తమ డబ్బు మొత్తాన్ని కోల్పోయిన 5 మంది బిలియనీర్లు

Publish Date:Mar 17, 2021

Advertisement

సంపద తెలియకుండానే టెంకాయ లోపలి నీరు వచ్చినట్లు వస్తుంది. సంపద తెలియకుండానే ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలె   మాయమవుతుంది అంటూ సుమతీశతకంలో చెప్పారు. ఈ విషయం కొంతమంది జీవితాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. చాలా తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తిన వారు అంతే తక్కువ సమయంలో పాతాళానికి పడిపోతారు. అలాంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుందాం...

ఐకే బాటిస్టా

బ్రెజిలియన్ వ్యాపారవేత్త, కానీ అతను దురదృష్టవశాత్తు తన డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. మైనింగ్ , చమురు పరిశోధన పరిశ్రమలో రాణించిన అతను రెండు దశాబ్దాల కాలంలో తన వైభవాన్ని దానిని కోల్పోయాడు. 2011 సంవత్సరంలో అతని ఆస్తుల విలువ  30 బిలియన్ డాలర్లు.  ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఎనిమిదో వ్యక్తిగా నిలిచాడు, బ్రెజిల్‌లో అత్యధిక సంపన్నుడి స్థాయిని అందుకున్నాడు. అయితే మైనింగ్ పరిశ్రమలో అకస్మాత్తుగా పతనం ప్రారంభమైంది. తన అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ogx కుప్పకూలింది. ఆ తర్వాత సంపద తగ్గిపోతూ బిలియనీర్ స్థాయి పడిపోయింది. 2013 సంవత్సరంలో, ఫోర్బ్స్ ప్రకారం దాదాపు 20 బిలియన్ల ఆస్తులను అతను కోల్పోయాడు. కేవలం ఒక సంవత్సరంలోనే విపరీతమైన నష్టాలను చవిచూశాడు. ఆ తర్వాత అతని అపారమైన అప్పులు,  పడిపోతున్న కంపెనీ స్టాక్ కారణంగా ఆస్తులన్నీ కోల్పోయాడు. తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని అమ్మేశాడు. 2017 సంవత్సరంలో బ్రెజిల్ అధికారులు అతన్ని 100 మిలియన్ డాలర్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు.

అలెన్ స్టాన్ఫోర్డ్

ఈ వ్యక్తి మాజీ బిలియనీర్, ఫైనాన్షియర్. అయితే ఇప్పుడు మాత్రం శ్రీకృష్టుడి జన్మస్థానంలో ఉన్నాడు.  2009లో అతనికి 110 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు కాగా ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నాడు.   ఆర్థిక కుంభకోణంలో దోషిగా నిర్ధారించబడిన తరువాత శిక్ష పడింది. అతను ఇప్పుడు వాడుకలో లేని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ స్టాన్ఫోర్డ్ ఫైనాన్షియల్ గ్రూప్ చైర్మన్. 136 వివిధ దేశాలలో  కనీసం 30,000 మంది ఖాతాదారులలో 8.5 బిలియన్ డాలర్లు ఉన్న సహాయక సంస్థలలో ఒకటి. ఈ సంస్థ  2009 లో ప్రారంభమైంది.  అయితే ఈ కంపెనీ ప్రారంభమైన సెకన్ లోనే  అలెన్ స్టాన్ఫోర్డ్ పై అన్వేషణ ప్రారంభించింది. 8 బిలియన్ డాలర్ల అధిక దిగుబడి ధృవీకరణ పత్రాలను అక్రమంగా విక్రయించినందుకు అతనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.  మనీలాండరింగ్, చీటింగ్ తదితర ఆరోపణలతో 2009 జూన్ లో అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత 110 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

ఎలిజబెత్ హోమ్స్

ఎలిజబెత్ అమెరికన్ ఆవిష్కర్త , ఎంటర్ ప్రెన్యూర్,   ఆమె హెల్త్ కేర్ టెక్నాాలజీ కార్పోరేషన్ ప్రారంభించిన తర్వాత  2015లో సెల్ఫ్ మెడ్  మహిళా బిలియనీర్ గా రికార్డ్ సృష్టించారు.  ఆ సంస్థ 9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకోవడంతో పాటు భారీగా లాభాలు ఆర్జించింది. 2015 నాటి 100 మంది అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో  ఆమె పేరు చేరడంతో  సెలబ్రిటీ అయ్యారు. ఆ తర్వాత ఎలిజబెత్ కంపెనీపై అన్వేషణ జరిగింది. కొత్త ఇన్వెంటివ్ బ్లడ్ టెస్టింగ్ టెక్నాలజీ గురించి పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత  ఆమెపై విశ్వసనీయత, ఆమె వ్యక్తిగత ఆస్తులు రెండూ తగ్గిపోవడం ప్రారంభమైంది.  . ప్రపంచంలోని అత్యంత నిరాశపరిచిన నాయకులలో ఒకరిగా హోమ్స్ పేరును ఫోర్బ్స్ పేర్కోంది.  మెడికేర్ , మెడిసిడ్ సేవలు అందించే ఆమె కంపెనీలో రెండు సంవత్సరాలు ఎలాంటి పోజిషన్ ఇవ్వలేదు.

బెర్నార్డ్ మాడాఫ్

పోంజీ పథకాలకు(చైన్ లింక్) రూపకల్పన చేసిన వ్యక్తి బెర్నార్డ్.   2008 లో అరెస్టు అయ్యేవరకు దాదాపు 20 ఏళ్ళపాటు మార్కెట్ లో చైన్ లింగ్ సామాజ్యాన్ని పరిపాలించాడు. స్ప్లిట్ స్ట్రైక్ కన్వర్షన్ అనే తన వెంచర్ వ్యూహంతో అతను వేలకొలది బిలియన్ డాలర్ల పెట్టుబడిదారులను విజయవంతంగా మోసం చేశాడు. అతను తన ఖాతాదారులకు అధిక , స్థిరమైన రాబడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. తన నిధులను ఒకే బ్యాంకు ఖాతాలో జయ చేయడం ద్వారా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించేవాడు. అయితే  2008 ఆర్థిక సంక్షోభ సమయంలో అతని పథకం విఫలమైంది.  మార్కెట్లలో ఎక్కువ మంది ఖాతాదారులను ఆకర్షించలేకపోయాడు. ఆ తర్వాత అతని 64.8 బిలియన్ డాలర్ల మోసం బయటపడింది. దాదాపు  బిలియన్ డాలర్ల సంపద కూడబెట్టినట్లు అంచనా.


విజయ్ మాల్యా

భారతీయ వ్యాపారవేత్త ,  మాజీ బిలియనీర్, అతను ప్రస్తుతం ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు బ్రిటన్ లో తలదాచుకున్నాడు. అతనిని UK నుండి భారతదేశానికి అప్పగించే అంశంపై చర్యలు జరుగుతున్నాయి. విజయ్ మాల్యా  28 ఏళ్ళ వయసులో తన తండ్రి  సంస్థను స్వాధీనం చేసుకున్నాడు.  ఆ తర్వాత వ్యాపారాన్ని విస్తరిస్తూ కింగ్ ఫిషర్ బ్రాండ్ మద్యం మార్కెట్ లోకి తీసుకువచ్చి సంపన్నుల జాబితాలో చేరాడు.  మద్యం  వ్యాపారాన్ని మల్టీ బిలియన్ డాలర్ల సంస్థగా మార్చాడు. కానీ దురదృష్టవశాత్తు, అతని విమానయాన సంస్థలు నష్టాల బాటపట్టింది.  బ్యాంకులతో తీసుకున్న అప్పులు ఎగవేతకు పాల్పడ్డాడు. యునైటెడ్ స్పిరిట్స్ అని పిలువబడే తన సంస్థపై నియంత్రణను కోల్పోయాడు . చైర్మన్ పదవి నుండి తప్పుకోవలసి వచ్చింది. అతని ఆస్తులు వేలం వేయమని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అతనిని యూకె నుంచి భారత్ కు రప్పించడానికి చర్చలు జరుగుతున్నాయి.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.