కోడలికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. అత్తగారు తెగ మెచ్చుకునేస్తారు!

Publish Date:Apr 16, 2026

Advertisement

పెళ్లి అనేది ప్రతి అమ్మాయి  జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది.  ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు.  కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని.  ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు.  అయితే అత్తాకోడళ్లు  ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల  బంధం బాగుంటుంది.  ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది.  అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..

మద్దతు..

అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు.  అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే..  ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు.

గౌరవం, మర్యాద..

 అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే,  గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా,  నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది.

బాధ్యత..

ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది.  ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి,  బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట.

ప్రేమ, అనుబంధం..

అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని  మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది,  తెలియకుండానే కోడలి పట్ల  ఆమెకు  చాలా ఇష్టం ఏర్పడుతుంది.

మనసు విప్పి మాట్లాడటం..

 ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం  ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.


పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది.  కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో  అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.