అటు లోక్ సభలో వాకౌట్.. ఇటు తాడేపల్లిలో విమర్శల బ్లో ఔట్.. అమరావతిపై వైసీపీ సెల్ఫ్ గోల్

Publish Date:Apr 1, 2026

Advertisement

అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 1) లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించింది. ఈ బిల్లు గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ కూడా ఆమోదించగానే రాష్ట్రపతి సంతకంతో చట్ట రూరం దాలుస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఇక లాంఛనమే. అయితే లోక్ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే అంశంపై తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడారు.  

ఇదే సమయంలో అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న  వ్యాఖ్యలకు జగన్  ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు.   ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే    వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు. పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఎక్కువగా ఉండే నౌపాడలో వ్యూహాత్మకంగా వైసీపీ సభ నిర్వహించింది.  ఆ వేదిక నుంచి  అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రైతుల భూములు గుంజుకొని వారికి అన్యాయం చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలువిమర్శలు గుప్పించారు. నిధులన్నీ అమరావతికే ఇచ్చేస్తే ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటని ధర్మాన వంటి నేతలు విమర్శలు గుప్పించారు.

లోక్ సభలో బిల్లు వల్ల ఒరిగేదేం లేదంటూ బొత్స సన్నాయినొక్కలు నొక్కారు. వాటికి కొనసాగింపు అన్నట్లుగా జగన్ బుధవారం (ఏప్రిల్ 1) తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా స్థిరీకరిస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదాన్ని ఖండించారు. అసలు రాష్ట్రానికి రాజధాని ఎందుకు అన్నట్లుగా మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలపై  జగన్  ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండేది వారానికి రెండురోజులేననీ, ఇక ఉప ముఖ్యమంత్రి అమరావతిలో ఎప్పుడు ఉంటారన్నది ఎవరికీ తెలియదనీ సెటైర్లు గుప్పించారు. అదే సమయంలో తాను వారంలో రెండు రోజులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు చుట్టపు చూపుగా వచ్చి మిగతా సమయమంతా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమౌతున్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు.  మొత్తం మీద జగన్ వ్యూహాత్మకంగా లోక్ సభలో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా మీట్ పెట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించారు. 

అయితే ఆ సందర్భంగా  జగన్ అమరావతికి వ్యతిరేకంగా ఎంత గట్టిగా గళం విప్పితే రాజకీయంగా అంత భారీగా నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించడం లేదంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికలలో జగన్ కు ఘోర పరాజయం ఎదురుకావడానికి ప్రధాన కారణాలలో అమరావతిని నిర్లక్ష్యం చేయడం ఒకటన్న విషయాన్ని వైసీపీ నేతలే అంగీకరిస్తుండగా, జగన్ మాత్రం  తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో విపక్ష నేతగా జగన్ అమరావతిని అంగీకరించి, ఆమోదించిన విషయాన్ని కూడా ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు.

చంద్రబాబు వారంలో రెండు రోజులు హైదరాబాద్ వెడుతూ షటిల్ సర్వీస్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్న జగన్.. తాను వారంలో ఐదు రోజులు బెంగళూరులోనే కాపురం ఉంటున్న విషయాన్ని మాత్రం చెప్పుకోవడం లేదు. ఇక వ్యూహాత్మకం అని భ్రమిస్తూ రెండు రోజుల కిందట అమరావతికి వ్యతిరేకంగా తన పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతల చేత ప్రకటనలు చేయించిన జగన్.. గత ఎన్నికలలో ఉత్తరాంధ్ర కూడా అమరావతికి ఓటెత్తిన విషయాన్ని ఎలా మరచిపోయారని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

జగన్ ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో రెండు రోజుల కిందట ధర్మాన  అమరావతికి కొత్త భాష్యం చెప్పారు. రాజధానుల మార్పు అనేది ప్రజల చేతుల్లో ఉండాలని.. గతంలో మద్రాస్ నుంచి కర్నూలు.. కర్నూలు నుంచి హైదరాబాద్ రాజధానుల మార్పును గుర్తు చేశారు.  ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండడానికే జగన్  మూడు రాజధానులు అన్నారంటూ సమర్ధించారు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన మరచిపోయినదేంటంటే..  నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని ఎంపిక చేసి అభివృద్ధి చేశారన్న విషయాన్ని కన్వీనియెంట్ గా మర్చిపొతున్నారు. అంతే కాకుండా అమరావతికి వైసీపీ విపక్షంలో ఉండగా సంపూర్ణ మద్దతు ఇచ్చిందనీ, ఈ మద్దతును సాక్షాత్తూ పార్టీ అధినేత జగనే అసెంబ్లీ వేదికగా ప్రకటించారనీ విస్మరిస్తున్నారు.  

ఇక ఉత్తరాంధ్రకే చెందిన మరో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అయితే రెండాకులు ఎక్కువే చదివారు.  రాష్ట్ర సంపదను అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్న వారిని కాల్చేయాలని పిలుపిచ్చారు. ఇక సీనియర్ మోస్ట్ నాయకుడు, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే పార్లమెంటు ఆమోదం పొందినా అమరావతికి చట్టబద్ధత రాదని చెబుతున్నారు.  గతంలో అమరావతిని స్మశానంతో పోల్చిన బొత్స.. ఇప్పుడు చట్టబద్ధత సైతం చెల్లదని చెప్పడం ద్వారా తన అమరావతి వ్యతిరేకతను మరో సారి చాటుకున్నారు.  ఉత్తరాంధ్ర నేతల ద్వారా అమరావతి వ్యతిరేక గళం వినిపించడం అన్న జగన్ వ్యూహం వికటించకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. విశాఖ పాలనా రాజధాని అంటూ తన హయాంలో హడావుడి చేసిన జగన్ ఆ దిశగా కనీసం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అదీ కాక  విశాఖ  పాలనా రాజధాని అన్న జగన్ మాటలను  ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదు. స్వాగతించలేదు. గత ఎన్నికల ఫలితాలు  ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా తేటతెల్లం చేశాయి. ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు అమరావతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్ల వైసీపీకి మరింత డ్యామేజీ రావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలు చేయడం కాదనీ, ప్రగతిని నలు చెరగులా వ్యాపింప చేయడమనీ, చంద్రబాబు ప్రభుత్వం అదే చేస్తున్నదనీ పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
మాములుగా పార్ల‌మెంటు థియ‌రీ అంటే ఏమిటంటే ప్ర‌ధాని మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకునేది కాదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం చేరుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో దశాబ్దాల నాటి డీఎంకే స్నేహాన్ని తెంచుకుని మరీ.. కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించింది.
పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.
ఆయ‌న కు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 108 సీట్లు రాగా.. అందులో త‌న సీట్లే రెండు ఉండ‌టంతో.. ఒక‌టి తాను వ‌దులుకోవ‌ల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. దీంతో ఈ సంఖ్య కాస్తా 107కి ప‌డిపోయింది. మేజిక్ ఫిగ‌ర్- 118గా ఉంది. దీంతో ఆయ‌న పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే, జ‌గ‌న్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 11 కావాలి.
కేరళలో రేవంత్ రెడ్డి పర్యటించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఆయన నిర్వహించిన రోడ్ షోలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కోవళం, పఠానాపురం వంటి కీలక ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. కోవళంలో ఎం.విన్‍సెంట్, పఠానాపురంలో జ్యోతి కుమార్ చమక్కల వంటి నేతలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.