ప్రపంచ విద్యార్థుల దినోత్సవం.. ఏ.పి.జె అబ్దుల్ కలాం జయంతి ప్రాముఖ్యత ఏంటి.!

Publish Date:Oct 15, 2026

Advertisement

అక్టోబర్ 15వ తేదీ అనగానే భారతదేశానికి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఒక అపారమైన స్ఫూర్తి గుర్తుకువస్తుంది. భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా 'ప్రపంచ విద్యార్థుల దినోత్సవం'గా జరుపుకుంటారు. ఒక శాస్త్రవేత్తగా, దేశ అత్యున్నత పౌరుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించినప్పటికీ, తనను తాను ఎప్పుడూ ఒక ఉపాధ్యాయుడిగానే భావించుకున్న గొప్ప వ్యక్తి కలాం. యువత, విద్యార్థులే దేశ భవిష్యత్తుకు అసలైన మూలస్తంభాలని ఆయన బలంగా నమ్మారు. అందుకే ఆయన జన్మదినాన్ని విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.  ఈ దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన చరిత్ర తెలుసుకుంటే..

కలాం జయంతి రోజే ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

డాక్టర్ అబ్దుల్ కలాం తన జీవితాంతం విజ్ఞానాన్ని పంచడానికి, విద్యార్థులను ప్రోత్సహించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. శాస్త్రవేత్తగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా దేశ రక్షణ రంగానికి ఎనలేని సేవలు అందించిన ఆయన, ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఏ పదవిలో ఉన్నా విద్యార్థులను కలవడం, వారితో మాట్లాడటం, వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ఆయనకు ఎంతో ఇష్టమైన వ్యాపకం.

కలాం ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొన్నప్పుడు కూడా యువత పట్ల తనకున్న నమ్మకాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీయడమే ఒక దేశ పురోగతికి అసలైన బాట అని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలను, విద్యార్థుల పట్ల ఆయన చూపిన ప్రేమాభిమానాలను గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి 2010లో ఆయన 79వ జయంతి సందర్భంగా అక్టోబర్ 15ను 'ప్రపంచ విద్యార్థుల దినోత్సవం'గా ప్రకటించింది.

ఈ రోజు ప్రాముఖ్యత , ప్రత్యేకత..

ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ప్రతీ విద్యార్థి తన లక్ష్యాన్ని గుర్తుచేసుకునే ఒక గొప్ప సందర్భం. ఈ రోజు ప్రాముఖ్యతను తెలియజేసే ముఖ్యమైన విషయాలు ఇవే:

పెద్ద కలలు కనేందుకు స్ఫూర్తి..

కలాం ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. నిద్రలో వచ్చేది కల కాదు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేదే అసలైన కల. సాధారణ కుటుంబంలో పుట్టి, అనేక కష్టాలను దాటుకుని ఉన్నత శిఖరాలకు చేరిన ఆయన జీవితమే విద్యార్థులకు ఒక పెద్ద పాఠం. ఎంతటి పేదరికంలో ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది.

ఓటమిని గెలుపుకు పునాదిగా మార్చడం..

ప్రయోగాలు చేసేటప్పుడు ఎదురయ్యే వైఫల్యాలను చూసి భయపడకూడదని కలాం విద్యార్థులకు నిరంతరం బోధించేవారు. ప్రయత్నంలో ఓటమి ఎదురైతే అది ముగింపు కాదని, తదుపరి విజయానికి అడుగు అని నమ్మేలా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఈ రోజు యొక్క  ఉద్దేశం.

విద్య , నైతిక విలువల ప్రాధాన్యత..

కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమే సరిపోదని, ప్రవర్తనలో నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యత ఉండాలని కలాం ఆకాంక్షించారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు సాగుతూనే, దేశ పురోగతికి దోహదపడే మంచి పౌరులుగా మారాలని బోధించడమే ఈ రోజు ముఖ్య లక్ష్యం.

ఉపాధ్యాయులు - విద్యార్థుల బంధం..

కలాం రాష్ట్రపతి పదవి పూర్తయ్యాక తిరిగి బోధనా రంగానికే పరిమితమయ్యారు. షిల్లాంగ్ లోని ఐఐఎమ్ లో విద్యార్థులకు ప్రసంగిస్తూనే ఆయన తుది శ్వాస విడిచారు. చివరి క్షణం వరకు విద్యార్థుల మధ్యే గడిపిన ఆయన జీవితం, ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండే బంధం ఎంత పవిత్రమైనదో తెలియజేస్తుంది.

గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం..

ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అనేది రాబోయే తరం భవిష్యత్తును దిద్దుకోవడానికి ఒక బంగారు అవకాశం. అబ్దుల్ కలాం గారు మనకు అందించిన ఆలోచనలు, ఆశయాలు ప్రతీ విద్యార్థికి మార్గదర్శకాలు. నా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూస్తాను అన్న ఆయన కలను సాకారం చేయాలంటే, నేటి విద్యార్థులు జ్ఞానాన్ని ఆర్జించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలి. కలాం చూపిన బాటలో నడుస్తూ, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో తమ గమ్యాలను చేరుకోవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.

                           *రూపశ్రీ.

By
en-us Political News

  
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఫ్రాన్స్‌లో తొలిసారిగా మనిషికి సోకిన ప్రాణాంతక షమోండా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైబీపీని సహజంగా తగ్గించడంలో బీట్‌రూట్ జ్యూస్ మరియు దానిమ్మ జ్యూస్ ఎలా పనిచేస్తాయి? రక్తపోటు నియంత్రణకు ఏది అత్యంత ప్రభావవంతమైనదో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది పరస్పర నమ్మకం, గౌరవం , నిజాయితీ. రెండు మనస్సులు కలిసి ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం.
భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం.
భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం.
శనగల్లో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. రోజూ ఒక కప్పు శనగలు తింటే గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు షుగర్, బీపీ అదుపులో ఉంటాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రోజూ పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా 15 నుంచి 30 నిమిషాలు నడవడం వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్రలేమి నివారణ, రోగనిరోధక శక్తి పెరగడం వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గ్రౌండింగ్ లేదా బేర్‌ఫుట్ వాకింగ్ వల్ల కలిగే పూర్తి వివరాలు తెలుసుకోండి.
మార్కెట్ ప్రొడక్ట్స్‌కు దూరంగా.. ఎలాంటి రసాయనాలు కలపకుండా 100 శాతం స్వచ్ఛమైన రోజ్ వాటర్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. చర్మ సంరక్షణకు అద్భుతమైన ఈ చిట్కాతో మీ అందాన్ని మరింత పెంచుకోండి.
ఉల్లిపాయలు, వెల్లుల్లి తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను తక్షణమే క్షణాల్లో పోగొట్టే అద్భుతమైన, సులువైన 7 చిట్కాల గురించి ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.