IPL Vs కోర్టులు

Publish Date:Apr 23, 2016

Advertisement

 


భారతదేశంలో క్రికెట్‌ బంతిని బీసీసీఐ శాసిస్తుందన్న విషయం రహస్యమేమీ కాదు. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్‌ సమాఖ్యగా పేరొందిన బీసీసీఐ ఆటలకు ఎదురులేకుండా పోతోందన్న విమర్శలు తరచూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అలాంటి బీసీసీఐని భారతీయ కోర్టులు బంతిలా ఆడుకోవడమే ఇప్పటి వార్త. ఈ విషయాన్ని బీసీసీఐ జీర్ణించుకోలేకపోవడం సహజమే!

 

ఐపీఎల్‌ చరిత్ర మొదటి నుంచీ వివాదాస్పదంగానే సాగింది. ప్రపంచవ్యాప్తంగా టి-20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థ 2007లో ICL అనే టోర్నమెంటుని ఆరంభించింది. దేశంలో జరిగే ముఖ్యమైన క్రికెట్‌ ఘట్టాలన్నీ తన కనుసన్నలలో జరగాలని ఆశించే బీసీసీఐ, ICL మీద నానారకాల నిబంధనలూ విధించి అది మూతపడేలా చేసింది. ఆ తరువాత తానే 2008లో IPL పేరిట ఒక టి-20 టోర్నమెంటుని ప్రారంభించింది. అసలు ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లను వేలం వేసే విధానమే తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. దానికి తోడు ఐపీఎల్‌ ఆటగాళ్లను గెలుపుగుర్రాలుగా వాడుకుంటూ, వారితో విపరీతంగా ఆడించడం మొదలుపెట్టింది బీసీసీఐ. దాంతో అసలైన అంతర్జాతీయ ఆటలు ఆడే సమయానికి వారు తీవ్రంగా అలసిపోవడమో, గాయాల పాలవడమో జరిగేది. ఐపీఎల్‌ ఫార్మాటుకి అలవాటుపడిన ఆటగాళ్లు వన్‌డే, టెస్ట్‌ మ్యాచ్‌ తదితర ఫార్మాట్లకు పనికిరాకుండా పోతున్నారన్నది అతి పెద్ద విమర్శ. వీటికి తోడు ఫ్రాంచైజీలకు సంబంధించిన గొడవలు, క్రికెట్‌ బెట్టింగ్‌ కుంభకోణాలు ఎలాగూ ఐపీఎల్‌ను వెన్నంటే ఉన్నాయి.

 

తనకున్న అధికార, ధనబలంతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలనని ధీమాగా ఉండే బీసీసీఐకి ఈసారి కోర్టులు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ లక్షలాది లీటర్ల నీటిని వృథా చేస్తోందంటూ బొంబాయి హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసుని విచారిస్తూ బొంబాయి హైకోర్టు, బీసీసీఐని దులిపి పారేసింది. ఓ పక్క మహారాష్ట్ర కనీవినీ ఎరుగని కరువుతో అల్లాడిపోతుంటే మీరు మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైకోర్టు బీసీసీఐ మీద తీవ్రమైన విమర్శలు చేసింది. ఇలా నీటిని వృథా చేయడం తీవ్రమైన నేరమనీ, బీసీసీఐకి నీటి సరఫరాని నిలిపివేస్తే కానీ నీటి విలువ వారికి తెలిసిరాదంటూ దుయ్యబట్టింది. ‘మీకు ప్రజల కంటే క్రికెట్‌ మ్యాచ్‌లే ఎక్కువైపోయాయా’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చురకలంటించింది. మే 1 తరువాత మహారాష్ట్రలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చింది.

 

బొంబాయి హైకోర్టు దుయ్యపట్టి వదిలిపెట్టినా, బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందా అంటే అదీ లేదు! కరువు విషయంలో మహారాష్ట్రకంటే దారుణమైన స్థితిలో ఉన్న రాజస్థాన్‌కు సదరు మ్యాచ్‌లను తరలించింది. దీంతో ఒళ్లుమండిన రాజస్థాన్ వాసులు కూడా నీటి వృథాకు సంబంధించి హైకోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసుని స్వీకరిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే అక్కడ కూడా బీసీసీఐ పప్పులు ఉడికేట్లు కనిపించడం లేదు. తమకు ఎదురులేదని బోరవిరుచుకు తిరిగే బీసీసీఐకి, కోర్టు తీర్పులు సయించడం లేదు. అందుకే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. ప్రజాహితవ్యాజ్యాలకు బీసీసీఐ లక్ష్యంగా మారిపోయిందనీ, వీటివల్ల బోర్డుకి అపారమైన నష్టం చేకూరుతోందని అన్నారు. మ్యాచ్‌లను మాటిమాటికీ తరలించడం వల్ల ఆటగాల్ల దగ్గర నుంచి, ప్రసార సాధనాల వరకు అన్నింటినీ రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోందని ఆగ్రహించారు. అందుకే ఇక నుంచి విదేశాలలో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని పెర్కొన్నారు. పనిలో పనిగా అనురాగ్‌ ఠాకూర్‌ ఈ నష్టాలు మాజీ ఆటగాళ్లకు అందించే పెన్షన్ల మీద ప్రభావం చూపుతాయని కూడా అన్నారు.

 

అనురాగ్‌ ఠాకూర్‌ మాటలలో ఆవేదన కంటే బెదిరింపే ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా బీసీసీఐ ప్రవర్తన ఇలాగే ఉంటుంది! నిజంగా బీసీసీఐ కోపంలో న్యాయం ఉందా? మహారాష్ట్రలో కరువుకి అనేక కారణాలు ఉన్నాయి. విచక్షణా రహితంగా చెరకుని పండించడం, ఎడాపెడా బోర్లను తవ్వేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయకపోవడం... వంటి మానవ తప్పిదాలకు తోడు మూడేళ్లుగా విఫలమవుతున్నా వర్షపాతం కూడా అక్కడి కరువుకి కారణం అయ్యింది. అయితే అలాంటి పరిస్థితుల్లో దాదాపు 80 లక్షల లీటర్ల నీటిని ఉపయోగించి బీసీసీఐ, మ్యాచ్‌లను ఎందుకు నిర్వహిస్తోంది అన్నదే అసలు ప్రశ్న. పోనీ అక్కడి నుంచి మ్యాచ్‌లను తరలించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడన్నా, కొత్త వేదికలలో నీటి లభ్యత గురించి ఆలోచించిందా అంటే అదీ లేదు! పోయి పోయి ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో మ్యాచ్‌ను నిర్వహిస్తానంటే అక్కడి ప్రజలకు ఒళ్లు మండదా!
ఇంతా చేసి ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉందన్న వార్తలు వినవస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ను సాగదీసి, వాటి గురించి అతిగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఐపీఎల్‌ అంటే విరక్తి పుట్టిందన్న వాదనలు వినవస్తున్నాయి. వీటికి తోడు ఈసారి దేశవ్యాప్తంగా ఎండలు మండిపోవడంతో స్టేడియంలు వెలవెలబోతున్న దృశ్యాల టీవీల్లో కనిపిస్తున్నాయి. ఇంతజరుగుతున్నా బీసీసీఐ తన ధోరణిని మార్చుకుంటుందని ఆశించలేం. తన తప్పుని సరిదిద్దుకుంటుందని ఊహించలేం! ఎందుకంటే బీసీసీఐ ఏ పని చేసినా దాని వెనుక నూటికి నూరు శాతం ఆర్థిక కోణం ఉంటుందనే అపవాదు ఉండనే ఉంది కదా!

 

మండు వేసవిలో మ్యాచ్‌లను నిర్వహించినా, ఆ మ్యాచ్‌లకు ముంబైను వేదికగా చేసినా... ఇలా ఏ పని చేసినా దాని వెనుక ప్రజాకర్షణ, ప్రసార హక్కులే బీసీసీఐ నిర్ణయాలను నియంత్రిస్తాయి. వేసవిలో ఆడటం వల్ల ఆటగాళ్లు నీరసించిపోతారని హెచ్చరించినా, సదరు రాష్ట్రాల్లో కరువు తాండవిస్తోందని తెలిసినా బీసీసీఐ పెద్దగా పట్టించుకోదు. కావాలంటే డబ్బు పడేస్తాం అని కూడా అంటుంది. కానీ ఈసారి డబ్బుతోనో అధికారంతోనో పని జరిగేట్లు కనిపించడం లేదు. మహారాష్ట్ర కరువు నిధికి 5 కోట్లు అందిస్తామంటూ బీసీసీఐ చేసిన సూచనను బొంబాయి హైకోర్టు అంతగా పట్టించుకోలేదు. బొంబాయి హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఇప్పుడు బీసీసీఐ సుప్రీం కోర్టు తలుపులు తడుతోంది. మరి అక్కడి నుంచి ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చూడాలి!

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.