అప్పుడూ.. ఇప్పుడూ అలీ జోకరేనా?

Publish Date:Nov 25, 2024

Advertisement

టాలీవుడ్ టాప్ కమేడియన్ లలో అలీ ఒకరు. కేవలం కమేడియన్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోగానూ అలీ రాణించి యమలీల వంటి సినిమాలలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. ఎలాగైనా చట్ట సభలో కూర్చోవాలన్న ఆకాంక్షతో ఆయన ఒక్కసారిగా రాజకీయాలలోకి దూకేశారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని అన్ని పార్టీలనూ చుట్టేసి చివరికి జగన్ నేతృత్వంలోని వైసీపీని ఎన్నుకున్నారు. ఆయన వైసీపీలో చేరడానికి ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరే విషయాన్నీ పరిశీలంచారు. కానీ చివరికి ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపారు.  సినిమాల్లో ఏదో మేరకు హీరోగా రాణించిన అలీ.. రాజకీయాలలో మాత్రం కమేడియన్ గానే మిగిలిపోయారు. 

2019 ఎన్నికలకు ముందు అలీ తన రాజకీయ అరంగేట్రం కోసం వేతుకులట ప్రారంభించారు. మూడు పార్టీల చుట్టూ చేరారు. ఏంటి మూడు పార్టీల్లోనూ చేరిపోతారా అనిపించేలా ఆయన వ్యవహరించారు.  అయితే చివరాఖరికి ఆయన జగన్ ను నమ్ముకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలలో ఆయన ఏపీలోని ఏదో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే జగన్ ఆయనకు చెయ్యిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ ఏదో ఒక కీలక పదవి ఇస్తానని ఆశ చూపారు. దాంతో ఆ ఎన్నికలలో అలీ వైసీపీ తరఫున తన శక్తి మేరకు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఇక అలీ ఎదురుచూపుల పర్వం మొదలైంది. జగన్ హామీ ఇచ్చిన కీలక పదవి ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాచేలా అలి ఎదురు చూశారు. మధ్యలో ఓ సారి ఇంకేముంది రాజ్య సభ ఖాయం అని గట్టిగా వినిపించింది. అప్పట్లో రాజ్యసభ సభ్యత్వంపై అలీని మీడియా అడిగితే ఆయన చిరునవ్వులు సంధించి నిజమేనని చెప్పకనే చెప్పేశారు. అయితే అదీ రాలేదు. మూడేళ్ల ఎదురు చూపుల తరువాత కంటితుడుపు చర్య అన్నట్లుగా జగన్ అలీకి ఓ సలహాదారు పదవి విదిల్చారు. అదే మహాభాగ్యం.. 2024లో పోటీకి అవకాశం ఇస్తారు అని అలీ తనకు తాను సర్ది చెప్పుకున్నారు. అయితే అదీ దక్కలేదు.

సో అలీ ఇక తన వంటికి రాజకీయాలు పడవని నిర్థారణకు వచ్చేసి వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇక సినిమాలే తన లక్ష్యం అని డిసైడైపోయారు. అప్పటి నుంచీ ఆయన వార్తల్లో ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. కానీ హఠాత్తుగా అలీ పేరు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా కనిపించింది. అయితే ఇది రాజకీయ విషయంలో కాదు. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టారంటూ అలీకి తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కాదు. తెలంగాణలో. 

అలీకి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ పంచయతీ ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలో తన తండ్రి మహ్మద్ బాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉంది. అయితే ఈ ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారంటూ వికారాబాద్ గ్రామ పంచయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. తొలుత ఈ నెల 5న ఇచ్చిన నోటీసులకు అలీ స్పందించకపోవడంతో తాజాగా సోమవారం (నవంబర్25) మరో నోటీసు ఇచ్చారు.  మరీ దీనికైనా అలీ స్పందిస్తారో లేదో చూడాలి. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.