పిఠాపురం నిత్య పంచాయతీకి ఇకనైనా ఫుల్ స్టాప్ పడేనా

Publish Date:May 8, 2026

Advertisement

పార్టీకి నాయకులు కాదు, కార్యకర్తలు ముఖ్యం. ఈ మాట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతూనే ఉంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించే నాయకులపై పార్టీ వేటు వేయడం కూడా కద్దు. తాజాగా ఆ కోవలోనే.. పిఠాపురం వర్మపై పార్టీ వేటు వేసింది. ఆయనను పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించింది. 
ఇందుకు కారణం.. పిఠాపురం నియోజకవర్గంలో తరచూ  కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తుతుండటమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో  తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో  తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ఈ మేరకు ప్రకటన వెలువడిన తర్వాత వర్మ  మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఇయన ఒకింత భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైనా... తనకు నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి ఉద్వాసన పలకడంపై ఆయన స్పందించిన తీరు నిస్సందేహంగా హుందాగా ఉంది. ఆయన ఎక్కడా తన తొలగింపుపై నిరసన స్వరం వినిపించలేదు. పార్టీ నిర్ణయంపై పన్నెత్తి ఒక పరుష వాక్యం కూడా మాట్లాడలేదు. అంతే కాకుండా తన తొలగింపు విషయం తనకు పార్టీ ముందే చెప్పిందన్నారు.  మంత్రి నారా లోకేష్‌ ఈ విషయాన్ని తనకు ముందే చెప్పారన్నారు. ఆ  తరువాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నారాయణ ఈ విషయం తనకు తెలిపారని వర్మ చెప్పారు.  అక్కడితో ఆగకుండా.. తనకు పార్టీయే ముఖ్యమన్న వర్మ.. అందుకోసం త్యాగాలు చేయడానికి తాను ఎప్పుడూ వెనుకాడనన్నారు.  తాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తనని చెప్పారు. ఆ సందర్భంగా ఆయనలో తనకు అన్యాయం జరిగిందన్న బాధ కించిత్తు కనిపించింది.

ఆయన బాధపడటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. తప్పుపట్టరు కూడా. ఎందుకంటే.. గత ఎన్నికలలో పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు ఆయన పార్టీ ప్రయోజనాలు, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించారు. పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తన సీటుని పవన్ కళ్యాణ్‌ కోసం త్యాగం చేసి, ఆయన  తరపున ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు.  ఆయన త్యాగాన్ని, తన విజయం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన పవన్ అప్పట్లో తాను పిఠాపురం ఎమ్మెల్యే అయినప్పటికీ..  పిఠాపురానికి వర్మే నిజమైన ప్రతినిథి అన్నారు. వర్మతో చెపితే నాతో చెప్పినట్లే. వర్మ చెపితే నేను చెప్పినట్లే అని సముచిత గౌరవం, గుర్తింపు  ఇచ్చారు.

అక్కడి వరకూ ఓకే కానీ,   తర్వాత తర్వాత  పిఠాపురంలో జనసేన, వర్మ అనుచరులకు మద్య పలు సందర్భాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదీ సహజమే.. ఒకే  ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఆ విషయం తెలిసి కూడా ఇంత కాలం నియోజకవర్గంలో తెలుగుదేశం, వర్మ వర్గీయుల మధ్య గ్యాప్ పూడ్చడానికి ఇటు తెలుగుదేశం అధిష్ఠానం కానీ, అటు జనసేనానిని కానీ ప్రయత్నించకపోవడమే పరిస్థితి ఇంత వరకూ రావడానికి కారణమైందని పరిశీలకులు అంటున్నారు.  

కనుక ఇకనైనా పిఠాపురంలో పరిస్థితిని చక్కదిద్దడానికి రెండు పార్టీలూ చర్యలు తీసుకోవాలి. వర్మ తొలగింపు ఆయనపై వేటుగా కాకుండా.. మరో పదవి ఇచ్చేందుకు మార్గంగా నియోజకవర్గ కార్యకర్తలు భావిస్తున్న పరిస్థితిని గమనించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక జనేసేన కూడా.. స్థానిక జనసేన క్యాడర్  కూడా పొత్త ధర్మం ప్రకారం నడుచునునేలా చూసే బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకోవాలి.   లేకుంటే పరిస్థితి మరింత దిగజారి వైసీపీకి అవకాశం ఇచ్చేందుకు దోహదడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.