రోజూ, ఒక కప్పు శనగలు తింటే, మీ శరీరానికి ఈ లాభాలు పక్కా!
Publish Date:Oct 22, 2026
Advertisement
మన వంటింట్లో ప్రతిరోజూ ఉపయోగించే సాధారణ ఆహార పదార్థాలలో శనగలు ముందుంటాయి. వీటిని కేవలం గుడిలో ప్రసాదంగానో లేదా అప్పుడప్పుడు చేసుకునే ఉడికించిన గుగ్గిళ్లగానే చాలామంది భావిస్తారు. కానీ, శనగలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదని, ఇవి మాంసం కన్నా శక్తివంతమైన పోషకాలను అందించే అద్భుతమైన సూపర్‌ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. రోజూవారీ ఆహారంలో కనీసం ఒక కప్పు శనగలను చేర్చుకోవడం ద్వారా శరీమానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, మరియు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా శాకాహారులకు, మాంసాహారం తినని వారికి ఇవి అత్యుత్తమ ప్రొటీన్ వనరుగా నిలుస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని అసాధారణ రీతిలో పెంచడంతో పాటు, చిన్నచిన్న అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఇవి దివ్యౌషధంలా కాపాడుతాయి. శనగల్లో పొటాషియం పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం ఒక కప్పు శనగల ద్వారా సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం మన శరీరానికి అందుతుంది. ఈ పొటాషియం రక్తపోటును (బీపీ) అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం శనగలు తినడం వల్ల అధిక రక్తపోటు క్రమంగా తగ్గి, గుండె జబ్బులు మరియు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, శనగల్లో ఉండే సెలీనియం, మెగ్నీషియం, విటమిన్ బి, మరియు ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి తోడ్పడతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో శనగలు ఎంతగానో సహాయపడతాయి. మన శరీరానికి ఒక రోజులో అవసరమయ్యే ప్రోటీన్‌లో మూడో వంతు కేవలం 28 గ్రాముల శనగల ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా పొట్టు తీసిన శనగల కంటే, పొట్టుతో కూడిన శనగలు మరింత ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే రాఫినోస్ అనే సాల్యూబుల్ ఫైబర్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేసి, జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన విష పదార్థాలను (టాక్సిన్లను) బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే, వీటిని ఒకేసారి అతిగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి చిన్నపాటి అసౌకర్యం కలగవచ్చు కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది. మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారికి శనగలు ఒక అద్భుతమైన వరం లాంటివి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే శనగలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్ లెవెల్స్) ఒక్కసారిగా పెరుగవు. పైగా వీటిలో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల, షుగర్ స్థాయిలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని క్లినికల్ అధ్యయనాలు నిరూపించాయి. శనగల్లో కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఎ, ఇ, ఫోలేట్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ పోషకాల సమ్మేళనం ఎముకలను బలోపేతం చేసి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే శరీరం ఐరన్‌ను మెరుగ్గా గ్రహించేలా చేసి రక్తహీనత (అనీమియా)ను తరిమికొడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో నానబెట్టి, ఉదయాన్నే మొలకలుగా లేదా గుగ్గిళ్ల రూపంలో వీటిని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. chickpeas for weight loss heart,daily chickpeas benefits telugu.
http://www.teluguone.com/news/content/health-benefits-of-chickpeas-35-235007.html





