కేసు పరిష్కరించాలంటే మద్యం బాటిళ్లు కావాలి...ఎస్సై డిమాండ్

Publish Date:Apr 13, 2026

Advertisement

 

 సామాన్యులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే దారి తప్పితే ఇక బాధితులు ఎక్కడికి వెళ్లాలి? తన భూమి కబ్జాకు గురైందని, న్యాయం చేయాలని వేడుకున్న ఒక బాధితుడికి మీర్‌పేట ఎస్సై నుంచి విస్తుపోయే సమాధానం ఎదురైంది. సమస్య పరిష్కరించాల్సింది పోయి, తనకు అర్జెంటుగా మద్యం బాటిళ్లు పంపాలని సదరు అధికారి డిమాండ్ చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పరిధిలోని లెనిన్‌నగర్‌లో తిరుపతయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య లత పేరిట 2010లో గిఫ్ట్ డీడ్ ద్వారా సుమారు 11 గజాల స్థలం సంక్రమించింది. అందులో ఒక షెట్టర్ నిర్మించుకుని వారు సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గతంలో ఆ స్థలాన్ని విక్రయించిన వెంకటేష్ అనే వ్యక్తి, ఈ నెల 4న ఆక్రమణకు పాల్పడి అక్రమంగా నిర్మాణం చేపట్టాడు.

తన స్థలం ఆక్రమణకు గురైందని తిరుపతయ్య మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మీర్‌పేట ఎస్సై నాగభూషణం వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి, పనులు నిలిపివేయాలని ఆదేశించారు. అయినప్పటికీ అవతలి వ్యక్తి ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించడంతో, బాధితుడు మళ్లీ మళ్లీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఎస్సై నాగభూషణం బాధితుడికి ఫోన్ చేసి అసలు రంగు బయటపెట్టారు. కేసు విషయంలో సహాయం కావాలంటే తనకు వెంటనే రెండు మద్యం బాటిళ్లు పంపాలని కోరారు. తాను ఊర్లో లేనని తిరుపతయ్య చెప్పినప్పటికీ, వినకుండా "పిల్లలెవరితోనైనా సరే పంపించు" అంటూ ఒత్తిడి చేయడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఆదివారం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. పోలీసుల అవినీతి తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమస్యలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన అధికారులే ఇలా బాటిళ్ల కోసం బేరసారాలు ఆడటం ఖాకీల ప్రతిష్టను మంటగలుపుతోందని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరిస్తూ ఎస్సై నాగభూషణంపై వేటు వేశారు. ఆయనను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుడికి ఆ 11 గజాల స్థలం విషయంలో ఇప్పటికైనా పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.


 

By
en-us Political News

  
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
జగన్ మనసంతా విధ్వంసం, నిలువెల్లా స్వార్థం నిండి ఉందని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచం ఎంత పెద్దదైనా, దాన్ని నిలిపివేయడానికి కొన్ని కిలోమీటర్ల సన్నని సముద్ర మార్గమే చాలనేది నేటి జియోపాలిటిక్స్ చెబుతోంది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం కంటే ఎక్కువ భాగం సముద్ర మార్గాల ద్వారా జరుగుతోంది. అందులో కూడా అత్యంత కీలకమైన చమురు, సహజవాయువు, గోధుమలు, ఎలక్ట్రానిక్స్, కంటైనర్లు కొన్ని చోక్ పాయింట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా రిజర్వేషన్ల అమలు ఒక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.