2029 వరకూ ఆగక్కర్లేదు: మావిగన్ పై ప్రజా తీర్పు ఇదే: జగన్ కు అర్ధమౌతోందా?

Publish Date:Nov 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపోల్ ఫలితాలు ఫలితాలు వైసీపీకి కోలుకోలేని పరాభవాన్ని మిగిల్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన  మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని ప్రతిపాదనను స్థానిక ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లు ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. అంటే జగన్ 2029 ఎన్నికలకు మావిగన్ నినాదంతో వెడతామని ప్రకటించారు. అయితే అంత వరకూ ఆగక్కర్లేదు, ఆ నినాదంతో ఎన్నికలకు వెడితే ఫలితం ఇలాగే ఉంటుందని మునిసిపోల్స్ లో తమ విస్పష్ట తీర్పు ద్వారా ప్రజలు నిర్ద్వంద్వంగా చాటారు. 

గతంలో మూడు రాజధానుల ముసుగులో విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చూపేందుకు ప్రయత్నించినప్పటికీ, 2024 ఎన్నికల్లో వైజాగ్ నియోజకవర్గాల ప్రజలు వైసీపీని పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ  మావిగన్ పేరుతో కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే, 2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 

 మున్సిపల్ ఫలితాల్లో  అధికార తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యతను సాధించింది. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో  తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు ఏకంగా 48 స్థానాలను కైవసం చేసుకోగా, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. వైసీపీ 9 స్థానాలకే పరిమితమైంది.  ఇక్కడ టీడీపీకి చెందిన షేక్ అబ్దుల్లా అభిదా మేయర్‌గా విజయం సాధించారు.

అలాగే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ ఇదే ఫలితం వచ్చింది.  విజయవాడ కార్పొరేషన్‌ను జనసేన అభ్యర్థి వంగవీటి రాధా దక్కించుకోగా, 86 డివిజన్లలో అత్యధిక భాగం తెలుగుదేశం కూటమి ఖాతాలోనే పడ్డాయి. అ  గుంటూరు కార్పొరేషన్‌లో మొత్తం 76 డివిజన్లలో  కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకుంది.  టీడీపీకి చెందిన కోవలమూడి లక్ష్మీ అపర్ణ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ మూడు నగరాల్లోనూ వైసీపీ కనీస పోటీ కూడా   కూడా ఇవ్వలేకపోయింది.

దీంతో  2029 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే  మావిగున్ రాజధాని ప్రతిపాదనకు అసలైన రెఫరెండమ్ జగన్ గతంలో పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఈమూడు నగరాల  కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయం చూస్తుంటే... ఆ రెఫరెండమ్ ఫలితం కోసం ప్రజలు మరో రెండున్నరేళ్లు ఆగాల్సిన అవసరం లేదని స్పష్టమౌతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదనను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి ఈ ఫలితాలే నిలువెత్తు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[People Reject MAVIGUN, AP Municipal Corporation Election Results, YSRCP Capital Narrative, TDP Janasena Alliance victory, AP politics, Telugu One]

By
en-us Political News

  
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.