ప్రజాప్రతినిథుల విందు వెనుక లోకేష్ ప్లానేంటి?

Publish Date:Feb 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు, అలాగే  రాష్ట్రంలో రానున్న రోజులలో రాజకీయపరిస్థితులు ఎలా మారబోతున్నాయి. క్వాంటం, ఏఐ అంటూ సాంకేతికతపై చంద్రబాబు సర్కార్  చూపుతున్న ప్రాధాన్యత తదితర విషయాలపై ‘వాస్తవ వేదిక’తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ చర్చించారు. అత్యంత విశ్లేషణాత్మకంగా సాగిన ఈ చర్చలో  నారా లోకేష్ ఆత్మీయ విందుపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ డిన్నర్ డిప్లమసీని తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారన్నారు.  నారా లోకేష్ గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్లతో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి ఆత్మీయ విందును ఒక దౌత్య మార్గంగా లోకేష్ ఎంపిక చేసుకున్నారన్నారు. అంతే కాకుండా ముందుముందు ఆయన సీఎం కావడానికి ఈ ఆత్మీయ విందు కార్యక్రమం పీఆర్ ఎక్సర్ సైజ్ గా డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించారు. గతంలో నారా లోకేష్ తనకంటూ ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ సీనియర్లను దూరం చేసుకున్నారనీ, ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు.

అందుకు డిన్నర్ డిప్లమసీని ఎంచుకున్నారని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఈ కార్యక్రమం భవిష్యత్ లో లోకేష్ సీఎం కావడానికి దోహదపడుతుందన్నారు. ఈ దశలో కంఠంనేని రవిశంకర్ లోకేష్ సీఎంగా ఉండేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడతారా అని ప్రశ్నించారు.  దీనికి డోలేంద్ర ప్రసాద్.. లోకేష్ సీఎం కావాలంటే కావలసింది పవన్ కల్యాణ్ సమ్మతి కాదనీ, ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరమని అంటూ.. పవన్ కల్యాణ్ ను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. పైగా ఈ ప్రతిపాదన ఢిల్లీ నుంచే వచ్చిందన్న సమాచారం ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లోపవన్ కల్యాణ్ సమ్మతి లేకుండా లోకేష్ సీఎం అవ్వడం కష్టసాధ్యమనీ, అందుకే ఆయనకు కేంద్ర మంత్రిపదవి అంటూ మోడీ ద్వారా నరుక్కువస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.  

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మాత్రమే బిల్ గేట్స్ తాజా పర్యటన ఉపయోగపడుతుంది తప్ప మరోటి కాదన్నారు. గతంలో బిల్ గేట్స్ ఏపీ పర్యటన మైక్రోసాఫ్ అధినేతగా ఉన్నప్పుడు జరిగిందనీ, అయితే ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగంలో లేరని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు డిల్ గేట్స్  తన ఛారిటీ ద్వారా దాతృత్వ కార్యక్రమాలపై  దృష్టి సారించారనీ, అందువల్ల ఇప్పపటి ఆయన పర్యటన, విద్య, ఆరోగ్యం, పాలనలో టెక్నాలజీకి సహకారం అందే అవకాశం అయితే ఉందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.  ఇక చంద్రబాబు ఘనంగా, గొప్పగా చెప్పుకుంటున్న క్వాంటం వల్ల రాష్ట్రానికి సాంకేతిక గుర్తింపు లభిస్తుంది తప్ప సామాన్య ప్రజలపై, ఐటీ ఉద్యోగాలపై ఇది ఇప్పటికిప్పుడు చూపే ప్రభావం చాలా చాలా పరిమితమన్నారు. ఇక తక్షణ ప్రయోజనం కూడా దాదాపు శూన్యమేనని డోలేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో ఈ కింది లింక్ ద్వారా వీక్షించండి

 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.