భార్యాభర్తలను మరింత దగ్గర చేసే మార్గాలు ఇవే..!

Publish Date:Jun 13, 2024

Advertisement

ప్రతి జంట జీవితం పెళ్లితో ఎంతో సంతోషంగా మొదలవుతుంది.  పెళ్లి తరువాత హనిమూన్ జరిగేవరకు అదొక ప్రపంచంలో ఉంటారు. ఆ తరువాత మెల్లగా వృత్తి, కుటుంబ బాధ్యతలలో పడిపోతారు. ఉద్యోగ ఒత్తిడులు, కుటుంబ బాధ్యతల కారణంగా భార్యాభర్తల మధ్య దగ్గరితనం కాస్త తగ్గడం మామూలే. ఇది అలాగే దీర్ఘకాలం కొనసాగితే భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులలా  ఫీల్ అయ్యే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు..  ఇద్దరి మద్య ఉండే బంధం బలహీనం అవుతుంది.  అలా కాకుండా భార్యాభర్తలు ఎప్పుడూ కొత్తగా పెళ్లైనవారిలా  సంతోషంగా సంతోషంగా ఉండాలంటే ఈ కింది పనులు తప్పక చెయ్యాలి.

టైం స్పెండ్ చేయాలి..


రోజువారీ జీవితం హడావిడిలో భాగస్వామితో  సమయాన్ని గడపడంలో చాలామంది  నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత బంధాన్ని, చనువును పునరుద్ధరించుకోవడానికి ఒకరికొకరు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. సాధారణ రోజుల్లో రాత్రి సమయాలు, వారాంతపు సెలవులు లేదా రాత్రి పూట ఇద్దరూ కలసి వంట చేయడం, ఇద్దరూ కలసి భోజనం చేయడం, ఇద్దరూ కలసి షాపింగ్ చేయడం,  పరధ్యానంగా ఉండకుండా ఒకరిని ఒకరు సంతోష పెట్టడం చేయాలి.  

ఆశ్చర్యం..

భాగస్వాములు చేసే చిన్న పనులు ఇద్దరి మధ్య సాన్నిథ్యాన్ని నిలివి ఉంచుతాయి.  ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేస్తాయి.  ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకోవడం ఇద్దరి మధ్య బందాన్ని చాలా బలపరుస్తుంది.  ఇవి పెద్ద పెద్దవి కానక్కర్లేదు.  భర్త ఆఫీసు నుండి ఇంటికెళ్తూ బార్యకు నచ్చింది తీసుకెళ్లడం,  భార్యకు నచ్చిన వంటకం నేర్చుకుని తయారు చేయడం వంటివి చేస్తే.. భార్య భర్త లంచ్ బాక్స్ లో అతనికి నచ్చిన ఆహారాన్ని పెట్టడం నుండి అతని ఆఫీసు ఒత్తిడిని అర్థం చేసుకుని అతనికి సహకరించడం వరకు చాలా ఉంటాయి.


కమ్యూనికేషన్..


చాలామంది మధ్య గొడవలు వచ్చేది, ఇద్దరి మధ్య దూరం పెరిగేది కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లనే.  భార్యాభర్తలు ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏ సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి. ఒకరి ఆలోచనలు,  ఒకరి ఆందోళనలు, ఒకరి అభిరుచులు, ఆశయాలు ఇలా ప్రతి ఒక్కటీ ఒకరితో మరొకరు చెప్పుకుని చర్చించుకోవడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని లోతుగా పెంచుతుంది.


ప్రయత్నాలు..

కొత్త పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది.  భార్యాభర్తలకు ఇద్దరికీ కొత్తగా ఉన్న పనిని ఇద్దరూ కలసి చేయడం, ఇద్దరూ కలసి దాన్ని నేర్చుకోవడం వల్ల ఇద్దరికీ ఒకరి సహకారం మరొకరికి అందుతుంది.  ఇది ఇద్దరూ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇన్ డైరెక్ట్ గానే చెబుతుంది. అంతే కాదు..  ఏదైనా పనిలో భాగస్వామి తోడైతే ఆ పని చేయడంలో ఉండే వ్యత్యాసం కూడా అర్థమవుతుంది.


థ్యాంక్స్ చెప్పాలి..


రోజువారి పనులలో  ఒకరి సహాయం మరొకరు తీసుకుంటూ ఉంటారు.  ఒకరి సమస్యలు మరొకరు ఆలోచించి పరిష్కరించుకుంటూ ఉంటారు. చిన్న విషయమైనా సరే.. థ్యాంక్స్ చెప్పడం, ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం, ఒకరిని మరొకరు పొగుడుకోవడం వంటివి ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ను మరింత దృఢంగా మారుస్తాయి. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ఉండేలా చేస్తాయి.


                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.