రైతులను మోసం చేస్తున్న బిటి కంపెనీలు?
Publish Date:Oct 3, 2012
Advertisement
సాంప్రదాయక వ్యవసాయానికి రాష్ట్రానికి ఉన్న పేరును బిటి విత్తనాల కంపెనీలు పాడు చేశాయి. ఒకపక్క రైతులను మోసం చేశాయి. మరోపక్క తాము సొమ్ము చేసుకుని రాష్ట్రప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాయి. ఈ కంపెనీలు ఇప్పటికే దేశంలో రెండు వేల కోట్ల రూపాయల వాణిజ్యాన్ని చేస్తున్నాయి. రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, కర్నూలు, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ బిటి విత్తనాలు వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి పత్తి ఉత్పత్తి ఎక్కువగా వస్తుందని ఈ విత్తనాలు ఉపయోగించాలని వ్యవసాయశాఖాధికారులు కోడైకూశారు. దీంతో రైతులు అధికారుల సూచనలు నమ్మి ఈ విత్తనాలు ఉపయోగించారు. ఇప్పుడు తాజాగా జరిగిన పరిశోధనల్లో బిటి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని తేలింది. మనదేశ వ్యవసాయంపై దృష్టిసారించిన జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. పైగా, ఈ బిటి విత్తనాలు ద్వారా వేసిన పంట నుంచి తీసిన నూనె కూడా ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ నూనె వినియోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడటం వైద్యుల చేతిలో ఉండదని కూడా హెచ్చరించారు. తమ స్వార్థం కోసం బిటి కంపెనీలు వ్యవసాయాధికారుల సహకారంతో రాష్ట్ర రైతాంగాన్ని సాంప్రదాయపంటల నుంచి మళ్లించకుండా ఉంటే పరిస్థితి కొంతమేర ఆశాజనకంగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ బిటి విత్తనవినియోగం వల్ల భూసారం దెబ్బతిందేమోనని రైతులు తక్షణం ఒకసారి పరిశోధనలు చేయించాలని వారు సూచిస్తున్నారు. జపాన్ వంటి దేశాలు కూడా సాంప్రదాయపంటలుగా జొన్న వంటి వాటిపై ఆధారపడినప్పుడు రాష్ట్రరైతులు విదేశీవిజ్ఞానాన్ని వినియోగించుకోవటం మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి వెంటనే అప్రమత్తమై రైతులు తక్షణ జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ నిపుణుల సూచనలను మహారాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్ సిడి మహీ కూడా బలపరుస్తున్నారు.
http://www.teluguone.com/news/content/farmers-deceived-24-17872.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





