యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక.. కాంగ్రెస్ కథ మారేనా?
Publish Date:Sep 14, 2021
Advertisement
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలే అత్యంత కీలకంగా మరాయి. యూపీ ఫలితం 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు సీరియస్ గా వర్క్ చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే మెజార్టీ కేంద్రమంత్రులను యూపీ నుంచే తీసుకుంది. ఐదుగురు కేంద్ర మంత్రులను యూపీకి ఇంచార్జులుగా నియమించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా నేతలంతా యూపీపై ఫోకస్ చేశారు. ఎస్పీ బీఎస్పీలు జట్టుకట్టి ఈసారి తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇక గతంలో యూపీని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 403 స్థానాలకు గాను 312 సీట్లు గెలిచి సత్తా చాటింది. సమాజ్ వాదీ పార్టీ 47 బీఎస్పీ 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ కేవలం 7 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.ఈసారి ఆ పార్టీ ఒంటరిగా పోటీచేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈసారి ప్రియాంకగాంధీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించే అవకాశాలున్నాయని సల్మాన్ ఖుర్షీద్ చెప్పడంతో యూపీ రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉందంటున్నారు. యూపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రియాంక ఎంతో కష్టపడుతోంది. పోయిన సారి ప్రతి ఊరు వాడ తిరిగి దళితులు బీసీల ఇళ్లలోకి వెళ్లి భోజనం చేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎంతో కష్టపడ్డారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు మాత్రం పడలేదు. అయినా ప్రియాంక మాత్రం వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ తో వచ్చేవారిని ఆహ్వానిస్తూ ముందుకెళుతున్నారు. ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/up-congress-cm-candifate-priyanka-gandhi-39-122947.html





