అమ్మాయి కోసం...బెజవాడలో జీప్‌లతో ఢీకొట్టుకొన్న యువకులు

Publish Date:May 22, 2026

Advertisement

 

వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి.. నడిరోడ్డుపై వాహనాలతో ఢీకొట్టుకునే వరకు వెళ్లింది. అవి ధ్వంసమైనా.. పగ, కసి చల్లారక.. దిగి కలియబడ్డారు.                    

ఈ ఘటన చూసి.. రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో పరుగులు పెట్టారు. ఫ్యాక్షన్‌ సినిమాలోని పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన విజయవాడలో హైటెన్షన్‌ రోడ్డులో గురువారం రాత్రి జరిగింది..

సవాళ్లు విసురుకుని.. 

తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. విజయవాడలోని భారతీనగర్‌కు చెందిన బోల్లా ఓమ్‌.. తన తండ్రితో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఇతను వైసీపీ నేత జోగి రమేష్‌కు బంధువుగా చెప్పుకొనేవాడు. జగన్‌ పుట్టిన రోజును కూడా తాడేపల్లిలో తాను చదివే ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద ఘనంగా చేశాడు. వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాడు. 

ఓమ్, రోహిత్‌ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్‌కు ఓమ్‌ ఫోన్‌ చేశాడు. ఎక్కడ ఉన్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తాను పటమట ఆర్‌ఆర్‌ గార్డెన్‌లోని హైటెన్షన్‌ రోడ్డులో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు.

ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ..

ఓమ్‌.. తన థార్‌ జీప్‌పై రోహిత్‌ ఉన్న ప్రాంతానికి గురువారం రాత్రి వెళ్లాడు. రోహిత్‌ జీప్‌ను ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరూ పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. యాక్షన్‌ సీన్లను తలపించేలా  ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్‌ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు.. భీతావహ దృశ్యాలను చూసి భయాందోళనలతో పరుగులు తీశారు. 

అప్పటికీ ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. జీప్‌లు దిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలకొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పటమట పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి జీప్‌ను వదిలేసి రోహిత్‌ పరారయ్యాడు. ఓమ్‌ను స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్‌కిషోర్‌ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు తెలిసింది.

By
en-us Political News

  
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.
రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు
చంద్ర‌బాబును చేర‌దీసింది రాజారెడ్డే అంటారు. వాళ్లు వాళ్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లే క‌దా? అలాంటి చంద్ర‌బాబు రాజారెడ్డిని హ‌త్య చేయించి ఉంటారా?
ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణ సచివాలయం వద్ద ఉధృత వాతావరణం నెలకొని ఉంది.
కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య బాధ్యతలు, హక్కులపై బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక.
అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, టి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు మరోసారి బ్యాంకాక్ స్పెషల్ ప్యాకేజ్ దొరికింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.