ఆఫీస్ కొలీగ్స్ తో స్నేహం చేస్తున్నారా.. జాగ్రత్త ఈ తప్పులు మాత్రం చేయకండి..!

Publish Date:Oct 15, 2026

Advertisement

ఆఫీస్ కొలీగ్స్ తో స్నేహం చేస్తున్నారా.. జాగ్రత్త ఈ తప్పులు మాత్రం చేయకండి..!

మన జీవితంలో చాలా సమయం ఆఫీసులోనే గడుస్తుంది. అలాంటప్పుడు సహోద్యోగులతో మంచి అనుబంధం ఏర్పడటం చాలా సహజం. ఆఫీసులో మంచి స్నేహితులు ఉంటే పని ఒత్తిడి తగ్గడమే కాకుండా, పని చేసే వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. కలసి భోజనం చేయడం, పనిలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. అయితే, అదే స్నేహం ఒక్కోసారి హద్దులు దాటితే  వృత్తిపరమైన ఎదుగుదలకు, కెరీర్‌కు పెద్ద అవరోధంగా మారే ప్రమాదం ఉంది.ఆఫీసులో స్నేహం చేయడం తప్పు కాకపోయినా, కొన్ని పొరపాట్లు చేయడం వల్ల  ప్రొఫెషనల్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఉద్యోగంలో విజయం సాధించాలన్నా, ఉన్నతాధికారుల వద్ద మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా స్నేహం విషయంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఆఫీస్ స్నేహాల్లో సాధారణంగా చేసే పొరపాట్లు, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో  వివరంగా తెలుసుకుంటే..

అతిగా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం..

ఆఫీసులో ఉండే ప్రతి సహోద్యోగితో మీ జీతం, కుటుంబ సమస్యలు లేదా మీ భవిష్యత్ కెరీర్ ప్లాన్‌లను పంచుకోవడం అస్సలు మంచిది కాదు. మీరు నమ్మి చెప్పిన రహస్యాలు లేదా వ్యక్తిగత విషయాలు అనుకోకుండా ఇతరులకు తెలిస్తే, అవి మీ ఉద్యోగానికి ఇబ్బందిగా మారవచ్చు. అందుకే ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే పరిమితంగా విషయాలను పంచుకోవాలి.

స్నేహం వల్ల పని దెబ్బతినడం.. 

మంచి స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ, ప్రతిసారీ వారి పని భాద్యతలను మీ భుజాన వేసుకోవడం వల్ల మీ సొంత పర్ఫామెన్స్ తగ్గిపోతుంది. దీనివల్ల మీ లక్ష్యాలను సమయానికి పూర్తి చేయలేక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీ పని ప్రాధాన్యతలను స్పష్టంగా తెలుసుకుని, స్నేహానికి, పనికి మధ్య సరిహద్దులు గీసుకోవడం చాలా ముఖ్యం.

ఆఫీసు రాజకీయాల్లో చిక్కుకోవడం..

స్నేహితుడి మాటలు విని ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా ఆఫీసు వర్గపోరులో భాగం కావడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇలాంటి విషయాల్లో నిష్పాక్షికంగా ఉండటం, ప్రతికూల చర్చలకు దూరంగా ఉండటం వల్ల మీరు అందరి వద్ద మంచి పేరు నిలుపుకోగలుగుతారు.

పని మరియు స్నేహం మధ్య బ్యాలెన్స్..

ఆఫీసుల్లో స్నేహ సంబంధాలు ఎంత ముఖ్యమో, వృత్తిపరమైన బాధ్యతలు కూడా అంతే ముఖ్యం. మర్యాదగా ప్రవర్తిస్తూ, నిష్పాక్షికంగా ఉంటూ, మీ పనిపై దృష్టి పెడితే స్నేహాన్ని కాపాడుకుంటూనే కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.


 

                           *రూపశ్రీ.

By
en-us Political News

  
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఫ్రాన్స్‌లో తొలిసారిగా మనిషికి సోకిన ప్రాణాంతక షమోండా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైబీపీని సహజంగా తగ్గించడంలో బీట్‌రూట్ జ్యూస్ మరియు దానిమ్మ జ్యూస్ ఎలా పనిచేస్తాయి? రక్తపోటు నియంత్రణకు ఏది అత్యంత ప్రభావవంతమైనదో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది పరస్పర నమ్మకం, గౌరవం , నిజాయితీ. రెండు మనస్సులు కలిసి ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం.
భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం.
భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం.
శనగల్లో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. రోజూ ఒక కప్పు శనగలు తింటే గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు షుగర్, బీపీ అదుపులో ఉంటాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రోజూ పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా 15 నుంచి 30 నిమిషాలు నడవడం వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్రలేమి నివారణ, రోగనిరోధక శక్తి పెరగడం వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గ్రౌండింగ్ లేదా బేర్‌ఫుట్ వాకింగ్ వల్ల కలిగే పూర్తి వివరాలు తెలుసుకోండి.
మార్కెట్ ప్రొడక్ట్స్‌కు దూరంగా.. ఎలాంటి రసాయనాలు కలపకుండా 100 శాతం స్వచ్ఛమైన రోజ్ వాటర్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. చర్మ సంరక్షణకు అద్భుతమైన ఈ చిట్కాతో మీ అందాన్ని మరింత పెంచుకోండి.
ఉల్లిపాయలు, వెల్లుల్లి తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను తక్షణమే క్షణాల్లో పోగొట్టే అద్భుతమైన, సులువైన 7 చిట్కాల గురించి ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.