TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయంమరిన్ని →

political-news-img

వైసీపీలో ఉత్తుత్తి సస్పెన్షన్లే.!

వైసీపీ లో క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్లు కేవలం ప్రజాక్షేత్రంలో పరువు కాపాడుకోవడానికి వేసే ఉత్తుత్తి డ్రామాలు మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీకీ, పార్టీ ప్రతిష్ఠకు తీరని నష్టం జరిగే వివాదాలలో, ఆరోపణలలో నాయకులు చిక్కుకున్నప్పుడు మాత్రమే.. ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించడానికి కంటి తుడుపు చర్యగా వైసీపీలో సస్పెన్షన్లు ఉంటాయని అంటున్నారు. పేరుకే సస్పెన్షన్ తప్ప ఆ నేతలకు పార్టీలో ఉన్న స్థానం, వారి హోదాలు అలాగే కొనసాగుతుంటాయి. ఇందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ ల ఉదంతాలే నిలువెత్తు నిదర్శనం అని చెబుతున్నారు. అనంతబాబు విషయానికి వస్తే... తన వద్ద కారు డ్రైవర్ గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో హతమైతే, అతడి మృతదేహాన్ని తన సొంత కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీఅనంతబాబు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు బెయిలుపై బయట తిరుగుతున్నారు అది వేరే సంగతి. కాగా మృతదేహం డోర్ డెలివరీ విషయంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోవైసీపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండైనా ఆయన జగన్ పర్యటనల్లో, పార్టీ సమావేశాలలో యాక్టివ్ గా తిరుగుతూనే ఉన్నారు. ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై శాశ్వత బహిష్కరణ లేదా శాసనమండలి సభ్యత్వ రద్దు దిశగా వైసీపీ ఎటువంటి చర్యా తీసుకోలేదు. కేవలం సస్పెన్షన్ ప్రకటనతో సరిపెట్టి చేతులు దులుపుకుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఆయన సస్పెన్షన్ కూడా ఉత్తుత్తిదే అని పరిశీలకులు అంటున్నారు. దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు. ఇటీవల శాసనమండలిలో వైసీపీ పక్ష సభ్యుడిగా చర్చల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలతో మరో సారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఇలా ఉత్తుత్తి సస్పెన్షన్లతో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతోందని పరిశీలకులు అంటున్నారు. {Token Gesture Suspenssions in YCP, MLC Anantha Babu, Duvvada Srinivas}

Published on: Sat Aug 29, 2026 12:33PM

political-news-img

మూడ్ ఆఫ్ ఏపీ.. తెలుగుదేశంకూటమి మళ్లీ క్లీన్ స్వీప్.!

రాజకీయాల్లో మళ్లీ సర్వేల వేడి రాజుకుంది. మూడ్ ఆఫ్ నేషన్ పేరిట ఇటీవల ఇండియా టుడే సర్వే నిర్వహించింది. అందులో భాగంగా మూడ్ ఆప్ ఆంధ్రప్రదేశ్ సర్వే కూడా ఉంది. ఆ సర్వే ఫలితం వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఎందుకంటే.. ఇటీవలే.. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓ సర్వేను ఆ పార్టీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, జగన్ మళ్లీ సీఎం అవుతారనీ వైసీపీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరాలు చేసుకుంది. అయతే.. ఆ సర్వే కు స్పష్టమైన ఆధారాలు గానీ, విశ్వసనీయత గానీ లేవన్న అభిప్రాయం రాజకీయవర్గాలతో పాటు.. వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమైంది. అది పక్కన పెడితే.. ఇండియా టుడే సర్వే.. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులుకి, ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా ఉందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఆంధ్ర ఏం చెప్పిందంటే.. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికిప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదనీ, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం కూటమి మరో సారి ఘన విజయం సాధించి అధికారం చేపడుతుందనీ కుండబద్దలు కొట్టింది. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని పేర్కొంది. ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది. 2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది. రాష్ట్ర ప్రజలలో తెలుగుదేశం కూటమి నాయకత్వంపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదని సర్వేఫలితం పేర్కొంది. తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లయినప్పటికీ.. ఆ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న సానుకూలత చెక్కు చెదరలేదని ఇండియా టుడే.. సీవోటర్ సర్వే విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఆ సర్వే మేరకు ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పెరగలేదు సరికదా మరింత కిందకు దిగజారింది. గత ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అంతకు మించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజలలో పూర్తిస్థాయి విశ్వాసం కనిపిస్తోందన్నది సర్వే సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించడం, అలాగే.. వైసీపీ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించి ముందుకు తీసుకెళ్లడం ప్రజల్లో చంద్రబాబు సర్కార్ పట్ల సానుకూలతను పెంచిందని సర్వే ఫలితం చెబుతోంది. {Mood of AP. Andhra Pradesh Political Survey, India Today Mood of the Nation AP, YCP MP Seats, Chandrababu Governance}

Published on: Sat Aug 29, 2026 11:44AM

political-news-img

సొంత పార్టీ ఎమ్మెల్సీపై అసద్ సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం... మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్సెండ్ చేశారు. ఏఐఎమ్ఐఎమ్ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. .ఇటీవలి కాలంలో హిజాబ్ వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బాహాటంగానే అసంతృప్తి అసహనం వ్యక్తి చేసిన సంగతి విదితమే. మహిళల ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ప్రకటనలుచేశారు. పలు వేదికలపై మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మాట్లాడారు. అయితే అదే సమయంలో.. సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు. ముఖ్యంగా మహిళా సంక్షేమం, గౌరవం గురించి రహమత్ బేగ్ వ్యవహారంపై పార్టీకి స్పష్టమైన ఆధారాలు లభించడంతోనే అధినేత ఓవైసీ ఈ చర్య తీసుకున్నారని మజ్లిస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సందేశాన్నీ, సంకేతాన్ని అసదుద్దీన్ ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. {AIMIM MLC Suspended, Asaduddin Owaisi, Mirza Rahmath Baig, Hyderabad AIMIM Controversy, AIMIM Action on MLC, Telugu One}

Published on: Sat Aug 29, 2026 9:18AM

political-news-img

మరో వైసీపీ వికెట్ డౌన్?.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం?

వైసీపీలో ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నెల్లూరు ఫైర్‌బ్రాండ్ లీడర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది. తాను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలు లేవనీ, తన రాజకీయ ప్రయాణం అకాలంగా లేదా త్వరలోనే ముగిసిపోయినా తనకు ఎలాంటి రిగ్రెట్ ఉండదనీ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. నెల్లూరు రాజకీయంలో తనకంటూ ఒక శాశ్వత ముద్ర పడిందన్న అనిల్ కుమార్ యాదవ్.., తన రాజకీయ వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఆయన అన్న'తన పొలిటికల్ కెరీర్ కు ప్రీమెచ్యూర్ ఎండ్ అన్న వ్యాఖ్యలు పొలిటికల్ రిటైర్మెంట్ నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్.. జగన్ కేబినెట్‌లో రెండేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌కు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ చేపట్టిన టిక్కెట్ల మార్పుల ప్రక్రియలో భాగంగా, నెల్లూరు నుంచి తప్పించి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఈ మార్పు ఆయన రాజకీయ ప్రయాణంలో కోలుకోలేని దెబ్బ తీసింది. నరసరావుపేటలో ఘోర పరాజయాన్ని చవిచూసిన నాటి నుంచి అనిల్ రాజకీయాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. గతంలో పార్టీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ముందుండి మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ ఆ ఓటమి తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో వైసీపీలో కీలక పాత్ర పోషించిన పలువురు సీనియర్ నేతలలాగే.. అనిల్ కుమార్ యాదవ్ కూడా సైలెంటైపోయారు. ఇప్పుడు ఏకంగా రాజకీయ సన్యాసం సంకేతాలు ఇచ్చారు. (Anil Kumar Yadav Political Retirement, YCP Leader, Former Minister, Nellore politics, AP political updates, Telugu One)

Published on: Fri Aug 28, 2026 2:27PM

political-news-img

రేవంత్ కేబినెట్ లో విజయశాంతికి స్థానం?.. కొండా సురేఖ ఊస్టింగేనా?

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులూ, చేర్పులపై ఇప్పుడు చర్చ జోరందుకుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. గతకొద్ది రోజులుగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలకుసిఫారసు చేస్తూ నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ స్థానంలో రేవంత్ తన కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారన్న విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్లు, పార్టీ వర్గాలలో విజయశాంతి పేరు గట్టిగా వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, బీసీ మహిళా కోటాను వంటి అంశాలను పరిశీలిస్తే.. విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. బిసి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో పాటు, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మహిళా ప్రాతినిధ్యంతో పాటు సామాజిక బ్యాలెన్స్ కూడా సాధించినట్లౌతుందని అంటున్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్ఠానం ఆమెకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని ఆమె వర్గీయులు ఇఫ్పుడు గుర్తు చేస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీలను విజయశాంతి వర్గాలు గుర్తు చేస్తున్నాయి. హై కమాండ్ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. Changes in Revanth Cabinet, Konda Surekha, Vijayashanthi, Minister Post, Telangana Politics, Ramulamma, Telugu One

Published on: Fri Aug 28, 2026 11:16AM

political-news-img

మంత్రి కొండా సురేఖపై వేటు పడేనా..? అధిష్ఠానం వద్దకు చేరిన పంచాయితీ..!

ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..! తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ నేతల ప్రకటనలు పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా కొండా కుటుంబ సభ్యుల తీరు ఉందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసరంగా బెంగళూరు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా నివేదికను ఆయనకు సమర్పించినట్లు సమాచారం. బెంగళూరు భేటీ అనంతరం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వేదికగా మంత్రులు, సీనియర్ నేతల మధ్య వరుస భేటీలు జరగడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నివేదికను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటే మంత్రివర్గంలో మార్పులు లేదా స్వచ్ఛంద రాజీనామా అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం మొదలైంది. మరోవైపు కొండా మురళీధరావు కీలక వ్యాఖ్యలు చేయడం, తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఈ ఎపిసోడ్ మరింత కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల లోపే తుది నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే హైకమాండ్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌.. సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాతే కొండా సురేఖ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్‌ రాక అనంతరం క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చ జరగనుంది. ఈ వ్యవహారంలో రాయబారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భట్టి ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు.. క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసీ వేణుగోపాల్‌ రాక తర్వాత కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. Konda Surekha, Bhatti Vikramarka, Telangana Congress Politics, Mallikarjun Kharge, AICC, Telugu News, Telugu one, KC Venugopal

Published on: Thu Aug 27, 2026 12:02PM