మనసులో ప్రేమ ఉంటే సరిపోదు.. ఇలా ప్రేమను వ్యక్తం చేస్తే బంధాలు పదిలంగా ఉంటాయ్!
Publish Date:Jun 30, 2026
Advertisement
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ చాలా ప్రత్యేకమైనది. చాలామంది రిలేషన్లో ఉన్నప్పుడు తమ బాగస్వామిని చాలా ప్రేమిస్తుంటారు. కానీ ఏదైనా సందర్బం వస్తే నువ్వు నన్ను ప్రేమించడం లేదు అనే మాటను ఎదుర్కుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే.. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకపోవడం వల్ల. ప్రేమించడం గొప్ప కాదు.. కానీ ప్రేమను సరైన విదంగా వ్యక్తం చేయకపోవడం వల్లే అసలైన సమస్య వస్తుంది. ప్రేమను సరైన విధంగా వ్యక్తం చేస్తే ఆ బంధాలు ఎంతో పదిలంగా పదికాలల పాటు సంతోషంగా ఉంటాయి. బంధాలను బలంగా మార్చుకోవడానికి ప్రేమను వ్యక్తం చేసే పద్దతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మనసులో కాదు.. మాటల్లో చెప్పాలి.. ప్రేమను మనసులో దాచుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కొంతమందికి ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలే మంచి ఆయుదం. “నాకు నీ పట్ల గర్వంగా ఉంది”, “నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి”, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి చిన్న వాక్యాలు కూడా ఎదుటి వారి హృదయాన్ని టచ్ చేస్తాయి. భాగస్వామి తమ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరుస్తుంటే, వారిని మెచ్చుకోవడం, వారి ప్రయత్నాలను అభినందించడం, ప్రేమ సందేశాలు పంపడం వంటివి ఆ బంధాన్ని బలపరుస్తాయి. సమయం.. కొంతమందికి ప్రేమను వెలిబుచ్చడానికి అత్యంత విలువైనది వారి సమయం. వారికి ఖరీదైన బహుమతుల కంటే, ఎలాంటి ఆటంకం లేకుండా వారితో సమయం గడపడమే ముఖ్యం. ఫోన్‌ను పక్కన పెట్టి మాట్లాడుకోవడం, కలిసి నడవడం, కాఫీ డేట్‌కు వెళ్లడం లేదా కేవలం కలిసి కూర్చుని ఆ రోజు జరిగిన సంఘటనలను షేర్ చేసుకోవడం వంటివి కొందరికి చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి వారికి, లైప్ పార్ట్నర్ ఉనికే చాలా పెద్ద బహుమతి. స్పర్శ.. చాలా మంది కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం వంటి టచింగ్ ద్వారా ప్రేమను అనుభూతి చెందుతారు. ఒకరినొకరు స్పృశించుకోవడం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు, భావోద్వేగ భద్రత , అనుబంధం కూడా ఇందులో భాగమే. అలాంటి వ్యక్తులు ప్రేమతో కూడిన టచింగ్ ను పొందినప్పుడు, వారు తమ సంబంధంలో మరింత భద్రతగా, అనుబంధంగా , సంతోషంగా ఫీలవుతారు. మెమరీస్.. బహుమతులు ఇష్టపడేవారు బయటి విషయాలలోనే ప్రేమను చూస్తారని చాలామంది తరచుగా అనుకుంటారు, కానీ ఈ నమ్మకం ఎప్పుడూ సరైనది కాదు. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం. ఇందులో బహుమతి ధర ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భావనే ముఖ్యం. ఒక చిన్న పువ్వు, ఇష్టమైన చాక్లెట్, లేదా ప్రయాణం నుండి తెచ్చుకున్న ఒక చిన్న గిఫ్ట్ కూడా వారికి చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఇది వారి గురించి ఆలోచిస్తున్నారని, వారిని గుర్తుంచుకుంటున్నారని వారికి తెలియజేస్తుంది. సహాయం.. కొంతమందికి, “నేను నీకు సహాయం చేస్తాను” అని చెప్పడం కంటే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. భాగస్వామి సహాయానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి విలువ ఇస్తే, వారికి చిన్న చిన్న పనులలో సహాయం చేయడం, వారి బాధ్యతలను తేలికపరచడం లేదా అవసరమైనప్పుడు సపోర్ట్ ఇవ్వడం వంటివి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నారనే భావనకు గురి చేస్తాయి. వారికి మాటల కన్నా చేతలే గొప్పవి. కష్టసమయాలలో.. ప్రతి సంబంధం కేవలం సంతోషకరమైన క్షణాలపై మాత్రమే ఆధారపడి ఉండదు. కష్ట సమయాల్లో ఒకరికొకరు మానసికంగా అండగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తమ మాటలను ఎలాంటి జడ్జ్ చేయకుండా విన్నప్పుడు, వారి భావాలను అర్థం చేసుకున్నప్పుడు, కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచినప్పుడు, కొంతమంది తాము ప్రేమించబడ్డామని భావిస్తారు. అలాంటి వారికి ఏ బహుమతి లేదా ప్రేమను వ్యక్తపచడానికి స్పెషల్ గా వేరే ఏ పని చేయకపోయినా , ఎమోషనల్ సందర్భాలలో మద్దతుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. ప్రేమను ఎలా గుర్తించాలి? ఎక్కువ ప్రేమగా అనిపించే విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. భాగస్వామి తరచుగా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో గమనించాలి. ఏది లోపించిందని అనిపిస్తుందో, ఏది మిమ్మల్ని బాధపెడుతుందో అది కూడా ఒక సంకేతం కావచ్చు. నిష్కపటంగా మాట్లాడాలి , ఒకరి ఎమోషన్ సపోర్ట్ ను మరొకరు అర్థం చేసుకోవాలి. *రూపశ్రీ.
ఇలాంటి వ్యక్తులు విమర్శలను కూడా మరింత లోతుగా తీసుకుంటారు, కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు పాజిటివ్ పదాలను ఎంచుకోవడం ముఖ్యం.
http://www.teluguone.com/news/content/express-love-this-way-to-build-stronger-relationships-35-224632.html





