Publish Date:Jan 31, 2022
త్వరలోనే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి విజయసాయిరెడ్డి స్థానం. ఆ నాలుగు స్థానాల్లో నాలుగురు కీలక వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో విజయసాయి పేరు లేకపోవడం ఆసక్తికరం. అవును, మరోసారి విజయసాయిరెడ్డికి రాజ్యసభ స్థానం రెన్యువల్ కాదని అంటున్నారు. జగన్‌రెడ్డి.. విజయసాయిరెడ్డిని ఈసారి ఢిల్లీకి పంపించే ఆలోచన లేదని చెబుతున్నారు. హస్తినలో సొంతంగా సాయిరెడ్డి తన ఇమేజ్ పెంచుకుంటుండటం.. బీజేపీతో బాగా అంటకాగుతుండటం.. ఉత్తరాంధ్రలో ఓవరాక్షన్.. ఇలా తోక జాడిస్తున్న విజయసాయిరెడ్డి పేరు వెనుక ఎంపీ అనే తోక కట్ చేయనున్నారట జగన్. ఇప్పటికే తాడేపల్లిలో అడుగుపెట్టనీయకుండా విశాఖకే పరిమితం చేయగా.. ఇకపై ఢిల్లీ వెళ్లకుండా.. రాజ్యసభ అవకాశం ఇంకోసారి ఇవ్వబోరని వైసీపీ వర్గాలే అంటున్నాయి.
సరే, విజయసాయిరెడ్డి పదవి ఫసక్. మరి, ఆయన స్థానంలో ఎవరు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. పార్టీ నేతలతో పాటు పారిశ్రామిక వర్గాలకూ పదవుల పందేరం జరపడంలో జగన్‌రెడ్డి సిద్ధహస్తుడు. ఇప్పటికే అంబానీ ప్రధాన అనుచరుడు, రిలయన్స్ గ్రూపులో కీలకమైన నత్వానీని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపించారు జగన్. ఆ మేరకు ఎలాంటి క్విడ్ ప్రొకో నడిచిందో బయటకు మాత్రం రాలేదు. సేమ్ టూ సేమ్.. ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీనే అప్లై చేయనున్నారట జగన్. ఇండియాలోకెల్లా టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్.. గౌతమ్ అదానీ కి జగన్‌రెడ్డి ఈసారి రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే అదానీకి ఏపీలో భారీగా ప్రయోజనాలు కల్పించారు. పోర్టులను దాదాపు గంపగుత్తగా ఇచ్చేశారు. ఇప్పుడిక రాజ్యసభ సీటు కూడా ఇవ్వనున్నారని అంటున్నారు. మరి, ఈసారి వారి మధ్య ఏం డీల్ జరిగిందో?
ఇక, మిగిలిన మూడు రాజ్యసభ సీట్లలో సామాజిక సమీకరణాలే కీలకం కానున్నాయి. గుంటూరు జిల్లా, నెల్లూరుకు చెందిన ఇద్దరు నేతల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావును పెద్దల సభకు పంపిస్తారని తెలుస్తోంది. బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన బీదకు రాజ్యసభ టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. మిగిలిన రెండింటిలో ఒకటి కమ్మ కానీ, కాపులకు కానీ కేటాయిస్తారని టాక్. అదే విధంగా ఎస్సీలకు కూడా చాన్స్ ఉండవచ్చు అని చెబుతున్నారు. రాష్ట్ర నేతలకు ఓకే.. గుజరాతీయులకు ఏపీ నుంచి అవకాశమివ్వాలనుకోవడం.. అందులోనూ బడా పారిశ్రామిక వేత్తలనే ఎంచుకోవడం వెనుక.. బాగా లాభదాయక డీల్ ఏదో జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasaireddy-out-and-adani-in-jagan-mps-list-39-131002.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.