విజయ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్...వెలుగులోకి సంచలన విషయాలు

Publish Date:Apr 13, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన తల్లి–ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో మృతురాలు విజయరెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… “నా భార్య విజయరెడ్డి, మా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నుంచి ఇప్పటివరకు మేమంతా తీవ్ర షాక్‌లోనే ఉన్నాం. అయితే ఈ ఘటనకు నా బామ్మర్ది చిరంజీవి, అత్త పుష్పాలత, అతని భార్య లక్ష్మీ కారణమని అనుమానిస్తున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశారు.

“నా భార్య, పిల్లలు చనిపోయి 25 రోజులు గడవకముందే ఆస్తుల విషయంపై నన్ను బెదిరించారు. దీంతో నాకు ప్రాణహాని ఉందని భావించి పోలీసులను ఆశ్రయించాను. ఫిర్యాదు అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు” అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ… “రెండున్నర నెలల క్రితం నా భార్య, పిల్లలు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి నా బామ్మర్ది, అత్త, వారి కుటుంబ సభ్యులు ప్రేరేపించారు. నా భార్య, పిల్లలు అంత పిరికి వారు కాదు. వారి ఆత్మహత్యలపై అనేక అనుమానాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.

“మా కుటుంబ ఆస్తులను నా తరువాత ట్రస్ట్‌కు చెందేలా రాయాలని నిర్ణయించుకున్నాను. చిరంజీవి, పుష్పాలత, లక్ష్మీ నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి రక్షణ కల్పించాలి. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలి” అని పోలీసులను కోరారు. అదే విధంగా, “మా ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్లు, బంగారం తీసుకెళ్లారు. ఆత్మహత్య జరిగిన తర్వాత మా ఇంటికి వచ్చి విలువైన వస్తువులు తీసుకుపోయారు” అని ఆరోపించారు.

“నా బామ్మర్ది మరియు అతని పరిచయస్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఉప్పల్‌లో రూ.30 లక్షలతో ఇల్లు కొనుగోలు చేయడానికి నా భార్య ఒప్పందం చేసుకుంది. ఆమె మరణించిన నెలరోజుల తర్వాత చిరంజీవి బిల్డర్ దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ కాపీలు నాకు ఇవ్వకుండా నన్ను బెదిరిస్తూ సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు” అని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని, ప్రాణ రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి పోలీసులను వేడుకున్నారు.

By
en-us Political News

  
ట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు.
గతంలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో, 1971లో డాలర్ నుంచి గోల్డ్ స్టాండర్డ్ తొలగించినప్పుడు కూడా ఇలాంటి భారీ ధరల పెరుగుదల కనిపించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పసిడి దూకుడుకు కేవలం కరెన్సీ విలువ తగ్గడమే కాకుండా.. పెరుగుతున్న జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఫియాట్ కరెన్సీలను అమ్మి, వాటి స్థానంలో బంగారం వంటి హార్డ్ అసెట్స్ కొనుగోలు చేసే ధోరణినే డీబేస్మెంట్ ట్రేడ్ అంటారు.
ముఖ్యంగా రెండో విడతలో భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 40,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు.  ఇది గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు. అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ సహకారాన్ని అందించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.