మెజార్టీకి అవసరమైన మద్దతు కూటగట్టుకుంటామని, ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కోరితే.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ ప్రస్తుతం టీవీకే వద్ద లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేస్తూ అనుమతి తిరస్కరించారు. ఆ క్రమంలో విజయ్‌కు రాజకీయ మద్దతు పెరుగుతూ.. , రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.
విజయ్ నేతృత్వంలోని టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
మరోవైపు, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్‌కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విజయ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారనీ, మరే ఇతర కూటమి కోరనప్పుడు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని.. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటోందని సీపీఎం తీవ్రంగా ఆరోపించింది. విజయ్‌కు కేవలం సీపీఎం మాత్రమే కాకుండా, ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు కూడా ప్రజా తీర్పును గౌరవించి విజయ్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని హితవు పలికింది. మరో వైపు డీఎంకే కూడా కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటునకు తాము అడ్డపడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు డీఎంకే అధినేత స్టాలిన్ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామని, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టి పారేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tvk-vijay-gaining-political-support-39-219169.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.