Publish Date:Apr 26, 2024
ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
అలాగే త్రిపుర, జమ్మూ కాశ్మీర్ లలో కూడా ఒక్కో స్థానానికి ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. రెండో దశలో మొత్తంగా 88 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న తొలి దశలో ఈ నెల 19న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి దశలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ దశలో పోలింగ్ శాతం పెరిగేలా అన్ని చర్యలూ తీసుకుంది.
ఇక బీజేపీ అయితే తొలి దశలో తమ పార్టీ పెర్ఫార్మెన్స్ పై ఒకింత అసంతృప్తితో ఉంది. దీంతో ప్రధాని మోడీ ప్రచారంలో దూకుడు పెంచారు. విపక్షాలపై విమర్శల డోస్ పెంచారు. మతపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ హిందుత్వ అజెండాను తెరపైకి తీసుకు వచ్చారు. విపక్షాలు ఓటమి భయంతోనే మోడీ సమాజంలో విద్వేషాలు సృష్టించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/second-phase-poling-started-39-174538.html
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం (మే7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఆయన సోమవారం (మే6) బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీగా కొనసాగుతున్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్‌కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది