ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ వర్సిటీ బంపర్ ఆఫర్

Publish Date:May 17, 2026

Advertisement

 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లా ఎస్టీ విద్యార్థులకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో ఘన అభినందన సభ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ .. వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌లో 600కు పైగా మార్కులు సాధించిన 287 మంది షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా సీట్లు కల్పించి పూర్తి విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.

 ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు పిల్లల చదువును మధ్యలో ఆపేయకుండా ధైర్యంగా పై చదువులకు పంపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. అందులో 287 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని ఎంపీ కొనియాడారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కూడా ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కనీసం డిగ్రీ వరకు చదివించాలి

ఎస్టీ కుటుంబాల నుంచి ప్రతి గ్రామంలో కనీసం నలుగురు విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయికి చేరుకోవాలని తమ ఆకాంక్ష అని ఎంపీ పేర్కొన్నారు. వారిని చూసి మరికొందరు విద్యార్థులు కూడా స్ఫూర్తి పొంది చదువులో ముందుకు వస్తారని అన్నారు. కనీసం డిగ్రీ వరకు చదివితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మరింత సులభమవుతాయని, అందుకే తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు తప్పనిసరిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఇదే కార్యక్రమంలో నరసరావుపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ .. నరసరావుపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 

By
en-us Political News

  
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు
చంద్ర‌బాబును చేర‌దీసింది రాజారెడ్డే అంటారు. వాళ్లు వాళ్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లే క‌దా? అలాంటి చంద్ర‌బాబు రాజారెడ్డిని హ‌త్య చేయించి ఉంటారా?
ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణ సచివాలయం వద్ద ఉధృత వాతావరణం నెలకొని ఉంది.
కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య బాధ్యతలు, హక్కులపై బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక.
అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, టి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.