బెజవాడ మేయర్ ఎన్నిక: తెరపైకి కాపు, కమ్మ కోణం.. విజయసాయి వ్యూహం ఏంటి.?

Publish Date:Oct 19, 2026

Advertisement

విజయవాడ మేయర్ ఎన్నికలో  కమ్మ, కాపు సామాజికవర్గ కోణం తెరపైకి వచ్చింది. ఈ కోణాలన్ని తెరపైకి తీసుకు వచ్చింది రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకునే ఆయనీ కోణాన్ని తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి తాజా వ్యాఖ్యలు.. బెజవాడ మేయర్ బరిలో నిలిచిన వంగవీటి రాధ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావులపై కేంద్రీకృతమై ఉన్నాయి.

కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.

 అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏబీవీకి విభేదాలు ఉన్నాయని  రిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఇలాంటి విభేదాలు ఇప్పటికే బహిరంగంగా చర్చనీయాంశంగా ఉన్నప్పుడు, మేయర్ బరిలో చంద్రబాబు ఆయనకు ఎలా మద్దతు ఇస్తారన్న ఆరోపణలు, వ్యాఖ్యలు అభూతకల్పనలని వారు విజయసాయి వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నారు. 

అదలా ఉంటే..  నిన్నమొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధ.. ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరి బెజవాడ మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి.  ఈ నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు నేల విడిచి సాము చందంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి ఇటీవలి కాలంలో తన పొలిటికల్ కామెంట్సన్నీ కుల, మత, ప్రాంతీయ సమీకరణల చుట్టూనే తిరుగుతున్న విషయాన్ని కూడా వారు ఎత్తి చూపుతున్నారు. బెజవాడ మేయర్ మేయర్ ఎన్నికల బరిలో జనసేన తరఫున రాధ, వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్. భాగ్యలక్ష్మి, వామపక్ష పార్టీల మద్దతుతో ఏబీ వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ ఉన్న సంగతి తెలిసిందే.  


[Vijayasai Reddy, Vijayawada ఛayoral ఆlections, Vangaveeti Radha, AB Venkateswara Rao, Andhra Pradesh politics, Caste, Comments, Telugu One]

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.