LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ  ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు.   అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు.  ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.  ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.   ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.  కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు.  అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే  నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.  
పుదుచ్చేరిలో  వచ్చే నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే  పీపుల్స్ పల్స్   సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఔననే అంటోంది.  30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో  ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష  ఎస్పీయే 9 నుంచి11,  నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది.   9నుంచి 11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5 నుంచి 7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3నుంచి 5, డీఎంకే 6 నుంచి 8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.  పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34 నుంచి 36 శాతం, ఎస్పీఏ 30- నుంచి 32 శాతం, టీవీకే 16నుంచి 18 శాతం ఒట్లు, ఎన్టీకే 4నుంచి 6 శాతం, వీసీకే 1నుంచి 3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి 2 నుంచి 5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీలుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.   పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది.  ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు  తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి. ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు  ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు. 
తెలంగాణ శాసనమండలి శాసనమండలి భవనం వద్ద లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో  ఉద్రిక్తత నెలకొంది.  మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి,  అక్రమాలకు బాధ్యత వహించాలి,  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ  ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.  సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.  ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్‌ను నడుపుతోందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలి వద్ద మంత్రి పొంగులేటి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 
దేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో  టాప్ 100లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. అంతే కాకుండా ఈ ఇరువురూ కూడా ఆ జాబితాలో తొలి పాతిక స్థానాలలో నిలవడం విశేషం. జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2026 సంవత్సరానికి దేశంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాను ప్రకటించింది. వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.  కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చూపుతున్న చొరవ చంద్రబాబును టాప్ 100 మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ ఇన్ ఇండియా జాబితాలో 13వ స్థానంలో నిలబెట్టాయి.   అలాగే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఈ జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకున్నారు.  కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత అత్యంత ప్రభావశీలుడైన నేతగా రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు దక్కింది.  కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత  ప్రియాంక గాంధీ వాద్రాలను అధిగమించి జాబితాలో రేవంత్ 25వ స్థానాన్ని దక్కిం చుకున్నారు.   ఇక పోతే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ కూడా చోటుదక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆయన  68వ స్థానంలో నిలిచారు.  ఇక యువ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా టాప్ 100లో నిలిచారు. ఈ జాబితాలో ఆయనకు 90వ స్థానం దక్కింది.   
మండు వేసవిలో వరుణులు విజృంభించనున్నాడా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటోంది. రాగల రెండు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అకాల వర్షాలకు పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే పిడుగుపాటుకు అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 
ALSO ON TELUGUONE N E W S
మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్, ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'పుష్ప' సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్నప్పటికీ, సైన్ చేయడానికి మాత్రం భారీ కండిషన్లు పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఫహద్ ఫాజిల్ తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించడానికి ఏకంగా రూ. 15 నుండి రూ. 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. సాధారణంగా స్టార్ హీరోలకు ఇచ్చే రేంజ్‌లో ఒక నెగటివ్ రోల్ చేసే నటుడు ఇంత పారితోషికం అడగడంతో మన నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. కేవలం విలన్‌కే ఇంత ఇస్తే, ఇక సినిమా బడ్జెట్ ఎక్కడికి చేరుతుందోనని మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం ఫహద్‌ను సంప్రదించగా, రెమ్యూనరేషన్ విషయంలో ఆయన పట్టు వీడకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఫహద్ అడిగినంత ఇవ్వలేక ఆ పాత్రలోకి నందమూరి కళ్యాణ్ రామ్‌ను తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.  నిజానికి ఫహద్ ఫాజిల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనను సినిమాలో తీసుకుంటే కేరళ (మలయాళం) మార్కెట్ కూడా కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తారు. కానీ రూ. 20 కోట్లు అనేది మరీ ఎక్కువ అని వారి అభిప్రాయం. మరోవైపు, ఫహద్ కేవలం రొటీన్ విలన్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, కంటెంట్ బలంగా ఉండి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఫహద్ గతంలో నటించిన 'ట్రాన్స్', 'విక్రమ్', 'మామన్నన్' వంటి చిత్రాల్లో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే టాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఫహద్ రెమ్యూనరేషన్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అంత టాలెంట్ ఉన్న నటుడికి ఆ మాత్రం డిమాండ్ ఉండటంలో తప్పులేదు" అని కొందరు అంటుంటే, "విలన్ పాత్రకే 20 కోట్లా? ఇది మరీ టూమచ్" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఫహద్ తన పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటుండటంతో, మన నిర్మాతలు ఆయన కోసం అంత మొత్తం ఖర్చు పెడతారా లేదా అనేది వేచి చూడాలి.
వరుస సెలవులు, చల్లని సాయంత్రాలు.. తోడుగా ఒక మంచి సినిమా ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే డిజిటల్ ప్రియుల కోసం ఈ వారం ఓటీటీ సంస్థలు భారీ విందును సిద్ధం చేశాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, ఇంటి వద్దే ఉండి వినోదాన్ని ఆస్వాదించే వారి కోసం ఏప్రిల్ మొదటి వారంలో ఏకంగా 16కు పైగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. ఇందులో తెలుగు ప్రాముఖ్యత కలిగిన సినిమాలతో పాటు క్రేజీ బాలీవుడ్, హాలీవుడ్ కంటెంట్ కూడా ఉండటం విశేషం. ఈ వారం ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోల చిత్రాలు డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది. విభిన్నమైన కథాంశాలతో మెప్పించే శ్రీవిష్ణు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనితో పాటు, వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సుహాస్ నటించిన 'హే బల్వంత్' చిత్రం జీ5 వేదికగా అలరించనుంది. మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, సీనియర్ నటి లయ, నటుడు శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రం ఈ వారమే ఈటీవీ విన్‌లో నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత లయ తెలుగు తెరపై కనిపిస్తుండటం, ఇటీవలే బిగ్ బాస్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శివాజీ ఇందులో నటించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీ ప్రేక్షకుల కోసం ఆమిర్ ఖాన్ సమర్పణలో వస్తున్న 'సితారే జమీన్ పర్' సోనీ లివ్‌లో విడుదల కానుంది. అలాగే కామెడీ డ్రామా 'హ్యాపీ పటేల్', ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'వధ్-2' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు 'రిపుల్', 'జో కిట్టీ సీజన్-3', 'బ్లడ్ హౌండ్స్ సీజన్-2' వంటి హై-వోల్టేజ్ కంటెంట్ అంతర్జాతీయ స్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం అమెజాన్ ప్రైమ్‌లో 'సెండ్ హెల్ప్' లాంటి సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్.. మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్) - ఏప్రిల్ 04 సెండ్ హెల్ప్- ఇంగ్లిష్ సినిమా - మార్చి 31 అవతార్ ఫైర్ అండ్ యాష్ - మార్చి 31 జియో హాట్‌స్టార్‌.. సెండ్ హెల్ప్‌(హాలీవుడ్ హారర్‌ మూవీ) - మార్చి 31 ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా) - ఏప్రిల్ 03 నెట్‌ఫ్లిక్స్.. రిపుల్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - మార్చి 31 హ్యాపీ పటేల్(హిందీ సినిమా) - ఏప్రిల్ 01 జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 02 మృత్యుంజయ్(తెలుగు సినిమా) -ఏప్రిల్ 03 మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03 వధ్‌-2(హిందీ సినిమా) -ఏప్రిల్ 03 బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) -ఏప్రిల్ 03 హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03 జీ5  హే బల్వంత్‌(తెలుగు సినిమా) - మార్చి 31 బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ) - ఏప్రిల్ 03 తానా - ఏప్రిల్ 3 ఈటీవీ విన్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’- ఏప్రిల్ 3 ఆపీల్ టీవీ ప్లస్.. యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03 సన్‌ నెక్ట్స్.. వడం(తమిళ సినిమా) - ఏప్రిల్ 03 సోనీ లివ్ సితారే జమీన్ పర్(బాలీవుజ్ ) - ఏప్రిల్ 03
సమ్మర్ రేస్ మొదలైంది యాక్షన్ వర్సెస్ కామెడీ ఏప్రిల్ 3న విడుదలవుతున్న క్రేజీ మూవీస్ వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ మొదటి వారంలో పలు ఆసక్తికరమైన సినిమాలు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా విభిన్న కథాంశాలతో వస్తున్న యువ హీరోల సినిమాలు మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనేలా కనిపిస్తోంది. బైకర్ (Biker) శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఈ మూవీలో శర్వానంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రేసర్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఏప్రిల్ 3న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో మెరవనున్నారు. రాకాస (Rakasa) సంగీత్ శోభన్ హీరోగా నటించిన 'రాకాస' సినిమా కూడా అదే రోజు అంటే ఏప్రిల్ 3న థియేటర్లలోకి రాబోతోంది. ఈ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ కి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాత. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఒక చందమామ కథలా సాగే ఈ విభిన్నమైన సబ్జెక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. 'కమిటీ కుర్రోళ్లు' వంటి సక్సెస్ తర్వాత నిహారిక నిర్మిస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి క్రేజ్ ఉంది. 'కార్మేని సెల్వం' & 'లీడర్' ఇవే కాకుండా, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన 'కార్మేని సెల్వం'(Carmeni Selvam) కూడా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతి సామాన్యుడు తనని తాను గుర్తు చేసుకునేలా ఈ కథ ఉంటుందని దర్శకుడు రామ్ చక్రి వెల్లడించారు. అలాగే, లెజెండ్ శరవణన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'లీడర్'(Leader) కూడా ఇదే వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏప్రిల్ నెల టాలీవుడ్‌కు చాలా కీలకం కానుంది. శర్వానంద్ గతంలో 'ఒకే ఒక జీవితం' వంటి ప్రయోగాత్మక సినిమాలతో సక్సెస్ సాధించి, ఇప్పుడు 'బైకర్'తో మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఇక సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరి సినిమాలూ ఒకే రోజు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాలపై చర్చ జోరుగా సాగుతోంది. శర్వానంద్ మేకోవర్, బైక్ రేసింగ్ సీక్వెన్స్ గురించి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు 'రాకాస'లోని ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏప్రిల్ మొదటి వారం తెలుగు సినీ ప్రియులకు ఫుల్ మీల్స్ లాంటి వినోదాన్ని పంచబోతోంది. మరి ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి.  
గ్లామర్ ఇండస్ట్రీలో చీకటి కోణాలు చేదు అనుభవాలు బయటపెట్టిన ప్రముఖ నటి షూటింగ్ సెట్‌లో అసభ్యంగా ప్రవర్తించిన నటుడు సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. అయితే బయటకి కనిపించే మెరుపుల వెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయనేది కాదనలేని సత్యం. తాజాగా భోజ్‌పురి సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అంతరా బిస్వాస్ అలియాస్ మోనాలిసా(Monalisa) తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన అనుభవాలను పంచుకుంది. కాస్టింగ్ కౌచ్ నుండి సెట్‌లో అసభ్య ప్రవర్తన వరకు ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంటిమేట్ సీన్ లో హద్దు దాటిన నటుడు ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాలిసా మాట్లాడుతూ.. ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుంది. "ఓ బెడ్ రూమ్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు నా సహ నటుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. దర్శకుడు 'కట్' అని చెప్పినప్పటికీ అతను నన్ను వదలలేదు. కట్ చెప్పిన తర్వాత కూడా అలాగే ప్రవర్తించడం చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా, ఆ నటుడు దర్శకుడితో కూడా గొడవకు దిగాడని, దీంతో సెట్‌లో ఉన్నవారంతా తీవ్ర ఇబ్బందికి గురయ్యారని ఆమె పేర్కొంది. కాస్టింగ్ కౌచ్.. తనను సినిమాల్లోకి తీసుకునే ముందు కొందరు దర్శకనిర్మాతలు పెట్టిన కండిషన్లను కూడా ఆమె బయటపెట్టింది. "నేను ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు కొన్ని ఆఫర్లు రావాలంటే కాంప్రమైజ్ కావాలని నేరుగానే అడిగారు. అది విన్నప్పుడు నాకు చాలా అసహ్యం వేసింది. అలాంటి పనులు చేసి ఆఫర్లు సంపాదించడం నాకు ఇష్టం లేదు. అందుకే చాలా ప్రాజెక్టులను వదులుకున్నాను" అని మోనాలిసా స్పష్టం చేసింది. కేవలం డబ్బు కోసమే కొన్ని బి-గ్రేడ్ సినిమాల్లో తప్పక నటించాల్సి వచ్చిందని, కానీ ఎప్పుడూ తన వ్యక్తిత్వాన్ని మాత్రం తగ్గించుకోలేదని తెలిపింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! మోనాలిసా కేవలం భోజ్‌పురికే పరిమితం కాలేదు. తెలుగులో 'జగడం', 'బోణి' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసి ఇక్కడి ఆడియన్స్‌ను కూడా అలరించింది. ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొని నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 'నజర్' వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బెంగాలీ కుటుంబంలో జన్మించిన అంతరా బిస్వాస్.. తన మావయ్య సూచన మేరకు 'మోనాలిసా'గా పేరు మార్చుకుని ప్రముఖ నటిగా ఎదిగింది. నెటిజన్ల మద్దతు.. మోనాలిసా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ధైర్యంగా తన అనుభవాలను బయటపెట్టినందుకు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో హీరోయిన్ల భద్రత కోసం సినిమా సెట్స్‌లో కఠినమైన నిబంధనలు ఉండాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మోనాలిసా పలు వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలతో బిజీగా ఉంది. విక్రాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్న ఈ నటి, తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే కెరీర్ పరంగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
RC17 కోసం సుకుమార్ సంచలన నిర్ణయం దేవి శ్రీ ప్రసాద్ ప్లేస్ లో 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్! గత కొంతకాలంగా ఇండియా వైడ్ గా 'ధురంధర్'(Dhurandhar) పేరు మారుమోగిపోతోంది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన 'ధురంధర్' దాదాపు రూ.1400 కోట్లతో సంచలనం సృష్టించగా, దానికి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన 'ధురంధర్-2' అంతకుమించిన వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 'ధురంధర్' అద్భుత విజయంలో శాశ్వత్ సచ్‌దేవ్(Shashwat Sachdev) అందించిన సంగీతం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అలాంటి శాశ్వత్ సచ్‌దేవ్ త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఆయన రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. 'రంగస్థలం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా #RC17పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుంటాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలన్నీ చార్ట్‌బస్టర్లే. అయితే, ఈసారి సుకుమార్ ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. #RC17 కోసం బాలీవుడ్ సెన్సేషన్ శాశ్వత్ సచ్‌దేవ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరు ఈ శాశ్వత్ సచ్‌దేవ్? శాశ్వత్ సచ్‌దేవ్ గతంలో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇటీవల విడుదలైన 'ధురంధర్ 2' సినిమాలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈయన మ్యూజిక్ స్టైల్ చాలా యూనిక్‌గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండటంతో సుకుమార్ ఈయన్ని ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట.  సుకుమార్ సినిమాల్లో మ్యూజిక్ కి పెద్ద పీట ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసిన గత సినిమాలు 'పుష్ప-1', 'పుష్ప-2' పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించగా, అందులో మ్యూజిక్ ఎంతటి హైలైట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు #RC17 కోసం అంతకుమించి అనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అందుకే శాశ్వత్ సచ్‌దేవ్ ని రంగంలోకి దింపుతున్నారట. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షూటింగ్ అప్‌డేట్ ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. ఆ తర్వాత వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే సుకుమార్ దుబాయ్‌లో ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ శాశ్వత్ సచ్‌దేవ్ ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, రామ్ చరణ్ సినిమాకు ఒక సరికొత్త సౌండ్ వినడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ మార్క్ టేకింగ్ కు ఈ ధురంధర్ మ్యూజిక్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే అని చెప్పవచ్చు.  
- 'స్వయంభూ', 'పెద్ది' సినిమాల రిలీజ్‌పై ఉత్కంఠ‌ - ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే సినిమా షెడ్యూల్స్‌లో మార్పు - సస్పెన్స్‌లో క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వేసవి సందడి మొదలైంది. మార్చి ముగిసి ఏప్రిల్ నెలలోకి అడుగుపెడుతున్న తరుణంలో, సినీ ప్రేమికులందరూ కొత్త సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ నెలలో థియేటర్లలోకి రావాల్సిన రెండు భారీ చిత్రాల విడుదల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్వయంభూ', అలాగే రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రాల రిలీజ్ డేట్లపై ప్రస్తుతం ఒక రకమైన సస్పెన్స్ కొనసాగుతోంది. చారిత్రక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'స్వయంభూ'. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ పోస్టర్‌లో 'సమ్మర్ రిలీజ్' అని మాత్రమే పేర్కొన్నారు తప్ప, కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 10న వస్తుందని అందరూ భావించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడంతో ఆ తేదీన సినిమా వచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 30కి షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు 'పెద్ది' సినిమా విడుదలపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్‌లో ఏప్రిల్ 30న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజా టాక్ ప్రకారం, ఈ సినిమా ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, రెండు పాటల షూటింగ్ కూడా పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఏప్రిల్ 30న 'స్వయంభూ' ఫిక్స్ అయితే, 'పెద్ది' రేసు నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన వారాల్లో మరికొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో 'బైకర్', 'రాకాస' వంటి చిన్న చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి. ఇక రెండో వారంలో అడివి శేష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'డెకాయిట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడో వారంలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్', 'తిమ్మరాజుపల్లి టీవీ' వంటి విభిన్న చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. నెల చివరి వారంలో మాత్రం ఏ సినిమా నిలుస్తుందనేది ప్రస్తుతానికి మిస్టరీగానే మారింది. నిఖిల్ తన గత చిత్రం 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా, రామ్‌చ‌ర‌ణ్ పెద్ది సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరి సినిమాలపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ రెండు చిత్రాల అప్‌డేట్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మ‌రి ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఏ సినిమా విజేత‌గా నిలుస్తుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 
అభిమానం ముసుగులో అరాచకం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో నటిపై వేధింపులు సెల్ఫీల సాకుతో హనీ రోజ్‌తో అసభ్య ప్రవర్తన మలయాళ ముద్దుగుమ్మ 'హనీ రోజ్'(Honey Rose) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 'వీరసింహారెడ్డి'లో బాలకృష్ణ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి ఒక చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్స్ మాత్రమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, బ్రాండ్ ప్రమోషన్లతో నిత్యం బిజీగా ఉండే ఈ నటిపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాకరాని చోట తాకి  కేరళలో జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హనీ రోజ్ ముఖ్య అతిథిగా హాజరైంది. తన అభిమాన నటిని చూడటానికి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎప్పటిలాగే నవ్వుతూ పలకరిస్తూ, అందరికీ సెల్ఫీలు ఇస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు అతిగా ప్రవర్తించారు. సెల్ఫీ తీసుకుంటున్న నెపంతో ఆమె నడుముపై, వెనుక భాగంలో(నడుము కింద) చేతులు వేస్తూ అసభ్యంగా తాకారు. జనం మధ్యలో ఉండటం వల్ల మొదట సంయమనం పాటించినప్పటికీ, వారి ప్రవర్తన మితిమీరడంతో ఆమె తీవ్ర అసహనానికి గురై అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానం ఉండాలి కానీ, అది వేధింపుల స్థాయికి చేరకూడదని నెటిజన్లు మండిపడుతున్నారు. సెలబ్రిటీల భద్రత విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ పలువురు హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. పబ్లిక్ లో ఇలా జరగడం దురదృష్టకరం. టాలీవుడ్‌లో హనీ రోజ్ క్రేజ్ 'వీరసింహారెడ్డి' సినిమాతో హనీ రోజ్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు, ముఖ్యంగా 'మా బావ మనోభావాలు' పాటలో ఆమె వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయ్యారు. అంతకుముందే తెలుగులో 'ఆలయం', 'ఈ వర్షం సాక్షిగా' వంటి సినిమాల్లో నటించినప్పటికీ, బాలయ్య సినిమాతోనే ఆమెకు అసలైన బ్రేక్ దక్కింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, కొన్ని వివాదాల ద్వారా కూడా హనీ రోజ్ వార్తల్లో నిలిచింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యాపారవేత్తపై ఆమె చట్టపరమైన పోరాటానికి దిగింది. అలాగే తనను వేధింపులకు గురిచేస్తున్న సుమారు 27 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. "నేను మీమ్స్, జోక్స్‌ను ఎంజాయ్ చేస్తాను కానీ, అసభ్యతను సహించను" అని ఆమె గట్టిగా చెప్పడం విశేషం. త్వరలో హనీ రోజ్ తన తదుపరి సినిమా 'రాచెల్' (Rachel) తో అలరించడానికి సిద్ధమవుతోంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. https://x.com/Theteluguone/status/2038505787409195272
- ఖాన్‌ల రికార్డులను బద్దలు కొట్టిన సంజయ్ దత్ - ఇండియన్ సినిమాలో అరుదైన మైలురాయి - సంజయ్ దత్ ఉంటే చాలు క‌లెక్ష‌న్ల వ‌ర్ష‌మే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు వంద కోట్లు వసూలు చేస్తేనే గొప్ప అనుకునే రోజులు పోయి, ఇప్పుడు ఏకంగా వెయ్యి కోట్ల మార్కును అందుకోవడమే లక్ష్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ వంటి స్టార్లు వెయ్యి కోట్ల క్లబ్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే, ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని రీతిలో సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మూడు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రాల్లో భాగమైన ఏకైక నటుడిగా సంజయ్ దత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న సంజూభాయ్, ఇప్పుడు పెద్ద సినిమాలకు 'గోల్డెన్ లెగ్'గా మారిపోయారు. కేవలం హీరోగానే కాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మరియు స్పెషల్ అప్పియ‌రెన్స్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణం కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్ 2’తో మొదలైంది. ఇందులో ‘అధీర’గా సంజయ్ దత్ చూపించిన విలనిజం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంజయ్ దత్ క్రేజ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో మెరిసినా, ఆ సినిమా కూడా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో సంజూ ఖాతాలో రెండో వెయ్యి కోట్ల సినిమా చేరింది. తాజాగా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్ 2’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. దీనితో సంజయ్ దత్ హ్యాట్రిక్ సాధించినట్లయింది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండు వెయ్యి కోట్ల చిత్రాలతో (పఠాన్, జవాన్) రెండో స్థానంలో ఉండగా, సంజయ్ దత్ మూడు చిత్రాలతో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. దళపతి విజయ్ నటించిన ‘లియో’లో కూడా సంజయ్ దత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే, ఆయన కేవలం ఇమేజ్ కోసం కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. ఆయన వాయిస్ బేస్, నటనలోని గంభీరత్వం సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందుకే నేటి తరం దర్శకులు తమ భారీ ప్రాజెక్టులలో సంజూభాయ్ ఉండాలని కోరుకుంటున్నారు. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, సంజయ్ దత్ సినిమాలో ఉన్నారంటే ఆ ప్రాజెక్ట్ రేంజ్ మరియు బిజినెస్ వాల్యూ అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో కూడా సంజూభాయ్ ఫ్యాన్స్ ఈ రికార్డును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. "రాజు ఎక్కడ ఉన్నా రాజే" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలా రాణించాలో సంజయ్ దత్ నిరూపిస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన రాకతో సినిమాలకు వచ్చే హైప్ వసూళ్ల రూపంలో ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం సంజయ్ దత్ చేతిలో మరికొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ సినిమాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ల సినిమాల్లో కూడా సంజూభాయ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే, సంజయ్ దత్ ఖాతాలో మరిన్ని వెయ్యి కోట్ల చిత్రాలు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక నటుడిగా తనను తాను నిరంతరం మలుచుకుంటూ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంటున్న సంజయ్ దత్ ప్రయాణం నిజంగా అద్వితీయం.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan), టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. #SVC63 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న 63వ చిత్రమిది. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌కు, వంశీ పైడిపల్లి క్లాసీ అండ్ ఎమోషనల్ మేకింగ్‌ తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షూటింగ్ అప్‌డేట్: ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. ముంబైలోని గోరెగావ్‌లో ఇందుకోసం ఒక భారీ 'మినీ సిటీ' సెట్‌ను కూడా నిర్మించినట్లు సమాచారం. ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సల్మాన్ ఖాన్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌లో, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో వంశీ చూపించబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై మొదటిసారి రాబోతుండటం విశేషం. అంతేకాకుండా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్. రిలీజ్ టార్గెట్: ఈద్ 2027 సల్మాన్ ఖాన్‌కు 'ఈద్' సీజన్ అంటే ఎంత సెంటిమెంటో మనకు తెలిసిందే. అందుకే ఈ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ కానుంది. దిల్, దిమాగ్, జిగర్‌తో వస్తున్నాం! షూటింగ్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "దిల్, దిమాగ్, జిగర్ సే.. ఈ ఏప్రిల్ నుండి ప్రారంభం" అంటూ డైరెక్టర్ వంశీతో దిగిన ఫోటోను షేర్ చేశారు. వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ ప్రభాస్‌తో 'మున్నా' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన వంశీ పైడిపల్లి.. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి బ్లాక్ బస్టర్లను అందించారు. విజయ్‌తో 'వారసుడు' తీసి కోలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెడుతున్నారు. నిజానికి బాలీవుడ్ ఎంట్రీ కోసం చాలారోజులుగా వంశీ వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన ఎదురుచూపులకు తెర పడింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, బలమైన ఎమోషనల్ కోర్ ఉన్న ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  https://x.com/SVC_official/status/2038507294846255377
సినిమా థియేట‌ర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఒకప్పుడు ఇంటర్వెల్‌లో బయటకు వెళ్లి స్నాక్స్ తెచ్చుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కూర్చున్న చోటికే ఫుడ్ డెలివరీ చేసే సౌకర్యాన్ని మల్టీప్లెక్స్ సంస్థలు ప్రవేశపెట్టాయి. అయితే ఈ ‘సీట్ డెలివరీ’ విధానం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది. ముఖ్యంగా ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) ఈ విషయంలో నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల కాలంలో థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. టికెట్ ధర కంటే పాప్‌కార్న్, కూల్ డ్రింక్ ధరలే ఎక్కువగా ఉంటున్నాయని ప్రేక్షకులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు ‘ఇన్-సీట్ డెలివరీ’ పేరుతో జరుగుతున్న జాప్యం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. సినిమా మధ్యలో ఆర్డర్ చేసిన ఫుడ్ సకాలంలో అందకపోవడం, ఒకవేళ వచ్చినా అది పక్కన ఉన్న వారిని ఇబ్బంది పెట్టేలా ఉండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చాలా మంది నెటిజన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటున్నారు. ఒక యూజర్ తన అనుభవాన్ని వివరిస్తూ.. "సినిమా మొదలైనప్పుడే ఆర్డర్ చేస్తే, ఇంటర్వెల్ అయిపోయిన అరగంటకు ఫుడ్ తెచ్చారు. అప్పటికే ఆకలి చచ్చిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు పీవీఆర్ ఐనాక్స్ స్టాఫ్ ప్రవర్తనపై కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. సినిమా సీరియస్ మోడ్‌లో ఉన్నప్పుడు సర్వర్లు వచ్చి అడ్డుగా నిలబడటం వల్ల విజువల్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో కూడా పీవీఆర్ ఐనాక్స్ ధరల విషయంలో కోర్టు మెట్లు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల బెంగళూరులో ఒక వినియోగదారుడు అరగంట పాటు యాడ్స్ వేశారని కోర్టుకు వెళ్లగా, సదరు మల్టీప్లెక్స్ సంస్థకు జరిమానా కూడా పడింది. ఇప్పుడు ఫుడ్ డెలివరీలో జరుగుతున్న లోపాలు ఆ సంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తున్నాయి. కేవలం ఫుడ్ అండ్ బెవరేజెస్ (F&B) ద్వారానే పీవీఆర్ ఐనాక్స్ ఏడాదికి వందల కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఇంత భారీగా వసూలు చేస్తూ కనీస సర్వీస్ అందించకపోవడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లు కేవలం సినిమాలు చూసే ప్రదేశాలుగా కాకుండా, రెస్టారెంట్లుగా మారిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు విడుదలైనప్పుడు ఇటువంటి ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటున్నాయని సినిమా ప్రియులు వాపోతున్నారు. ఆర్ఆర్ఆర్, కల్కి వంటి పెద్ద సినిమాల సమయంలో థియేటర్లలో రద్దీ దృష్ట్యా సర్వీస్ అసలు సరిగ్గా ఉండటం లేదని టాక్. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు లాభాల వేటలో పడి ప్రేక్షకులకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నది తాజా వివాదంతో స్పష్టమవుతోంది. సీట్ డెలివరీ విధానాన్ని మెరుగుపరచడమో లేదా ధరలను తగ్గించి కస్టమర్ ఫ్రెండ్లీగా వ్యవహరించడమో చేయకపోతే, రాబోయే రోజుల్లో ఓటీటీల దెబ్బకు థియేటర్లకు వచ్చే జనం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ గొడవపై పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది.  మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్దం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి.   ఇంత కఠినమైన వేసవి ఎండలో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.  లేకపోతే  అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఎంటో తెలుసుకుంటే.. వాటర్ బాటిల్.. మండుటెండలో  ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు  బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్  ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమై  అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ. సన్ గ్లాసెస్.. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు  బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ నుండి  కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి. సన్‌స్క్రీన్ క్రీమ్.. వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ  చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్  రాసుకోవచ్చు. గొడుగు.. వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది  ఎండ నుండి కాపాడటానికి సహాయపడుతుంది. స్కార్ఫ్ లు.. అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది  తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ,  చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.                                     *రూపశ్రీ.
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు.  చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు.  అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి? 1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి  తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది.  ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్  పనితీరును అందిస్తుంది. నైట్ బ్యాకప్ సెలక్షన్.. సోలార్ ఏసీ  అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట  బ్యాటరీ బ్యాకప్ అయిపోతే,  దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా  ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది.  సులభంగా చెప్పాలంటే,  సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు. పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.                                         *రూపశ్రీ.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. రాత్రి భోజనం.. రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు. కాఫీ.. కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్.. రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది. చిరుతిళ్లు.. కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి.. నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. మద్యం.. రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.                                  *రూపశ్రీ.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.