ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత నిర్దోషులు!

Publish Date:Feb 27, 2026

Advertisement

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్ఠించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 27) కొట్టివేసింది. మద్యం విధానం రూపకల్పనలో  ఎటువంటి అవినీతి జరగలేదని పేర్కొంటూ ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీసీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది. మద్యం కుంభకోణం పాలసీ రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ, వారిని నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.    రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. ఈ కేసులో నిందితులుగా ఉన్న  ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత, ఆమె ఆడిటర్ బుచ్చిబాబు సహా 20 మందినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలను కొట్టివేసింది. 

కాగా తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను అక్రమంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైల్లో పెట్టిన రోజులను గుర్తు చేసి,  చివరకు సత్యమే గెలిచిందందన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమపై బురద జల్లారని ఆరోపించారు.  ఈ కేసులో సీబీఐ సమర్పించిన సాక్ష్యాల్లో పస లేదనీ,  కేవలం అనుమానాలతో తీవ్రమైన ఆరోపణలు చేయజాలరన్నారు. ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టడం సరైంది కాదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.  తీర్పు తరువాత కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్  తనను జైలు గోడలు భయపెట్టలేదన్నారు. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత న్యాయం జరిగిందన్నారు. అందుకే ఆనందం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తోందనీ, ఇవి ఆనందబాష్ఫాలనీ చెప్పారు.  నన్ను జైలుకు పంపడం ద్వారా ఆప్ ను అంతం చేయాలని చూశారన్న కేజ్రీవాల్.. ఈ తీర్పుతో ఆ కుట్రలు పటాపంచలయ్యాయన్నారు.    

ఇలా ఉండగా ఈ కేసు వివరాల్లోకి వెడితే..  2021-22 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో  అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో  2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక  ఇచ్చారు. మద్యం వ్యాపారులకు మేలు చేసేలా ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించారనీ, అందుకు ప్రతిఫలంగా ఆప్   నాయకులకు రూ.కోట్ల ముడుపులు  అందాయని సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. ఈ స్కామ్‌‌లో  సౌత్ గ్రూప్  పేరుతో కొందరు వ్యాపారులు, కల్వకుంట్ల కవిత, మరి కొందరు రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు చేసింది. 100 కోట్ల రూపాయల వరకూ వరకు ముడుపులు చేతులు మారాయని సీబీఐ  దర్యాప్తులో తేల్చి నిందితులపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి ఫిబ్రవరి 26న ఆప్పటి ఢిల్లీ ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, 2024 మార్చి 15న కల్వకుంట్ల కవిత, మార్చి 21న అప్పటికి సీఎం హోదాలో ఉన్న సీఎం అరవింత్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారంతా ఒక్కొక్కరుగా బెయిల్‌పై విడుదలయ్యారనుకోండి అది వేరే సంగతి. ఆ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 27) తీర్పు వెలువరించింది.  అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా,  కల్వకుంట్ల కవితతో సహా మొత్తం ఈ కేసులో నిందితులుగా సీబీఐ పేర్కొన్న 23 మందినీ నిర్దోషులుగా ప్రకటించింది. 

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.