ఉత్తరాఖండ్‌ తీర్పు కేంద్రానికి ఓ హెచ్చరిక!

Publish Date:Apr 22, 2016

Advertisement

 

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేస్తూ విధించిన రాష్ట్రపతి పాలన మీద, అక్కడి హైకోర్టు సుస్పష్టంగా తన తీర్పుని అందించింది. ఈ కేసుని స్వీకరించిన ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆది నుంచీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేస్తూనే రావడంతో, కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగే తీర్పు ఏదో వెలువడనుందని మొదటి నుంచీ కూడా సందేహాలు కలుగుతూ వచ్చాయి. అదే నిజమైంది!

 

పూర్వాపరాలు: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 మంది సభ్యుల బలం ఉండగా, బీజేపీకి 28 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ బలగంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ కొన్నాళ్లుగా అసంతృప్తితో రగులుతూ వచ్చారు. రోజులు గడిచే కొద్దీ తనకు తోడుగా మరో ఎనిమిది మందిని కలుపుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు బహుగుణ. మార్చి 18 నాటికి ఈ తిరుగుబాటు తారస్థాయికి చేరుకుని, వీరంతా బీజేపీలోకి చేరేదాకా వచ్చింది. దాంతో ప్రభుత్వం మైనారటీలో పడిపోయిందంటూ కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించింది. అయితే ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మర్నాడు బలనిరూపణ జరగాల్సి ఉండగా ఆదరాబాదరాగా మార్చి 27నే అక్కడ రాష్ట్రపతి పాలనను విధించడం దేశం యావత్తునీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయమై హరీశ్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌ హైకోర్టుని ఆశ్రయించారు.

 

హరీశ్‌ రావత్‌ పిటీషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఆది నుంచీ కూడా కేంద్రానికి మొట్టికాయలు వేస్తూనే వచ్చింది. మరొక్క రోజులో బలనిరూపణ జరగాల్సి ఉండగా ఇంత ఆదరాబాదరాగా రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించారంటూ మొదట్లోనే దుయ్యబట్టింది. హైకోర్టు ముందు కేంద్రానికి చెందిన మహామహా న్యాయవాదుల వాదనలు సైతం చిన్నబోయాయి. రాష్ట్రపతి అంగీకారంతోనే ఈ నిర్ణయం జరిగిందన్న వాదననూ కోర్టు సమర్థించలేదు. రాష్ట్రపతి కూడా ఒకోసారి తీవ్రమైన తప్పిదం చేసే అవకాశం ఉందంటూ, దేశ ప్రథమ పౌరుడికి కూడా చురకలద్దింది. ఒకదాని తరువాత ఒకటిగా న్యాయస్థానం సంధిస్తున్న ప్రశ్నలకు ఒక దశలో న్యాయవాదులు బిత్తరపోయారు. స్పీకరు ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారన్నది కేంద్రం చేసిన అభియోగాలలో ఒకటి! కానీ హరీశ్‌ రావత్ తరఫున న్యాయవాది ఆయన నిష్పక్షపాతంగానే వ్యవహరించారంటూ తగిన కారణాలు చూపడంతో, కేంద్ర న్యాయవాదులు ఒకదశలో క్షమాపణ చెప్పవలసి వచ్చింది.

 

హైకోర్టు చిట్టచివరకు ఘాటైన పదజాలంతో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ తిర్పునిచ్చింది. ముందు రాష్ట్రపతి పాలనను విధించి, ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడం, ఆ తరువాత మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వడం ఏంటని న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఇలాంటి ప్రభుత్వాలను కూల్చివేయడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమంటూ విరుచుకుపడ్డారు. ఇదే కనుక జరిగితే సగటు ఓటరు ప్రజాస్వామ్యం పట్ల తన నమ్మకాన్ని కోల్పోతాడంటూ హెచ్చరించారు. ఈ నెల 29న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునే అవకాశాన్ని అక్కడి ముఖ్యమంత్రికి కల్పించింది న్యాయస్థానం. ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలని కూడా న్యాయస్థానం వదిలిపెట్టలేదు. వారు చేసిన పనికి శిక్షను అనుభవించాల్సిందే అంటూ హెచ్చరించింది. వారు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హులా కాదా ఈ నెల 28న నిర్ణయిస్తామని తేల్చి చెప్పింది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలలో కేంద్రం వేలు పెట్టకుండా ఉండాల్సిందంటూ కోర్టు పదేపదే అభిప్రాయపడింది.

 

హైకోర్టు నిర్ణయం మీద సహజంగానే అక్కడి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేయగా, కేంద్ర సుప్రీం కోర్టు తలుపులను తట్టేందుకు సిద్ధపడింది. బహుశా అక్కడ కూడా కేంద్రానికి చుక్కెదురు కావచ్చు. ఇదే కనుక జరిగితే రాష్ట్రపతి పాలనను తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోవచ్చుననే దురుద్దేశాలను న్యాయవ్యవస్థ అడ్డుకున్నట్లే. ఇప్పటికే 1994లో వెలువడిన ఎస్‌.ఆర్‌.బొమ్మై తీర్పులో రాష్ట్రపతి పాలను సంబంధించి సుప్రీం కోర్టు పలు కీలకమైన సూచనలు వెలువరించింది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనీ, కేంద్రం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాదన వినాలనీ... ఇలా కొన్ని జాగ్రత్తలను అందించింది. కానీ ఉత్తరాఖండ్‌లో తగిన బలం ఉన్న బీజేపీ తన పార్టీని గద్దెనెక్కించేందుకు కేంద్రం ఇవన్నీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి యుక్తిని ప్రయోగించి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపగలిగింది కేంద్రం. అందుకు భారీగా అపవాదుని మూటగట్టుకుంది కూడా!

 

అరుణాచల్‌ సంక్షోభం అలా ముగిసిందో లేదో ఇప్పుడు ఉత్తరాఖండ్‌ మీద 356 అధికరణాన్ని (రాష్ట్రపతి పాలన) ప్రయోగించింది. ఇక్కడ కాంగ్రెస్‌ను గద్దె దింపాక, మణిపూర్‌లో కూడా మరో సంక్షోభాన్ని సృష్టించేందుకు కొందరు పెద్దలు సిద్ధంగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న పార్టీ, రాష్ట్రపతి పాలనను ఇలా తనకు అనుకూలంగా మార్చుకోవడం కొత్తేమీ కాదు. అందుకే ఉత్తరాఖండ్‌ సంక్షోభం మీద హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్‌ చరిత్ర కూడా ఏమంత ఘనంగా లేదంటూ వ్యాఖ్యానించింది. స్వాతంత్రానంతరం 40 ఏళ్లలో దాదాపు 100 సార్లు రాష్ట్రపతి పాలనను విధించిన ఘన చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ దెప్పిపొడిచింది. కానీ కాంగ్రెస్‌ విధానాలకు, తత్వానికి విరుద్ధంగా గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం కూడా అదే పోకడ పోవడమే ఇప్పుడు దేశప్రజలను బాధిస్తున్న విషయం. అణచివేతలోనూ, అధికార దుర్వినియోగంలోనూ... కాంగ్రెస్‌, బీజేపీలకు పెద్దగా తేడా లేదని తేలితే కనుక ఇక ఓటర్లు న్యాయం కోసం ఎటు చూడాలి!

 

అదృష్టం ఏమిటంటే ఇప్పుడు కోర్టులు తమ తీర్పుల విషయంలో చాలా నిక్కచ్చిగా, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అవసరమైతే రాష్ట్రపతిని సైతం తప్పుపడతామంటూ, ప్రజాస్వామ్యానికి దన్నుగా నిలుస్తున్నాయి. కాబట్టి పార్టీలు విఫలమైనా న్యాయవ్యవస్థ ఇంకా విఫలం కాలేదన్న సంతోషం మాత్రం సగటు జీవికి కలుగక తప్పదు. మరో వైపు ఈ తీర్పు తరువాతైనా కేంద్రం మరింత జాగరూకతతో వ్యవహరిస్తుందని ఆశించవచ్చు. ఇప్పటికే అసహనం, జాతీయవాదం, ఆర్థిక నేరాలు వంటి సమస్యలతో అట్టుకుతున్న దేశంలో... ప్రభుత్వం వేసే ప్రతి అడుగునీ ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారన్న విషయాన్ని బీజేపీ గ్రహించి తీరవలసి ఉంది. లేకపోతే రాక రాక వచ్చిన అధికారాన్ని చేజేతులా చేజార్చుకోవడం మాట అటుంచి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదన్న అపప్రధతో మోదీ తన పాలనను ముగించాల్సి వస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.