సీమలో వైసీపీ కుదేలు.. దేశం ఖాతాలోకి రాయచోటి, జమ్మలమడుగు..పుంగనూరూ అదే దారి..!

Publish Date:Oct 19, 2026

Advertisement

వైఎస్ కుటుంబానికి, ఆ తరువాత వైసీపీకి పెట్టని కోట అయిన కడప జిల్లాలో  జగన్ ప్రభ మసకబారుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఔనన్న సమాధానమే వస్తున్నది.  స్థానిక ఎన్నిక సమరంలో నామినేషన్ల పర్వం పూర్తి అయ్యే సరికే కడప జిల్లాలోని రెండు మునిసిపాలిటీలను తెలుగుదేశం ఏకగ్రీవంగా గెలుచుకుంది.  అవి కూడా అత్యంత కీలకమైన జమ్మలమడుగు, రాయచోటి మున్సిపాలిటీలు తెలుగుదశానికి జై కొట్టాయి. జమ్మలమడుగు మునిసిపల్ చైర్ పర్సన్ గా  చాదిపిరాల జ్యోతి,   రాయచోటి మున్సిపల్ చైర్‌పర్సన్ గా తెలుగుదేశం అభ్యర్థి ఖాదర్ వల్లి ఏకగ్రీవంగా గెలుచుకున్నారు.

 ఇక పోతే రాయచోటిలోని మొత్తం 44 వార్డుల్లోనూ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో టీడీపీ 40 వార్డులను, బీజేపీ మూడు వార్డులను, జనసేన ఒక వార్డును గెలుచుకున్నాయి. జగన్ కు అత్యంత బలమైన రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాలలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవు కావడం ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 

అన్నిటికీ మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.  ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని చెప్పడం మాత్రమే కాదు.. ఒకవేళ ఎవరైనా ఏకగ్రీవాలకు అనుమతిస్తే, వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని కూడా జగన్ విస్పష్ట హెచ్చరిక చేశారు.

ఆ హెచ్చరికను  జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంందిన  పార్టీ సీనియన్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే బేఖాతరు చేశారు.  స్థానక సమరంలో   తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించి పెద్దిరెడ్డి జగన్ పై ధిక్కార స్వరం వినిపించారు. సీమలో మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకుంటే.. వైసీపీకి, జగన్ కు కూడా ఇది ఊహించని ఎదురుదెబ్బేనని చెప్పాలి. జగన్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో, పుంగనూరు ఒక రణరంగంగా మారింది; అప్పట్లో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే వెనకడుగు వేశారు. 2019 నుండి 2024 వరకు చిత్తూరు జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు.

గతంలో అంటే జగన్ హయాంలో ఒక్క పుంగనూరు అనే కాదు..  అప్పి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ రాజకీయాలను కూడా పెద్దిరెడ్డే శాసించారు. అప్పట్లో కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పారాజయం పాలయ్యారు. అదే కాకుండా, అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబును సైతం ఓడిస్తానని పెద్దిరెడ్డి అప్పట్లో సవాల్ కూడా విసిరారు.  

అయితే.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో సునాయాసంగా విజయం సాధించారు. అటు పెద్దిరెడ్డి స్వయంగా చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా పుంగనూరు నుంచి ఓటమి అంచులకు చేరుకుని కేవలం 6 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఒడ్డున పడ్డారు.  ఇక ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా ఆయన ధైర్యం చేయలేకపోతున్నారు.   

ఇక ఇప్పుడు ఏకగ్రీవాలకు అనుమతిస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని జగన్ విస్పష్టంగా హెచ్చరించిన నేపథ్యంలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉండరంటూ చేసిన ప్రకటనతో ఆయనకు 2029 ఎన్నికలలో పుంగనూరు టికెట్ దక్కుతుందా? జగన్ ఇస్తారా? పక్కన పెట్టేస్తారా? అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  

[Rayachoty, Jammalamadugu Municipalities, Unanimous, YCP, Handsup, Peddireddi Ramachandra Reddy,  Punganur Municipal Elections, AP Politics, Telugu One]

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.