సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువైన పనిచేసే తేనెటీగలు

Publish Date:Dec 10, 2020

Advertisement

తేనెటీగలు అంతరించిపోతే ..

పార్క్ లోనూ... ఎప్పుడైనా పొలాల వైపు వెళ్లినప్పుడో తేనెటీగలను చూస్తాం.
అవి ఎక్కడ కుడ్డతాయో అని భయపడతాం. కానీ, ఆ తేనెటీలు లేకపోతే మనకు ఆహారమే కష్టం అన్న విషయం మాత్రం గమనించం. వాటి మకరందం సేకరణ వెనుక జీవజాతి ఆహారం ఆధారపడి ఉంది అన్నది వాస్తవం.. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అన్నది నిత్యసత్యం. తేనెటీగలకు మనం తినే ఆహారానికి ఎంటో సంబంధం అనుకుంటున్నారా..
చాలా ఉంది..

పర పరాగ సంపర్కం.. సైన్సు పాఠ్య పుస్తకాల్లో కనిపించే సామాన్య పదం ఇది. కొన్ని రకాల కీటకాలు ఒక పువ్వు నుంచి మరో పువ్వు మీద వాలినప్పుడు, వాటి కాళ్లకు అంటుకున్న పుప్పొడి రేణువుల ద్వారా పర పరాగ సంపర్కం జరిగి ఆయా మొక్కల ప్రత్యుత్పత్తి జరుగుతుందని ఈ పాఠం చెబుతుంది. అంటే ప్రకృతి పచ్చగా కళకళలాడాలంటే కీటకాల పాత్ర కీలకం. తేనెటీగలు, తుమ్మెదలు, తూనీగలు... ఇవన్నీ కూడా పుప్పొడి వాహక కీటకాలే. పర పరాగ సంపర్క చోదకాలే. ఇలాంటి వాటన్నిటినీ కలిపి ‘పాలినేటర్స్‌’ అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ తప్పిదాల వల్ల క్రమక్రమంగా ఈ ‘పాలినేటర్స్‌’ అంతరించిపోతున్నాయి. ‘పాలినేటర్స్‌’ లేని ప్రపంచాన్ని ఊహించడమంటే... పోషకాలనిచ్చే పండ్లు, గింజలు, కూరగాయల మొక్కలు లేని ప్రకృతిని వీక్షించడమే. అందుకే పలు గుణపాఠాల అనంతరం యావత ప్రపంచం అప్రమత్తమయ్యింది. పలు దేశాలు యుద్ధప్రాతిపదికన వీటిని అభివృద్ధి చేయడానికి నడుం బిగించాయి.

తేనెటీగలు మీకు ఇష్టమైన కీటకాలు కాకపోవచ్చు. ఎందుకంటే అవి కుడితే నిజంగా బాధేస్తుంది. అయితే పర పరాగ సంపర్కం జరిపే ముఖ్యమైన కీటక జాతుల్లో తేనెటీగలు అగ్రస్థానంలో ఉన్నాయి.  ప్రపంచ జనాభాకు కావల్సిన ఆహారంలో అధికశాతం ఈ తేనెటీగల పరాగ సంపర్కం ములానే లభిస్తుంది. . కానీ నేడు రికార్డ్ స్థాయిలో ఈ తేనెటీగలు చనిపోతున్నాయి. ఒకవేళ ఈ తేనెటీగలే లేకపోతే, మన ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి ఏమైపోతుంది..? రేపు ఒకవేళ సడన్ గా ఈ భూమిపై ఉన్న తేనెటీగలనీ చనిపోతే పరిస్తితులేం బావుండవు.  సమతుల్య ఆహారం కోసం, మానవులకు అవసరమైన పండ్లు, ఇతర కూరగాయలు, మొక్కల పునరుత్పత్తి చేయడానికి, వాటిని పెంచడానికి ఈ పరాగ సంపర్కం అవసరం. ఈ సంపర్కాన్ని తేనెటీగలు బెస్ట్ అని చెప్పవచ్చు. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి పుష్పించే మొక్కలతో కలిసి ఉండటం వల్ల ఇవి పరాగ సంపర్క యంత్రాలుగా
మారిపోయాయి. మనం తినే 84శాతం పంటలను పరాగ సంపర్కం చేయడానికి తేనెటీగలు సహాయపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆహార వార్షిక ఉత్పత్తిలో 236 బిలియన్ డాలర్ల నుండి 577 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ తేనెటీగలు లేదా పరాగ సంపర్కం చేసే ఇతర కీటకాలు లేకుంటే ఇవాళ ఉండే సూపర్ మార్కెట్లలోని కూరగాయలు, పండ్లు సగం వరకు ఉంటాయి. తేనెటీగల్లో విలుప్త వినాశనకరమైన డొమైన్ ను కలిగివుంటుంది. అది మొక్కలను తినే జంతువులని సంహరించడమే కాకుండా ఫుడ్ చైన్ ను పెంచుతూ పోతుంది. అమెరికన్ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం తేనెటీగలు మనకు చేసే పని సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువతో సమానం అని లెక్కకట్టింది. ఒకవేళ అవే లేకుంటే మన ఉత్పత్తి ఖర్చు ఆకాశాన్ని అంటుకునేదేమో..?సామాజికంగా, ఆర్థికంగా సవాళ్ళను ఎదుర్కొంటున్న వాళ్ళు సమతుల్యమైన ఆహారాన్ని ఇప్పటికే పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్లపై మరింత ఘోరమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

మనం ఊహించిన దానికంటే కూడా తేనెటీగలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. 2018 సంవత్సరంలో అమెరికాలోని తేనెటీగల పెంపకందారుల్లో తమ కాలనీలో 45శాతం కోల్పోయామని చెప్పారు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంగా రికార్డ్ స్థాయిలో తేనెటీగలు చనిపోతున్నాయి. తేనెటీగలు అకస్మాత్తుగా ఇలా తగ్గిపోవడానికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను కనుగొనలేదు కానీ, గ్లోబల్ వార్మింగ్, అధిక మోతాదులో పురుగుల మందుల వాడకం, తేనెటీగల పెంపకంపై వైరసును వ్యాప్తి చేసే పరాన్నజీవి వర్రోవా వంటి పురుగులు కారణం అని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తేనెటీగలను పర్యవేక్షణ చేయడానికి, రోబోట్లను ఉపయోగించి కొత్త పరాగ సంపర్క పద్దతులను
రూపొందించడానికి కృషి చేస్తున్నారు.

సగటు మనిషి తేనెటీగలతో స్నేహంగా ఉండటానికి ఏమిచేయవచ్చు అనే ప్రశ్న రావచ్చు. మీకు ఉద్యానవనం ఉంటే అందులో పువ్వులను నాటండి, వాటిపై వాలిన తేనెటీగలు సంవత్సరం పొడవునా అమృతాన్ని ఇస్తాయి.  తేనెటీగల్లో స్థానిక తేనెటీగలు, అడవి తేనెటీగలు అని రకాలు ఉంటాయి. కొన్ని మట్టిలో గుడుకట్టుకొని ఉంటాయి. ఒకవేళ మట్టిని చదును చేస్తుంటే తేనెటీగలు ఉన్న వాటిని వదిలివేయడం, ఆ మట్టికి నీళ్ల అందేలా చూడటం, సాధ్యమైతే పురుగుల మందులకు దూరంగా ఉండటం కూడా వాటికి సహాయ పడినట్లే.

ప్రపంచ తేనెటీగల జనాభాను కాపాడటానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నప్పటికీ భూమిని రక్షించు కోవడానికి ఇంకా చేయాల్సింది మాత్రం చాలానే ఉంది.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.