగా మారింది. విషయంలోకి వెళితే, ఒక వైద్య కళాశాలకు మంజూరైన అదనపు సీట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం.. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాన్ని ప్రస్తావించింది. కళాశాల తనిఖీకి వెళ్లిన అధికారుల బృందం... జాతీయ వైద్య కమిషన్’కు సమర్పించిన నివేదికను పరిశీలించిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం ఇదేదో ఆ సినిమాల్లో ఉన్నట్లే ఉందే అని వ్యాఖ్యానించింది. జాతీయ వైద్య కమిషన్’ నివేదిక ప్రకారం సదరు కలాశాలలో, కనీసం మున్నభాయి ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు కూడా లేవు. ఆసినేంలో లాగానే, రోగులను అద్దెకు తెచ్చారు.ఆరోగ్యం ఉన్న చిన్న పిల్లల తెచ్చి చిన్నపిల్లల వార్డులో ఉంచారు. కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి వుంది,కానీ అందులో అపరేషన్ థియేటర్ లేదు.అనే కాదు, ఆసుపత్రిలో ఉండవలసిన మౌలిక సదుపాయాలు, ఎక్విప్మెంట్ ఏదీ లేదు. ఇదంతా చూసిన ధర్మాసనం, ఇదేదో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలా ఉంది’ అని పేర్కొంది. నిజానికి, మహారాష్ట్రలోని అన్నాసాహెబ్ చుడామన్ పాటిల్ మెమోరియల్ మెడికల్ కళాశాల లీలలు బయటకు వచ్చేవి కాదేమో కానీ, ఆ కాలేజీకి 50 అదనపు సీట్లకు ఇచ్చిన అనుమతిని ఎన్‌ఎంసీ రద్దు చేసింది. ఆకస్మిక తనిఖీలో గుర్తించిన లోపాలను ఇందుకు కారణంగా పేర్కొంది. ఈ నిర్ణయాన్ని కళాశాల యాజమాన్యం బాంబే హైకోర్టులో సవాల్ చేసింది.. ఔరంగాబాద్ ధర్మాసనం జనవరి 25న, ఫిబ్రవరి 2న రెండు ఉత్తర్వులిచ్చింది. కళాశాలలో మరోసారి తనిఖీలు నిర్వహించాలని, విద్యార్థుల ప్రవేశాలకు అనుమతించాలని వాటిల్లో పేర్కొంది. వీటిని కళాశాల యాజమాన్యం, ఎన్‌ఎంసీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా..జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం...హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది. ఇరు పక్షాల వాదనలను మళ్లీ వినాలని, కేసును విచారణకు చేపట్టాలని సూచించింది. .. ఆవిధంగా తీగ లాగితే డొంకంత కదిలింది. అయితే, ఈకథ ఇక్కడితో ముగియ లేదు, స్టొరీ ఇంకా ఉంది .
http://www.teluguone.com/news/content/supreme-court-angry-on-one-of-medical-college-25-131800.html





