యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
Publish Date:Mar 7, 2026
Advertisement
అమెరికా, ఇజ్రాయెలో, ఇరాన్ యుద్ధం ప్రభావం దేశంలోని సామాన్యుల వంటింటిపై పడింది. ఈ యుద్ధ ప్రభావంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం, ఆటంకం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్ లో గ్యాస్ ధరల పెంపును అనివార్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 60, వాణజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై రూ. 115 చొప్పున ధరలు పెంచింది. దీంతో గృహవసరాలకు వినియోగించే గ్యాస్ బండ ధర 965 రూపాయలకు, కమర్షియల్ సిలెండర్ ధర 2,076 రూపాయలకు చేరింది. ఈ పెంపు ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు తొలగి, పరిస్థితులు చక్కబడి, చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ధరల సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/war-effect-on-gas-prices-36-215155.html





