ప్రేమలో పదే పదే మనోవేదన కలుగుతోందా.. అసలు కారణం ఏంటో తెలిస్తే షాకవుతారు!
Publish Date:Apr 25, 2026
Advertisement
బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు, పెరిగిన వాతావరణం, గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్ చేసే ఒక ప్రయోగం. గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు, ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు. అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి. ఇలాంటి వారు భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు. ప్రేమలో లేదా రిలేషన్ లో అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి అలవాట్లు, ఆలోచనా విధానం ఇచ్చే ఫలితం. ప్రతి వ్యక్తి తన పద్ధతులను గుర్తించి, తమను తాము సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు, పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం, పాత ఆలోచనలు, సిద్దాంతాలలో చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి. *రూపశ్రీ.
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది, ఇష్టంగా అనిపిస్తుంది, తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి. పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు. ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి. అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/repeated-pain-in-love-you-need-to-know-this-35-218250.html




