కంగారూలను కంగారెత్తించిన టీమ్ ఇండియా

Publish Date:Nov 25, 2024

Advertisement

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను టీమ్ ఇండియా సజీవంగా నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ లో 295 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది.  ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఇంత దారుణంగా ఓడించిన జట్లు టీమ్ ఇండియా తప్ప మరొటి లేదేమో. 
గవాస్కర్ -బోర్డర్ ట్రోపీలో భాగంగా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు నాలుగు రోజులకే ముగిసింది. ఈ టెస్టులో అన్ని విభాగాల్లోనూ టీమ్ ఇండియా ఆసీస్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగుల స్వల్ప స్కోరుకే ఔటయ్యింది. అయితే కెప్టెన్ బుమ్రా అద్భుత బౌలింగ్, సిరాజ్, రాణాల మంచి స్పెల్ తో ఆస్ట్రేలియా కుప్పకూలింది. కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో తొలి రోజే 17 వికెట్లు పతనమయ్యాయి. తొలి రోజు పేస్ కు బ్రహ్మాండంగా సహకరించిన పిచ్ ఆ తరువాత బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యత సాధించిన టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఓపెనర్లు రాహుల్, యశశ్విజైస్వాల్ లు ఆసీస్ బౌలింగ్ అటాక్ ను ఓ ఆటాడుకున్నారు. 201 పరుగుల ఓపెనింగ్  పార్ట్ నగర్ షిప్ తో మ్యాచ్ ను ఆస్ట్రేలియా నుంచి లాగేసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ మాత్రం తన ఫామ్ ను కొనసాగిస్తూ 161 పరుగులు సాధించారు. ఇక చాలా కాలంగా సెంచరీ కోసం మొహం వాచి ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన విశ్వరూపం చూపాడు. అలవోకగా ఆడుతూ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 30వ సెంచరీ కాగా.. మొత్తంగా అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 81వది. 

దీంతో టీమ్ ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఆదిలోనే టీమ్ ఇండియా బౌలర్లు చావు దెబ్బ కొట్టారు. మూడో రోజు టీ విరామ సమయం తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి కేవలం 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయింది. నాలుగో రోజు ఆట ఆరంభమైన తరవాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. అయితు ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ లు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో హెడ్ 89 పరుగులు, మార్ష్  47 పరుగులు చేశారు. ఆ తరువాత కేరీ కొద్ది సేపు క్రీజ్ లో నిలబడినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 239 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 295 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.  

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.