తెలంగాణ తెలుగుదేశంలోపార్టీ కోసం పనిచేసే సారధి ఎవరు?

Publish Date:Dec 29, 2023

Advertisement

తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుగుదేశం ఉన్నా నాయకులు లేరన్నది కళ్ళకు కనిపిస్తున్న సత్యం. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలకు కొదవ లేదు.  ఆంధ్రా సెటిలర్లతో పాటు తెలంగాణ ప్రజలలో కూడా తెలుగుదేశంపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సమాజం పక్క పార్టీల వైపు చూడాల్సి వచ్చింది కానీ.. అవసరమైతే ఇప్పుడైనా తెలుగుదేశం జెండా చేత పట్టేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. నేటికీ చెక్కు చెదరకుండా గ్రామ గ్రామాన కనిపిస్తున్న తెలుగుదేశం జెండా దిమ్మలే అందుకు నిదర్శనం. పదేళ్లుగా తెలుగుదేశం ఇక్కడ యాక్టివ్ లేకపోయినా ప్రతి ఏడాది జెండా దిమ్మకి రంగులేసి, జెండా ఎగరేసి పండగ జరిపే అభిమానం మాత్రం కనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికలలో కూడా తెలుగుదేశం జెండాలు రెపపలాడాయి. తెలంగాణలో పోటీచేసిన అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా చేతబట్టాల్సిన పరిస్థితి కనిపించింది. మరి ఇంతటి అభిమానం ఉన్న పార్టీకి అధ్యక్షుడు ఎవరు? ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సగటు తెలుగుదేశం అభిమానిని వేధిస్తున్న ప్రశ్న. 

బలమైన కార్యకర్తలున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చెప్పుకోదగ్గ నేతలు లేరు. కానీ  ఉన్న వారిలో నేనంటే నేను అధ్యక్షుడిని కావాలంటూ పరితపించేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నదే పదిమంది నేతలు కాగా.. వారిలో రాష్ట్రస్థాయి ఉన్న నేతలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ, ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా అందరూ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పట్టుమని పక్కన నలుగురు కార్యకర్తలు, అనుచరులు లేకపోయినా తమను తాము నాయకులుగా చెప్పుకుంటూ అధ్యక్ష పదవి కోసం అర్రులు చాస్లూ పైరవీలు చేస్తున్నారు. ఇంకొందరైతే పక్క రాష్ట్రంలో ఉంటూ కూడా తెలంగాణ రాష్ట్ర టీడీపీకి అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారు. మరి అందరూ పల్లకి  ఎక్కాలంటే  మోసే వారెవరన్నది ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. కనీసం వారి స్థాయి కూడా ఆలోచించకుండా కొందరు అధ్యక్ష హోదా కోసం పరితపిస్తున్నారు. వీరిని చూస్తే రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవి అంటే అంత చులకన అయిపోయిందా అనిపించకమానదు.

  రాష్ట్ర స్థాయి పదవి అంటే కాస్త అర్ధబలం, అంగబలం ఉండాలి. ఒక్కోసారి అధిష్టానంతో కూడా పనిలేకుండా సొంత నిధులు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేయాల్సి వస్తుంది. కానీ, ఇప్పుడు పదవికి పోటీ పడేవారిలో చాలామంది  నలుగురు కార్యకర్తలను పోషించే స్థోమత కూడా లేని వారు. పోనీ కార్యకర్తలలో మంచి పేరు, పరిచయాలు అయినా ఉన్నాయా అంటే అదీ లేదు. మరి ఏమి చూసుకొని వారు అధ్యక్ష పదవి ఆశిస్తున్నారన్నది సగటు కార్యకర్తను వేధిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీ అయి   రెండు నెలలు కావోస్తున్నది. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నాక తర్వాత ఇప్పటి వరకూ ఆ పదవిని భర్తీ చేయలేదు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండడం, తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అంత హైరానా పడాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ, ఏపీలో సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ సమయంలో పార్టీ పెద్దల ఫోకస్ ఏపీ మీదనే ఉంటుంది కనుక ఈలోగా తెలంగాణ అధ్యక్షుడి నియామకం పూర్తి చేసి పార్టీని అంతో ఇంతో ఇక్కడ యాక్టివ్ చేయాల్సి ఉంది. 

దీంతో ఈసారి తెలంగాణ తెలుగుదేశం కోసం బరిలో నిలిచే నాయకులు ఎవరు? పార్టీ కోసం వెన్నంటి నిలిచే నాయకుడు ఎవరు? అన్నది ఆసక్తిగా మారింది. కొన్నాళ్ళుగా ఇక్కడ   పార్టీని మోసం చేస్తూ,   పక్క పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న నాయకులే దొరికారు. అయితే, ఈసారి ఇలాంటి వారి పట్ల చంద్రబాబు అప్రమత్తంగా ఉంటూ అధ్యక్షుడి నియామకంలో జాప్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈసారి అయినా సమర్థమైన నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే ఇక్కడ   మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. ముఖ్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి, పార్టీలో ఉంటూ ఇతర పార్టీలో సత్సంబంధాలు ఏర్పరచుకున్న వారికి, పట్టుమని పదిమంది కార్యకర్తలను కూడా పోగు చేయలేని వారికి, వివాదాలకు కేరాఫ్ గా నిలిచే వారికి, ఆవేశపరులకు, సోషల్ మీడియా స్టార్లకు, కాకుండా నిజమైన పార్టీ  విధేయులకు అధ్యక్ష హోదా ఇవ్వాల్సి ఉంది. మరి కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకునే నాయకులు ఎవరో.. వారిని ఎప్పుడు నియమిస్తారో వేచి చూడాలి.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.