ఓడిశాకు వంశధార ట్రిబ్యునల్ మొట్టికాయ?
Publish Date:Oct 3, 2012
Advertisement
ఆంధ్రప్రదేశ్, ఓడిశా రాష్ట్రల మధ్య వంశధార నదీ జలాలు వినియోగ ఒప్పందంలో విబేధాలున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కూడా గతంలో ఈ వివాదాలను ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందని చెప్పారు. అయితే వంశధార కేటాయింపుల్లో వివక్షత జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర నీటి వినియోగ ఒప్పందాల ప్రకారం ఈ నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన రెండు రాష్ట్రాలకూ సూచించారు. అయితే ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై ఓడిశా ఫిర్యాదు చేసింది. నీటి ఒప్పందం ప్రకారం తమకు అందాల్సి వాటాలో అన్యాయం జరుగుతోందని ఓడిశా ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన ట్రిబ్యునల్ ఓడిశా అభ్యంతరాలను తోసిపుచ్చింది. అలానే ట్రిబ్యునల్ సభ్యుడిగా జస్టీస్ గులాం అహ్మద్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ్యుల నియామకం, తొలగింపు అధికారం తమకు లేదని ట్రిబ్యునల్ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఎనిమిది వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఓడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ట్రిబ్యునల్ ఆదేశించింది. నదీజలాల పంపకంపై డిసెంబర్ 4 నుంచి మరోసారి విచారణ చేపడతామని ట్రిబ్యునల్ తెలిపింది. ఈ విచారణ సమయానికి ట్రిబ్యునల్‌కు అవసరమైన పూర్తి సమాచారం అందజేయలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రత్యేకించి పొరుగురాష్ట్రాలతో విభేదాలు లేకుండా చూసుకునేందుకు ట్రిబ్యునల్ ఇచ్చిన 8వారాల గడువు సరిపోతుందని రాష్ట్ర పాలకులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/vamshadhara-tribunal-24-17870.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





