నానీ కాదు..అంతా నేనే చేశా: వంశీ కొత్త వెర్షన్ లో మతలబు అదేనా?

Publish Date:Jan 24, 2022

Advertisement

గుడివాడలో జరిగిన క్యాసినోపై కొత్త ట్విస్టు బయటికొచ్చింది. నరం లేని నాలుక అబద్ధం చెప్పొచ్చు. కానీ ఏం జరిగిందో ఎవిడెన్స్ గా మారిన ఫొటోలు గానీ, వీడియోలు గానీ తప్పు చెప్పవు కదా. క్యాసినో జరిగిందని  నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని, అవసరమైతే పెట్రోలు మీద పోసుకొని  ఆత్మహత్య  చేసుకుంటానని వైసీపీ మినిస్టర్ కొడాలి నాని మంగమ్మ లెవెల్లో శపథం చేశారు. ఆయన శపథాన్ని బలపరుస్తున్నట్టు ఆయన స్నేహితుడైన వల్లభనేని వంశీ ఓ కొత్త వెర్షన్ ఐడియాను రిలీజ్ చేశారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టు కె.కన్వెన్షన్ లో క్యాసినో జరగలేదని, దాని పక్కన మరో స్థలంలో జరిగిందని, అది కూడా క్యాసినో కాదు.. కేవలం కోడిపందాలే జరిగాయని చెప్పుకొచ్చారు. క్యాసినో జరగనే లేదన్న వంశీ... అక్కడ జరిగింది కూడా పూర్తిగా తన డైరెక్షన్ లోనే జరిగిందని, అసలు కొడాలి నానికి ఆ తతంగానికి ఏం సంబంధం లేదంటూ వకాల్తా పుచ్చుకోవడమే  విడ్డూరంగా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జరిగిందానికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తానని కూడా చెప్పడం మరో ట్విస్టు. 

మరి ఈ ముక్క చెప్పడానికి వంశీకి ఇంత టైమెందుకు పట్టిందన్న డౌటనుమానం అమరావతి ప్రజానీకాన్ని పీడిస్తోంది. క్యాసినో లోగుట్టును బయటపెట్టేందుకు టీడీపీ నేతలు దండు కట్టి దండోరా మోగించి చలో కె.కన్వెన్షన్ అంటూ కార్యకర్తలను ముందుకు ఉరికిస్తే.. తమ నిజరూపం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో వైసీపీ నేతలంతా కట్ట కట్టుకొని టీడీపీ నేతల్ని చితకబాదారు. దాని మీద పోలీసుల చేతగానితనాన్ని, లోపాయికారీ అంగీకారాన్ని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. దానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం కూడా అవమానంగా ఫీలైంది. ఖాకీ బట్టలేసుకుని కళ్లు మూసుకోమంటే మూసుకుంటాం గానీ.. కడుపు మండిన ప్రతిపక్షాలు విమర్శాస్త్రాలు సంధిస్తే చెవులు మూసుకోవడం ఎలా కుదురుతుందంటూ   ఆక్రోశం వెళ్లగక్కారు. ఏపీలో ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం బజారుకెక్కి  బాహాబాహీలకు దిగినా చలించని వంశీ... ఇంత ఆలస్యంగా బయటికెందుకు వచ్చారన్నదే ఈ కథలో కొత్తమలుపు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

అధికార పార్టీతో అంటకాగుతూ నానీకి ఉన్న వ్యాపార, వ్యాపారేతర కార్యకలాపాల్లో భాగం పంచుకుంటూ లోపాయికారీగా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటున్న వంశీ ఉన్నపళంగా ఎందుకని బయటపడ్డాడు? వంశీమోహన్ బయటికొచ్చి వివరణ ఇవ్వడానికి వెనకాల ఏ మహాశక్తి పనిచేసిందో ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదంటున్నారు విమర్శకులు. అసలు మరక అధికార పార్టీకి  అంటకుండా  చూడటానికి నాని వెనకాల ఉన్న ఆ మహాశక్తే వంశీమోహన్ ను తెరముందుకు తీసుకొచ్చిందన్న  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాని, వంశీ కలిసి చేస్తున్న కార్యకలాపాల్లో ఒకటోది ఇలా క్యాసినో రూపంలో బయటపడిందన్నమాట. ఇంకా ఎన్ని వ్యాపార, వ్యాపారేతర కార్యకలాపాల్లో  ఇద్దరికీ పార్ట్ నర్ షిప్ ఉందో తెలియాలంటే రానున్న కాలం రావాల్సిందేనంటున్నారు  ఆంధ్రా ప్రజలు. అసలు సంక్రాంతి సందర్భంగా కె.కన్వెన్షన్ లో ఏం జరిగిందో టీడీపీ నేతలు ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా, ప్రధాన మీడియా ద్వారా బయటపెడుతుండడంతో వంశీ అనే కొత్త పాత్ర కాస్తా బయటికి రావడం గమనార్హం.

 

By
en-us Political News

  
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తానేదో పెద్ద రాజకీయవేత్త అన్నట్టుగా బిల్డప్పు ఇస్తుంటారుగానీ, ఆయన నడిపేవి దిక్కూమొక్కూ లేని రాజకీయాలు.
నిజామాబాద్ లో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ ఆరితేరిన ఉద్ధండులే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు! ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!
ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.