LATEST NEWS
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సరదాగా గడపాల్సిన విహారయాత్రలో మృత్యువు ఊయల రూపంలో దూసుకొచ్చింది. పది మంది పిల్లలు ఎక్కిన భారీ ఇనుప ఊయల.. చివరకు పదేళ్ల అభిరామ్ ప్రాణాలను బలిగొంది. బిడ్డను సంతోషంగా పిక్నిక్‌కు పంపిన తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. హైదరాబాద్‌లోని నార్సింగికి చెందిన హ్యాపీ స్కాలర్స్ స్కూల్ విద్యార్థులను యాజమాన్యం విహారయాత్ర కోసం మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌కు తీసుకెళ్లింది. అక్కడ పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పార్క్‌లోని భారీ ఇనుప ఊయలపై సుమారు పది మంది చిన్నారులు ఎక్కారు. వెనుక వైపు నుంచి మరో నలుగురు విద్యార్థులు ఊయలను వేగంగా ఊపడంతో దాని వేగం క్రమంగా పెరిగింది. ముందుకు వేగంగా దూసుకెళ్లిన ఊయల.. అంతే వేగంతో వెనక్కి వస్తున్న సమయంలో సమీపంలో ఉన్న అభిరామ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంతో అక్కడున్న చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. ఊయల బలంగా తగలడంతో అభిరామ్ నుదురు, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థి యశ్వంత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పదేళ్ల అభిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాసేపటి క్రితం వరకు పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న పిక్నిక్ ప్రాంగణం.. ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదం వెనుక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వద్ద ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లల భద్రతను పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడ చదవండి: ఈ నెల 26 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.! తమ బిడ్డను స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి పిక్నిక్‌కు పంపిస్తే.. తిరిగి ప్రాణాలతో ఇంటికి రాలేదంటూ అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం, పార్క్ నిర్వాహకుల బాధ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన విషయం బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంతో బాలుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల విహారయాత్రల్లో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఒక్క క్షణం ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసింది. స్కూల్ పిక్నిక్ అంటేనే ఉత్సాహంగా ఎదురుచూసే చిన్నారుల మధ్య జరిగిన ఈ విషాదం.. అభిరామ్ కుటుంబానికి జీవితాంతం తీరని వేదనగా మిగిలిపోయింది. పిల్లలను నమ్మకంగా పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు వారి భద్రతపై ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. మీకు నచ్చవచ్చు: Hyderabad: సెప్టిక్ ట్యాంక్‌లో పడి ముగ్గురు మృతి.! మీకు నచ్చవచ్చు: Nvidia CEO జెన్సన్ హువాంగ్  ప్రసంగిస్తుండగా  కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.!    [ Abhiram, Lotus Pond Park, Moinabad Accident, Bachupally School Picnic, Happy Scholars School, Narsingi, School Picnic Tragedy, Swing Accident, Iron Swing Accident, Ten Year Old Boy Dead, Student Death ]
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఓ కార్మికుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో హైదరాబాద్‌లోని బాచుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాత్రి అపార్ట్‌మెంట్‌లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు షణ్ముఖ అనే కార్మికుడు తొలుత లోపలికి దిగాడు. అయితే కొద్దిసేపటికే అతడు ఊపిరాడక తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. లోపల చిక్కుకున్న షణ్ముఖను కాపాడాలనే ఆతృతతో సురేష్, పవన్ అనే మరో ఇద్దరు కార్మికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. కానీ విధి మరోలా తలచింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ ట్యాంక్‌లోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరూ చివరకు విగతజీవులుగా మారడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా సెప్టిక్ ట్యాంక్‌లో వెలువడిన విషవాయువుల కారణంగా ఊపిరాడక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రోజువారీ కూలీ పనులతో కుటుంబాలను పోషిస్తున్న ముగ్గురు కార్మికులు ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయి. ఇంటికి తిరిగొస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు వారి మరణవార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఒకరి ప్రాణం కాపాడాలనే ప్రయత్నం ముగ్గురి జీవితాలను బలిగొంది. రెప్పపాటులో మూడు కుటుంబాల్లో చీకట్లు నింపిన ఈ ఘటన బాచుపల్లిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: నీటితో నడిచే మెగా బ్యాటరీగా పోలవరం.. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ.! మీకు నచ్చవచ్చు: ఈ నెల 26 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.!    [ Bachupally Accident, Dhatri Apartments, Septic Tank Accident, Three Workers Dead, Shanmukh, Suresh, Pawan, Toxic Gas, Suffocation Deaths, Hyderabad News, Bachupally Police, Septic Tank Cleaning, Sanitation Workers ]
తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిష  మరో సారి చర్చనీయాంశంగా మారారు. త్రిష పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం  జోరుగా సాగుతున్న వేళ  ఆమె అభిమానులు త్రిష పేరుమీద   కొత్త వేదికను ప్రారంభించారు.  అక్కడితో ఆగకుండా ఆమెను దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత రాజకీయ వారసురాలిగా అభివర్ణించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జయలలితకు ఉన్న  పురట్చి తలైవి బిరుదును గుర్తుచేసేలా,  ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కావడం తమిళ సినీ, రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చకు తెర లేచింది.  ఈ వేదిక నిర్వాహకులు విడుదల చేసిన వివరాల ప్రకారం..  త్రిష వ్యక్తిత్వం, దృఢత్వంలో జయలలిత లక్షణాలు కనిపిస్తాయి.   తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే  ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే..  భవిష్యత్తులో విజయ్‌తో కలిసి త్రిష కూడా రాజకీయ ప్రయాణం చేస్తే..  రాష్ట్రంలో జయలలిత తరహా  పాలన వస్తుందన్నది ఆ వేదిక నిర్వాహకుల అభిప్రాయం.   ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ, త్రిష రాజకీయ ప్రవేశానికి అనుకూల వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా,  ఆమెకు ఈ వేదికతో   ప్రత్యక్ష సంబంధం ఉందా అనే అంశాలపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు.  ఇప్పటివరకు నటి త్రిష స్వయంగా రాజకీయ ప్రవేశంపై గానీ, టీవీకే పార్టీలో చేరడంపై గానీ   అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.  కేవలం అభిమానుల ఆకాంక్షలు, కొత్త వేదిక ప్రారంభోత్సవ ప్రకటనల ఆధారంగానే ఈ రాజకీయ చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలతో పాటు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌కు సంబంధించిన చర్చలూ తెరపైకి వచ్చాయి. గతంలో జయలలిత పాత్ర కోసం త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తలు వినిపించినప్పటికీ..  ఆ ప్రాజెక్ట్ లేదా నటీనటుల ఎంపికపై ఎటువంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. అయినప్పటికీ.. జయలలితతో పోలికలు, బయోపిక్ ప్రస్తావనలు కలగలిసి త్రిష పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి.  ఇది కూడా చదవండి:  త్రిష రాజకీయరంగ ప్రవేశం: మీడియాతో రాజకీయాలపై త్రిష ఏం మాట్లాడిందంటే! దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.  , సినిమా షూటింగ్‌లు, వృత్తిపరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉండే త్రిష ఈ ఊహాగానాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.  ఏది ఏమైనా రానున్న రోజులలో ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  తరఫున చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, తమిళనాడు రాజకీయ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.  మొత్తంగా  జయలలిత వారసత్వం, సీఎం విజయ్‌తో రాజకీయ ప్రయాణ అంచనాల నేపథ్యంలో త్రిష పేరు చుట్టూ మొదలైన చర్చ తమిళనాడులో పొలిటికల్ హీట్ ను పెంచింది.  మీకు నచ్చవచ్చు:  విజయ్ ఇంటికి త్రిష.. సిఎం అవ్వబోతున్నాడా! విజయ్ ఈవెంట్‌లో త్రిష సడన్ ఎంట్రీ.. ఊహించని ట్విస్ట్‌తో షాక్ తిన్న ఫ్యాన్స్! [Actress Trisha, olitical Entry, Jayalalitha, Successor, Ilaiya Puratchi Thalaivi, Trisha Peravai, TeluguOne] 
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.! రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయా? పేద రోగులకు అండగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ పథకం నిధులే పక్కదారి పట్టాయా? హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టెండర్ల నుంచి క్యాంటీన్ నిర్వహణ వరకు, మెడికల్ షాపుల నుంచి ఆపరేషన్ థియేటర్ల వరకు పలు విభాగాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా రోగులు మరణించిన తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించడం విస్మయానికి గురిచేస్తోంది. రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు.. ఆపరేషన్ థియేటర్లలోనే నిల్వ.! నిమ్స్‌లో అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్, కార్మిక శాఖ అధికారులతో కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో పలు కీలక అవకతవకలు బయటపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లలో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య పరికరాలను సరఫరాదారులు అనధికారికంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆసుపత్రి ప్రధాన స్టోర్ నుంచి సరైన ఇండెంట్ ప్రక్రియ లేకుండానే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నేరుగా సరఫరాదారుల నుంచి ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు తేలింది. వాటిని వినియోగించిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్లు జారీ చేసి బిల్లుల చెల్లింపులకు పంపుతున్నట్లు గుర్తించారు. వాస్తవంగా వినియోగించని ఇంప్లాంట్లకు కూడా బిల్లులు సృష్టించే అవకాశం ఉందని ఏసీబీ ప్రాథమిక పరిశీలనలో అనుమానించింది. చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులా.? బిల్లుల ప్రాసెసింగ్‌లో వెలుగుచూసిన అంశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో రోగులు మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడైంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగుల డిశ్చార్జి అనంతరం సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లుల ఎంట్రీలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా.? వైద్య సామగ్రి వినియోగానికి సంబంధించిన రికార్డుల్లోనూ అసాధారణ లెక్కలు బయటపడ్డాయి. ఒక్క రోగికి కేవలం ఒక వారంలోనే 800 సర్జికల్ గ్లౌజులు వినియోగించినట్లు నమోదు కావడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇలాంటి అనుమానాస్పద లెక్కల్లో అధికభాగం ఆరోగ్యశ్రీ రోగులకు సంబంధించినవేనని గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. లైసెన్స్ లేకుండానే క్యాంటీన్.! రోగులకు, వారి సహాయకులకు ఆహారం అందించాల్సిన ప్రధాన క్యాంటీన్‌లోనూ నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. అపరిశుభ్ర వాతావరణంతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండానే క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు క్యాంటీన్ టెండర్లలో పోటీ వ్యతిరేక విధానాలు, బిడ్డర్ల మధ్య కుమ్మక్కు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. టెండర్లు, నియామకాల్లోనూ నిబంధనలకు తిలోదకాలు.! 2019 నుంచి 2025 వరకు మ్యాన్‌పవర్ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్డ్ కేటగిరీకి మార్చే విషయంలోనూ నిబంధనలు పాటించలేదని వెల్లడించింది. ఈ వ్యవహారంలో కుమ్మక్కు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారంటీ ఏమైంది.? నిమ్స్ భద్రతా సిబ్బంది సేవలకు సంబంధించిన టెండర్ల ఖరారులో అసాధారణ జాప్యం జరిగినట్లు, కాంట్రాక్టులను పదేపదే పొడిగించినట్లు అధికారులు గుర్తించారు. డిఫాల్ట్ అయిన ఓ ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారంటీని కూడా స్వాధీనం చేసుకోలేదని ఏసీబీ వెల్లడించింది. మెడికల్ షాపుల్లోనూ అక్రమాల అనుమానాలు.! ఆసుపత్రిలోని మెడికల్ షాపుల నిర్వహణలోనూ నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. తప్పనిసరిగా నిర్వహించాల్సిన విక్రయ రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో పాటు, అర్హతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లేని సిబ్బందిని నియమించుకున్నట్లు గుర్తించారు. మెడికల్ షాపుల కేటాయింపులకు సంబంధించిన టెండర్ ప్రక్రియపైనా అధికారులు దృష్టి సారించారు. ఏసీబీ చేతికి కీలక దస్త్రాలు.. మరింత లోతుగా దర్యాప్తు.! ఈ తనిఖీల సందర్భంగా నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర కీలక దస్త్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగుచూసిన ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించేందుకు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేటాయించే ప్రజాధనం, ఆరోగ్యశ్రీ నిధులు, వైద్య పరికరాల కొనుగోళ్ల చుట్టూ ఇన్ని అవకతవకల ఆరోపణలు వెలుగుచూడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రోగుల ప్రాణాలతో ముడిపడిన వైద్య వ్యవస్థలో ఇలాంటి నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? కోట్లాది రూపాయల లావాదేవీల వెనుక అసలు కథేంటి? ఏసీబీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: వెస్ట్ బెంగాల్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్త పేరు ఇదే.! మీకు నచ్చవచ్చు: 11 రోజులకే రీఎంట్రీ.. మళ్లీ NVIDIA సీఈవోగా జెన్సన్ హువాంగ్.! [ NIMS, ACB Raids, NIMS Corruption, Medical Scams, Healthcare Fraud, Health Aarogyasri, Medical Implants, Surgical Gloves, Hospital Irregularities, Telangana ACB, Hyderabad NIMS, Hospital Billing Scam, Tender Irregularities, Government Hospitals ]  
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు. హారన్లు మోగిస్తూ, ఎదురుగా వచ్చేవారిని బెదిరిస్తూ ఫుట్‌పాత్‌లపై బైకులు నడుపుతున్నారు. ఇలాంటి వారికి ముగ్గురు యువతులు తమదైన శైలిలో గట్టి సమాధానం చెప్పారు. తమ నడకకు అడ్డొచ్చిన బైకర్లకు దారి ఇవ్వకుండా.. పాదచారుల హక్కు కోసం ధైర్యంగా నిలబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో వారి వెనుక నుంచి కొందరు బైకర్లు ఫుట్‌పాత్‌పైకి వచ్చారు. ముందుకు వెళ్లేందుకు పదేపదే హారన్లు మోగించారు. పక్కకు తప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ యువతులు మాత్రం ఏమాత్రం బెదరలేదు. తమ దారిలో తాము నడుస్తూ ముందుకు సాగారు. బైకర్లకు దారి ఇచ్చేందుకు పక్కకు జరగకుండా తమ హక్కును వదులుకోలేదు. నిజానికి ఇది కేవలం ముగ్గురు యువతులకు, కొందరు బైకర్లకు మధ్య జరిగిన చిన్న సంఘటన మాత్రమే కాదు. నగరాల్లో పాదచారులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యకు అద్దం పట్టే ఘటన. ట్రాఫిక్‌లో కొన్ని నిమిషాలు వేచి ఉండలేక ఫుట్‌పాత్‌లపైకి వాహనాలు ఎక్కించే వారి వల్ల వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. నడవాల్సిన దారిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ వీడియో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనర్ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఆయన స్పందిస్తూ ముగ్గురు యువతుల ధైర్యాన్ని ప్రశంసించారు. ఫుట్‌పాత్ అనేది పాదచారుల హక్కు అని, వాహనదారులు తమ ఇష్టానుసారం ఉపయోగించుకునే అడ్డదారి కాదని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఆలస్యాన్ని కూడా భరించలేని అసహనం వల్ల ఇతరుల భద్రతను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా యువతుల తెగువను మెచ్చుకుంటున్నారు. ప్రతిరోజూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా చాలామంది ప్రశ్నించలేక మౌనంగా వెళ్లిపోతుంటారని.. కానీ ఈ ముగ్గురు మాత్రం తమ హక్కు కోసం నిలబడ్డారని ప్రశంసిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడంతో పాటు, పౌరుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించాలని సూచిస్తున్నారు. రోడ్లు వాహనాల కోసం మాత్రమే కాదు.. ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసం కూడా ఉన్నాయన్న చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కొన్ని నిమిషాల సమయం ఆదా చేసుకోవడం కోసం మరొకరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకూడదు. ఆ ముగ్గురు యువతులు చేసింది పెద్ద పోరాటం కాకపోవచ్చు. కానీ వారి చిన్నపాటి ధైర్యం మాత్రం సమాజానికి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది. ఫుట్‌పాత్‌పై నడిచే హక్కు అడుక్కునేది కాదు.. అది పాదచారుల హక్కు! మీకు నచ్చవచ్చు: పశ్చిమ బెంగాల్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్త పేరు ఇదే.! మీకు నచ్చవచ్చు: గోల్డ్ లోన్‌ తీసుకున్న వారికి షాక్..ఎందుకంటే.! [ Footpath viral video, pedestrian rights, Sajjanar tweet, traffic rule violation, bikes on footpath ]
ALSO ON TELUGUONE N E W S
Suriya is reportedly set to collaborate with director Arun Matheswaran, known for his distinct filmmaking style in films like Captain Miller and Rocky. If the reports turn out to be true, the project could bring together an interesting combination of Suriya's screen presence and Arun's gritty storytelling. Anirudh Ravichander is said to be composing the music for the film, adding another exciting element to the rumoured collaboration. The composer has previously delivered several popular albums for Tamil cinema, and his association with Suriya would be keenly watched. Sun Pictures is reportedly being considered as the production house for the project. However, an official confirmation regarding the director, composer or producer is still awaited. Reports suggest that Suriya may announce the film after completing his upcoming project with director TJ Gnanavel. The actor is currently working on the film, and his next lineup has become a topic of discussion among fans. Also Read: King 100: Nagarjuna dismisses postpone rumors Arun Matheswaran's films are known for their intense narratives and distinctive visual treatment. A collaboration with Suriya could see the director working on a larger canvas while retaining his signature style. With Suriya, Arun Matheswaran and Anirudh Ravichander reportedly coming together, the project has already sparked curiosity. An official announcement is expected to clarify the details of this much-discussed combination. Check Out:   Megaverse Promo: Chiru takes over Netflix                        Avengers: Doomsday: Marvel ditches phase 5 films Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nagarjuna Akkineni's 100th film, King 100, is set to release in theatres on December 24. The makers have put an end to speculation about a possible postponement by unveiling a countdown poster, confirming that the film remains on schedule. The poster features Nagarjuna in a black suit against a red backdrop. The actor's look has drawn attention, with the countdown marking the film's arrival in theatres next month. The film's title and glimpse were unveiled on Nagarjuna's birthday, followed by a glimpse introducing Tabu. The two actors are expected to share an intense rivalry in the film, which has become a key point of interest. Also Read: Megaverse Promo: Chiru takes over Netflix Directed by Ra. Karthik, King 100 also features Ashok Selvan in a prominent role. Devi Sri Prasad is composing the music, and his background score in the promotional glimpses has received a positive response. The film's shoot has been completed and it is currently in the final stages of post-production. With the countdown poster, the makers have reaffirmed December 24 as the theatrical release date. King 100 is being produced by the Akkineni family under the Annapurna Studios banner. The film marks Nagarjuna's 100th outing as a lead actor and is scheduled to release on December 24. Check Out:  Family Pack teaser promises comical feast                       Viral: AI video of Mamitha Baiju and Pradeep Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బండ్ల గణేష్‌కి  సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ఈ కేసు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేసిన జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా స్పందించారు. బండ్ల గణేష్, తమ మధ్య ఉన్న వివాదాలన్నీ పరిష్కారమయ్యాయని, ఇక ఎలాంటి ఆర్థికపరమైన, వ్యక్తిగత సమస్యలు లేవని ప్రకటించారు. అంతేకాదు.. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలను కూడా బయటపెట్టారు. మరి ఇంతకీ బండ్ల గణేష్, జెట్టి వెంకటేశ్వరరావు మధ్య ఏం జరిగింది? ప్రకాశం జిల్లా ముప్పాల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు తాజాగా విడుదల చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బండ్ల గణేష్‌తో తమకు గత 15 ఏళ్లుగా మంచి స్నేహం ఉందని గుర్తుచేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి బండ్ల గణేష్ ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. గతంలో తన కుమారుడు, బండ్ల గణేష్ ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. అయితే తన కుమారుడు మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని,ఆ సమయంలో ఏర్పడిన వ్యక్తిగత ఇగో కారణంగానో, మధ్యవర్తుల జోక్యం వల్లనో తమ మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని వెల్లడించారు. ఆ విభేదాలే చివరకు కోర్టు కేసుల వరకు వెళ్లాయని ఆయన వివరించారు. అంటే ఇంతకాలం కొనసాగిన వివాదం వెనుక కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట. నవంబర్ 18న ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూల పేరుతో అనవసర హడావుడి చేశారని జెట్టి వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. తాము వద్దని చెబుతున్నా కొందరు ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చూపించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: భోగి ఫస్ట్ రివ్యూ: ఒక్క సినిమాలో ఇన్ని ట్విస్టులా? బిగ్గెస్ట్ హిట్ అవుతుందా! ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేవని, వ్యక్తిగత విభేదాలు కూడా పూర్తిగా సమసిపోయాయని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవో.. ఇకపై కూడా బండ్ల గణేష్‌తో అలాంటి అనుబంధమే కొనసాగుతుందని తెలిపారు. ఇక ఈ వివాదం వెనుక ఉన్న అసలు విషయానికి వస్తే.. 2018లో బండ్ల గణేష్ జె. జానకిరామయ్య నుంచి రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం జానకిరామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వరరావుకు బండ్ల గణేష్ తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే బ్యాంకులో ఆ చెక్ నగదుగా మారకపోవడంతో జెట్టి వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అప్పీల్‌కు వెళ్లగా, నవంబర్ 18న అప్పీల్ కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించినట్లు వార్తలు వెలువడ్డాయి.  ఇక ఇప్పుడు జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా ముందుకొచ్చి తమ మధ్య అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రకటించడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి పెరిగింది. అయితే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య రాజీ కుదరడం వేరు.. కోర్టులో కొనసాగుతున్న కేసు చట్టపరంగా ముగియడం వేరు. ఈ విషయంలో తదుపరి కోర్టు ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి గత 15 ఏళ్ల స్నేహంలో వచ్చిన చిన్నపాటి మనస్పర్థలు పెద్ద వివాదానికి దారితీయగా.. ఇప్పుడు మళ్లీ ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడినట్లు జెట్టి వెంకటేశ్వరరావు మాటలను బట్టి అర్థమవుతోంది. మరి ఈ పరిణామం తర్వాత బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.   మీకు నచ్చవచ్చు  తెలుగు సినిమాలకి అనిరుధ్ గండం! 100 డేస్ ఆడిన చివరి సినిమా అదే!   [Bandla Ganesh, Cheque Bounce, Jetti Venkateswara Rao, Tollywood]  
మాస్ అమ్మ మొగుడు అనిపించుకోవాలని శర్వానంద్ తాపత్రయ పడుతున్నాడనే విషయం 'భోగి'తో అర్థమైపోతుంది. అభిమానులు, తెలుగు సినిమా ప్రేమికులైతే శర్వానంద్ కోరిక నెరవాలని తమ ఇష్ట దైవాలని ప్రార్థిస్తున్నారు.     తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రివ్యూ షోతో భోగి హెడ్ లైన్స్ లో  నిలిచింది.  ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌లో వచ్చే రెండు ట్విస్టులు ప్రేక్షకులని  ఆశ్చర్యపరిచాయని సమాచారం. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని, దర్శకుడు సంపత్ నంది కథను ఆసక్తికరంగా నడిపించారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను సీట్లకి అతుక్కుపోయేలా చేస్తాయని అంటున్నారు.. కథను ఊహించని మలుపు తిప్పే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే ప్రచారం సైతం  జరుగుతోంది. ఇప్పటివరకు శర్వానంద్‌ను ఎక్కువగా ఫ్యామిలీ, లవ్, ఎంటర్‌టైన్మెంట్ సినిమాల్లో చూసిన ప్రేక్షకులకు 'భోగి'లో ఆయన పాత్ర కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. మరి నిజంగానే ఈ సినిమా ఆయన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందా? అనేది థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను బట్టి తేలనుంది. 1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని 'బొగ్గుల గుట్ట' అనే గ్రామం నేపథ్యంలో  సాగుతుంది. ఇందులో కమ్మరి గంగ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు తన ఐదుగురు చెల్లెళ్లే ప్రపంచంగా భావించే గంగ.. కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే వ్యక్తి. ఇది కూడా చదవండి: తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కలిసి రావట్లేదా? ఇవిగో ప్రూఫ్స్!   అదే గ్రామంలో సులోచన రాణి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనున్నారు. మరోవైపు మందారం పాత్రలో డింపుల్ హయతి తన గ్లామర్‌తో ఆకట్టుకోనున్నారు. గ్రామాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే భూస్వాములు, అమావాస్య పూజల చుట్టూ తిరిగే రహస్య సంఘటనలు కథలో కీలకంగా ఉండనున్నాయి. మూఢనమ్మకాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? గ్రామ ప్రజలను భూస్వాముల చెర నుంచి గంగ ఎలా కాపాడాడు? అతని జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. 'భోగి' కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలోని కొన్ని హింసాత్మక సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే కథ క్యారక్టర్ ల స్వభావం దృష్ట్యా వాటిలో మార్పులు చేయడానికి చిత్రబృందం అంగీకరించలేదని సమాచారం. ఇక సినిమా రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలు. అంటే 154 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించాడు . భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్. నవంబర్ 27 అంటే ఈ శుక్రవారం రిలీజ్ డేట్.   మీకు నచ్చవచ్చు ధనుష్ ఓం కి నిరాశ తప్పదా! డింపుల్ హయాతి పెళ్లి!     [Bhogi, Sharwanand , Anupama Parameswaran, Dimple Hayathi, Sampath Nandi]     Bhogi Movie First Review
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 7, 2027 విడుదల తేదీకి సినిమా రావడం లేదని, ఆగస్టుకు వాయిదా పడిందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలంటే విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో తన మేకింగ్ సత్తా చాటిన ఆయన.. ఈసారి మహేష్ బాబుతో అంతకుమించిన స్థాయిలో సినిమా తెరకెక్కిస్తున్నారు. అందుకే ‘వారణాసి’లోని భారీ విజువల్స్, గ్రాఫిక్స్ పనులకు మరింత సమయం అవసరమవుతోందని, ఈ కారణంగానే విడుదల తేదీని మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం మూడు తేదీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. జులై 29, ఆగస్టు 5, ఆగస్టు 12 తేదీలను ట్రేడ్ వర్గాలతో చర్చించారట. అయితే జులై చివరి వారంతో పోలిస్తే ఆగస్టులో విడుదల చేయడమే మంచిదని చిత్ర బృందంలోని పలువురు అభిప్రాయపడినట్లు వినికిడి. దీంతో ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్ 7, 2027 అనేది మంచి రిలీజ్ డేట్. ఆ రోజు ఉగాది కావడం, ఆ తర్వాతి వారంలో శ్రీరామనవమి రావడంతో పండుగ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఆ తేదీని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆగస్టుకు మారితే ఆ పండుగ సీజన్‌ను వదులుకోవాల్సి వస్తుంది. అయితే గ్రాఫిక్స్ పనుల్లో రాజీ పడకుండా, సినిమాను మరింత క్వాలిటీగా సిద్ధం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.! ‘వారణాసి’లో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.  అయితే ఈ వాయిదా వార్తపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంటారు. మరి ఈసారి కూడా ఏదైనా భారీ అప్‌డేట్‌తో విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.  మీకు నచ్చవచ్చు: టికెట్ ధరలు 80 శాతం తగ్గింపు.. 99కే ‘రామాయణ’ సినిమా చూసే ఛాన్స్.! కిరణ్ అబ్బవరం రికార్డ్.. కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇన్ని మిస్టరీలా.?       [Varanasi Postponed, August 2027, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra]  
కొన్ని సినిమా న్యూస్ అంతే ఒక పట్టాన అర్ధం కావు.  కానీ న్యూస్ మొత్తం చదివి మెదడు, మైండ్ స్థిమితం అయ్యాక మనం చదివిన న్యూస్ నిజమే కదా అని వాస్తవ అవగాహనకి వచ్చి పది మందికి ఆ న్యూస్ గొప్పతనం చెప్పి మురిసిపోతుంటాం. అలాంటి ఒక న్యూస్ మ్యూజిక్ సంచలనం అనిరుద్. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అంటేనే మాస్ బీట్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తుకొస్తాయి. ఆయన మ్యూజిక్‌కు థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'జైలర్', 'విక్రమ్', 'జవాన్' వంటి సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. దీంతో మన టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు సైతం అనిరుధ్‌తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తెలుగు సినిమాల విషయానికి వస్తే మాత్రం ఆయన మ్యూజిక్ ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతోందా? తాజాగా నాని 'ది ప్యారడైజ్' సినిమాతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అనిరుధ్ కెరీర్‌ను పరిశీలిస్తే తమిళంలో ఆయనకు తిరుగులేని క్రేజ్ ఉంది. 'వై దిస్ కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత వరుస విజయవంతమైన ఆల్బమ్స్‌తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. తెలుగులో పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' తో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్', విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్', ఎన్టీఆర్ 'దేవర' వంటి సినిమాలకు సంగీతం అందించారు. అయితే ఈ సినిమాల్లో కొన్ని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ.. అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలని అందుకోలేదు. దీంతో అనిరుధ్‌కు తమిళంలో ఉన్నంత స్థాయిలో తెలుగులో సక్సెస్ రేట్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'ది ప్యారడైజ్'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా విడుదలైన గ్లింప్స్‌లో అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమా విడుదలయ్యే సమయానికి మ్యూజిక్‌పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇది కూడా చదవండి: మరోసారి ధనుష్ 'ఓం'కి తమిళనాట నిరాశేనా: కలెక్షన్లలోభారీ తేడా!   అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం పరిస్థితి మరోలా మారింది. కొన్ని కీలక సన్నివేశాల్లో అనిరుధ్ తన మార్క్ చూపించినప్పటికీ, ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆశించిన స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదనే విమర్శలు వినిపించాయి. సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలని , యాక్షన్ ఎపిసోడ్స్‌ని  తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లడంలో అనిరుధ్ పూర్తిగా సక్సెస్ కాలేదనే అభిప్రాయాలు వచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 'ది ప్యారడైజ్' సినిమాలోని పాటలకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా 'ఆయా షేర్', 'యేష నాగుల' వంటి పాటలు ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యాయి. విడుదలైన తర్వాత కూడా ఈ పాటలు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి.  కానీ సినిమాలోని సన్నివేశాలకు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడంలో మాత్రం కొన్ని చోట్ల నిరాశపరిచారనే చర్చ జరుగుతోంది. పాటలు విడిగా వినడానికి బాగుండటం వేరు.. సినిమాలో వాటి ప్రభావం ప్రేక్షకుడిపై పడటం వేరు. ఈ రెండింటి మధ్య తేడా 'ది ప్యారడైజ్' విషయంలో స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ అయిందో తెలిసిందే. చాలా సన్నివేశాలు ఆయన సంగీతం వల్ల మరింత ఎలివేట్ అయ్యాయి. అలాగే 'విక్రమ్', 'దేవర' వంటి చిత్రాల్లోనూ తనదైన మ్యూజిక్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటిది 'ది ప్యారడైజ్' విషయంలో మాత్రం అదే స్థాయి ప్రభావం ఎందుకు కనిపించలేదు? దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా సంగీతం అందించలేకపోయారా? లేక సినిమాకు సంబంధించిన ఎడిటింగ్, సన్నివేశాల కూర్పు వల్ల బీజీఎం ప్రభావం తగ్గిందా? అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. మొత్తానికి అనిరుధ్ టాలెంట్‌పై ఎలాంటి సందేహం లేదు. కానీ తెలుగు సినిమాల్లో ఆయన అందిస్తున్న సంగీతం ప్రతిసారి అంచనాలను అందుకుంటోందా? అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి మన తెలుగు దర్శకులు ఇకపై కూడా అనిరుధ్‌కే ప్రాధాన్యత ఇస్తారా? లేక మన సంగీత దర్శకులకు పెద్దపీట వేస్తారా? చూడాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం మొత్తం సోషల్ మీడియా వేదికగా తెలుగు సినిమా అభిమానులు, నెటిజన్స్ వినిపిస్తున్న మాటలే..     మీకు నచ్చవచ్చు: మీ కోసం కాకా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చేస్తున్నాడు: ఫ్యాన్స్ గెట్ రెడీ!                                ధనుష్ ఓం అసలు కలెక్షన్స్ బయటకొచ్చాయి!    [Anirudh Ravichander, The paradise, jailer, Nani, Tollywood]
సినిమాల్లో నటీనటుల మధ్య కెమిస్ట్రీని చూసి అభిమానులు మురిసిపోతుంటారు. కానీ అదే సినిమా సన్నివేశాలను కొందరు దుర్వినియోగం చేస్తే? ఇప్పుడు అలాంటి ఘటనే మలయాళ నటి మమితా బైజు, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ విషయంలో చర్చకు వచ్చింది.  వీరిద్దరూ కలిసి నటించిన డ్యూడ్ సినిమా ఫుటేజ్‌ను ఉపయోగించి అసభ్యకరమైన AI వీడియో రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2025లో విడుదలైన తమిళ చిత్రం 'డ్యూడ్'లో మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అదే సినిమాలోని కొన్ని సీన్స్ ఆధారంగా చేసుకుని, AI సాయంతో అసభ్యకరమైన వీడియోను సృష్టించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నటీనటుల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా టెక్నాలజీని ఉపయోగించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వీడియోలను డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం కాకుండా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు రిపోర్ట్ చేయాలని పలువురు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.! AI టెక్నాలజీతో నిజంగా జరిగినట్టుగా కనిపించే ఫేక్ వీడియోలను సృష్టించడం ఇప్పుడు చాలా సులభమవుతోంది. అయితే ఈ సాంకేతికతను సృజనాత్మక పనుల కోసం ఉపయోగించాల్సింది పోయి, ఇతరుల ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా మార్చి అసభ్యకరమైన కంటెంట్ తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు ఇలాంటి డీప్‌ఫేక్‌ల బారిన పడిన సందర్భాలున్నాయి. మీకు నచ్చవచ్చు:  శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.! విజయ్ స్థానంలో త్రిష.. TVKలో అసలు ఏం జరుగుతోంది.?       [Mamitha Baiju, Pradeep Ranganathan, Dude Movie, Viral AI Video, Deepfake]  
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'కాకా'. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇప్పుడు మేకర్స్ మరో క్రేజీ అప్డేట్‌కు సిద్ధమవుతున్నారట. ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ పాట ఎప్పుడు రాబోతోంది? అభిమానులకి  ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూద్దాం.   'కాకా' సినిమా నుంచి వచ్చే మొదటి పాటను డిసెంబర్‌ చివరిలో అమెరికాలో విడుదల చేయాలని మేకర్స్ గతంలోనే ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సాంగ్ రిలీజ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ మొదటి వారాంతంలోనే ఫస్ట్ సింగిల్‌  విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పాట విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఆ ఫస్ట్ సింగల్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ప్రాక్టీస్ లో ఉన్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తుండగా 'గాడ్ ఫాదర్' తర్వాత చిరంజీవితో థమన్ చేస్తున్న మరో పూర్తి స్థాయి సినిమా కావడంతో సంగీతంపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ సినిమా అంటే పాటలు, డ్యాన్సులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈసారి థమన్ ఎలాంటి బీట్‌తో మెగాస్టార్‌ను చూపించబోతున్నారు? ఫస్ట్ సింగిల్ మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుందా? లేక మెలోడీతో ఆకట్టుకుంటుందా? అన్నది చూడాలి. పాట విడుదలైతే సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.   ఇది కూడా చదవండి:100 డేస్ ఆడిన చివరి సినిమా అదే: కౌంట్‌లెస్ డబ్బులు వచ్చాయంట.. పోసాని మళ్ళీ వచ్చేసాడు! చిరంజీవిని దర్శకుడు బాబీ సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల అనుబంధానికి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇందులో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె క్యారక్టర్ కి కథలో మంచి ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో ఆయనను కె. సత్యం అనే మధ్యతరగతి వ్యక్తిగా పరిచయం చేశారు. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసే పాత్రలో మెగాస్టార్ కనిపించారు. అయితే ఆ గ్లింప్స్ చివర్లో వచ్చిన ట్విస్ట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. కాకా 2027 జనవరి 13న సంక్రాంతి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.   మీకు నచ్చవచ్చు: డింపుల్‌ హయాతి పెళ్లి                                ఆ హీరో సినిమాపై పోసాని వ్యాఖ్యలు వైరల్: చివరి 100 డేస్ అదేనంట!    [Kaaka, Chiranjeevi, Anaswara Rajan, Tollywood, Bobby]
రచయితగా, నటుడుగా, దర్శకుడిగా పోసాని కృష్ణ మురళి  తెలుగు ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అక్షర దోషం లేదు. కాకపోతే గత కొంత కాలంగా ఇండస్ట్రీలో తన చరిత్రకి గతమెంత ఘనంగా మారింది. అంటే నో సినిమాస్, ఏదో అడపా దడపా కనిపిస్తూ ఉన్నా ఆ చిత్రాలన్నీ ఉదయాన్నే థియేటర్స్ లో కనిపిస్తున్నాయి కానీ సాయంత్రానికి ఏమై పోతున్నాయో తెలియని పరిస్థితి.  రీసెంట్ గా పోసాని ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు శ్రావణమాసం ఫ్లాప్ అయిన తర్వాత, ఒక ప్రముఖ దర్శకుడు పోసాని ఇంటికి వచ్చి, ఆయనకు సినిమాలు తీయడం ఎందుకు, డబ్బులన్నీ పోయాయని, ఇక ఖర్చులకు ఏం చేస్తారని అన్నారని పోసాని గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు తనను బాధించినప్పటికీ, వాటిని ఒక సవాల్‌గా స్వీకరించానని, సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి శూన్యంగా మారడని పోసాని గట్టిగా విశ్వసించారు. మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడు కూడా అనేక ఫ్లాపులను చవిచూశారని, అయినా ఆయన ఇప్పటికీ ఒక లెజెండరీ డైరెక్టర్ గానే కొనసాగుతున్నారని, కమల్ హాసన్ సినిమాలు కొన్నిసార్లు సబ్జెక్ట్ లోపాల వల్ల ఫ్లాప్ అవుతాయి తప్ప, ఆయన ప్రతిభకు లోపం కాదని అభిప్రాయపడ్డారు. రామ్ గోపాల్ వర్మ భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. టెక్నిక్ పట్ల ఆయనకు ఉన్న పట్టు, షార్ప్‌నెస్, క్రియేటివిటీ మరెవరికీ లేవని ప్రశంసించారు. తాను రెండేళ్లు ఆయనతో కలిసి ప్రయాణించినందున ఆయన ప్రతిభను దగ్గరగా చూశానని, రామ్ గోపాల్ వర్మ ఒక జీనియస్ అని అన్నారు. శ్రావణమాసం ఫ్లాప్ తర్వాత, తాను తన ఫైనాన్షియర్‌కు ఒక ఆస్తిని అమ్మి డబ్బులు తిరిగి ఇచ్చేశానని పోసాని తెలిపారు. ఆ తర్వాత, మళ్లీ సినిమా తీసేందుకు అదే ఫైనాన్షియర్ వద్దకు వెళ్లగా, వారు ఎటువంటి సంకోచం లేకుండా మీకు కావాల్సినంత తీసుకోండి మురళి గారు. మీకు సినిమా ఫ్లాప్, హిట్ మాకేమీ లేదు, అంతకుముందు క్లియర్‌గా కట్టారు కదా అని చెప్పి ఆర్థిక సహాయం అందించారని పోసాని గుర్తు చేసుకున్నారు. అది వారి నమ్మకానికి, పోసాని నిజాయితీకి నిదర్శనం. ఇది కూడా చదవండి: డింపుల్‌ హయాతి పెళ్లి: పెళ్లి కొడుకు ఇతనే.. ఇప్పుడు క్లియర్ గా అందరకి అర్థమైంది! ఆ తర్వాత పోసాని తన సొంత కథతో ఆపరేషన్ దుర్యోధనను రూపొందించారు. ఫైనాన్షియర్ కథ విన్న తర్వాత ఇది మీరే చెప్పాలి, మీరే చేయాలనుందా, నేను చేసుకోవచ్చా అని అడిగినట్లు, కథలోని దమ్ము ఆయనకు అర్థమైందని పోసాని వివరించారు. అలా ప్రారంభమైన ఆపరేషన్ దుర్యోధన అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్ అయిందో, కౌంట్‌లెస్ డబ్బులు వచ్చాయని పోసాని అన్నారు.  తెలుగు సినీ చరిత్రలో ఒక రికార్డును సృష్టించింది. అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడిన చివరి తెలుగు చిత్రంగా ఆపరేషన్ దుర్యోధన నిలిచిందని పోసాని సగర్వంగా ప్రకటించారు. ఆ తర్వాత వంద రోజులు ఆడిన సినిమాలు ఏవీ లేవని, ఆ ట్రెండ్ కూడా లేకుండా పోయిందని తెలిపారు. తనను విమర్శించిన వారందరికీ ఈ విజయం సమాధానం చెప్పిందని, ఒక ఫ్లాప్ సినిమాతో ఎవరినీ తీసిపారేయకూడదని ఈ సంఘటన రుజువు చేసిందని పోసాని కృష్ణమురళి వివరించారు.  మీకు నచ్చవచ్చు: బాస్ టీజర్ వచ్చేసింది: ఫ్యాన్స్ లో పూనకాలు!                                ఆ డైరెక్టర్ తో అడివి శేష్: హీరోయిన్ ఎవరో తెలుసా!     [Posani Krishna Murali,operation Duryodhana, Tollywood, Ram gopal varma]                                    
సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తరఫున తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల నుంచి విజయం సాధించిన విజయ్.. నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకున్నారు. ఫలితంగా అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఖాళీ అయిన ఈ స్థానంలో టీవీకే తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఆమెను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయించాలని అభిమానులు, టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కొందరు త్రిష అభిమానులు 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' పేరుతో కొత్త సంస్థను ప్రారంభించడం కూడా ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. గతంలో తన పేరుతో రాజకీయ ప్రచారం జరిగినప్పుడు వెంటనే స్పందించే త్రిష.. ఈసారి మాత్రం మౌనంగా ఉండటం చర్చకు కారణమవుతోంది. మరోవైపు, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి త్రిష పేరును పార్టీలోని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ సలహాదారులు ఆమెను నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడం కంటే రాజ్యసభకు పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: బిగ్ సర్‌ప్రైజ్‌.. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు మూవీ.! తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం టీవీకేకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో త్రిష వంటి పాపులర్ సినీ తారను బరిలోకి దింపితే పార్టీకి ప్రచారపరంగా ప్రయోజనం ఉంటుందని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  మరి ఈ ప్రచారాలన్నీ నిజమవుతాయా? త్రిష నిజంగానే విజయ్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక ఆమె పేరు రాజకీయ చర్చలకే పరిమితం అవుతుందా? దీనిపై టీవీకే అధిష్ఠానం నుంచి వచ్చే అధికారిక ప్రకటనే స్పష్టత ఇవ్వనుంది. మీకు నచ్చవచ్చు: శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.! టికెట్ ధరలు 80 శాతం తగ్గింపు.. 99కే రామాయణ సినిమా చూసే ఛాన్స్.!       [Trisha Politics, TVK Candidate, Tiruchirappalli East, By Election, CM Vijay]  
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
శీతాకాలం మొదలవగానే ఉదయాన్నే చల్లగాలి వణుకు పుట్టిస్తుంది, ఆ వెంటనే జలుబు, దగ్గు, నీరసం, మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. చలి వాతావరణంలో శరీరానికి లోపలి నుంచి వెచ్చదనం, స్థిరమైన శక్తి మరియు బలం అవసరమవుతాయి. అలాంటి కాలానికి మన సంప్రదాయ వంటకాలలో గోందు లడ్డూ ఒక అద్భుతమైన బలవర్ధక ఆహారంగా నిలుస్తుంది. ఇందులో ఉపయోగించే గోందు ప్రత్యేకమైన చెట్ల నుంచి లభించే సహజ జిగురు కాగా, ఆయుర్వేదంలో దీనిని శతాబ్దాలుగా ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో చలవ కోసం వాడే గోందు కతీరాకు భిన్నంగా, సాధారణ గోందు శీతాకాలంలో శరీరానికి వేడిని, బలాన్ని అందించడానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ గోందు లడ్డూల తయారీలో ప్రతి కొలత, ప్రతి దశ కూడా రుచి మరియు ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. ముందుగా 1 కప్పు గోధుమపిండిలో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా చల్లుతూ పిండి ముద్ద కాకుండా 15 నిమిషాలు నానబెట్టి, ఆపై జల్లెడ పడితే అది చక్కటి రవ్వలా మారుతుంది. తర్వాత కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి పావు కప్పు గోందును తక్కువ మంటపై వేయించాలి; అది వడియాల్లా ఉబ్బి తెల్లగా మారేవరకు లోపలి వరకు వేయించడం చాలా అవసరం, లేదంటే తినేటప్పుడు పళ్లకు జిగురుగా అంటుకుంటుంది. అదే కడాయిలో కొద్దిగా నెయ్యితో జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు, పుచ్చగింజలు, బాదం పలుకులు, అలాగే అర చిప్ప తురిమిన ఎండుకొబ్బరిని కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక గోధుమపిండి రవ్వను మరొక 1 స్పూన్ నెయ్యిలో లో ఫ్లేమ్ మీద రంగు మారి సువాసన వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి. వేయించిన గోందును చేతితో మెత్తగా క్రష్ చేసి, దానికి అర స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండుకొబ్బరి, గోధుమపిండి మిశ్రమాన్ని కలపాలి. మరోవైపు ముప్పావు కప్పు బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి తక్కువ మంటపై తీగపాకం వచ్చేవరకు కరిగించి, ఆ పాకాన్ని మిశ్రమంలో వడకట్టి వేయాలి. వేడిగా ఉన్నప్పుడే గరిటెతో కలిపి, తర్వాత చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టాలి. ఇలా తయారు చేసిన గోందు లడ్డూలను ఫ్రిజ్‌లో పెట్టకుండానే 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పోషకాల పరంగా చూస్తే, సుమారు 30 గ్రాముల నుంచి 35 గ్రాముల బరువున్న ఒక గోందు లడ్డూ దాదాపు 160 నుంచి 180 క్యాలరీల శక్తిని అందిస్తుంది (సైజు మరియు నెయ్యి, బెల్లం మోతాదును బట్టి 60 గ్రాముల లడ్డూలో 287 క్యాలరీల వరకు ఉండవచ్చు). గోధుమపిండి మరియు బెల్లం నుంచి కార్బోహైడ్రేట్లు, నెయ్యి మరియు బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఖనిజాలు లభిస్తాయి. చలికాలంలో రోజుకు కేవలం 1 గోందు లడ్డూ తీసుకోవడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా, ఎముకలు మరియు కీళ్ల దృఢత్వానికి తోడ్పడుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఒక్క కివీ లేదా ఉడికించిన టమాటో: కణాల ఆరోగ్యంపై డాక్టర్ సూచనలు ఈ లడ్డూలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలకు నడుము మరియు ఎముకలు గట్టిపడటానికి, శరీరం త్వరగా కోలుకోవడానికి సంప్రదాయకంగా వీటిని తినిపిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, శీతాకాలపు నీరసాన్ని తగ్గించడంలోనూ ఇవి మంచి తోడ్పాటు అందిస్తాయి. అయితే ఇందులో నెయ్యి, బెల్లం, గోధుమపిండి ఉండటం వల్ల క్యాలరీలు మరియు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి; కాబట్టి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా బరువు నియంత్రణలో ఉన్నవారు మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. మొత్తానికి, సరైన మోతాదులో తీసుకుంటే గోందు లడ్డూ శీతాకాలంలో రుచిని, ఆరోగ్యాన్ని కలబోసే విలువైన సంప్రదాయ ఆహారం. బయట దొరికే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ లడ్డూను రోజుకు 1 చొప్పున 10 రోజుల పాటు నిల్వ ఉండేలా సిద్ధం చేసుకుంటే చలికాలపు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సహజ పదార్థాల మేళవింపుతో రూపొందే ఈ లడ్డూ మన జీవనశైలిలో భాగమైతే శరీరానికి బలం, మనసుకు తృప్తి రెండూ దక్కుతాయి. మీకు నచ్చవచ్చు:పిల్లల స్నాక్ బాక్స్ కోసం, క్విక్ అటుకుల మిక్చర్.. నెల రోజులు నిల్వ                                  వేడి అన్నంలో నెయ్యి, చిక్కుడుకాయ కూర.. బాల్యపు రుచి మళ్లీ!       Winter Gond Laddu, Gond Laddu Benefits, Strong Bones In Winter, Immunity Boosting Laddu, Edible Gum Laddu, Winter Wellness Tips, Health Tips In Telugu.  
మునగాకు (Moringa Leaves) అంటే కేవలం ఒక ఆకు కూర మాత్రమే కాదు.. ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారం. మన రోజువారీ ఆహారంలో మునగాకును చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి. ముఖ్యంగా మునగాకు పొడితో తయారుచేసే మునగాకు లడ్డూలు ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి ఉన్నవారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. మరి మునగాకు లడ్డూల ప్రత్యేకత ఏమిటి? వీటిని తినడం వల్ల ఎలాంటి పోషక ప్రయోజనాలు లభిస్తాయి? మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు మునగాకులో లభిస్తాయి. అందుకే మునగాకును పోషకాల గనిగా పిలుస్తారు. మునగాకును నేరుగా కూరగా తీసుకోవడమే కాకుండా, ఎండబెట్టి పొడిగా తయారుచేసి కూడా ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. మునగాకు పొడితో తయారుచేసే లడ్డూలు ఎలా ఉంటాయి? వీటిని తయారుచేయడానికి ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు? మునగాకు పొడిని లడ్డూల రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రత్యేకత ఏమిటి? రోజువారీ ఆహారంలో మునగాకు పొడిని ఎలా చేర్చుకోవాలి? రోజుకు ఎన్ని మునగాకు లడ్డూలు తీసుకోవచ్చు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో Green Alchemy Founder అరుణ గారు మునగాకు పొడి తయారీ విధానం, దాని పోషకవిలువలు, మునగాకు లడ్డూల తయారీ ప్రత్యేకతలు, వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మునగాకు లడ్డూల్లో ఉపయోగించే పదార్థాలు, వాటి పోషక ప్రాధాన్యత, రోజూ రెండు లడ్డూలు తినడం వెనుక ఉన్న ఆలోచన వంటి విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మునగాకు, మునగాకు పొడి, మునగాకు లడ్డూల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి. గమనిక: మునగాకు పోషకాలు కలిగిన ఆహారమే అయినప్పటికీ, మునగాకు లడ్డూలు తీసుకోవడం వల్ల నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.  వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. మరిన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, పోషకాహార విశేషాలు, సహజ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాల కోసం తెలుగు వన్ హెల్త్ (TeluguOne Health)ను అనుసరించండి.
ఈ ఒక్క పోషకం లోపిస్తే నిద్ర, గుండె ఆరోగ్యం, కండరాల బలహీనత.. ఇలా ఎన్ని సమస్యలో తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచీ ఏదో తెలియని అలసట, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అప్పుడప్పుడు కండరాలు పట్టేయడం లేదా బలహీనంగా అనిపించడం.. వీటిని మనం చాలామంది రోజువారీ ఒత్తిడి లేదా పని భారం వల్ల వచ్చిన సాధారణ విషయాలుగా కొట్టిపారేస్తాం. కానీ వీటన్నింటి వెనుక మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం లోపం ఉండొచ్చు. అదే మెగ్నీషియం. మన ఆరోగ్యానికి విటమిన్లు ఎంత అవసరమో, ఖనిజాలు కూడా అంతే అవసరం. వాటిలో మెగ్నీషియం పాత్ర ఎంతో కీలకమైనది. శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలు, గుండె సరిగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. మన శరీరంలో శక్తి తయారవ్వాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలన్నా, రక్తపోటు సమతుల్యంగా ఉండాలన్నా మెగ్నీషియం ఎంతో అవసరం. సాధారణంగా పెద్దవారికి రోజుకు సుమారు 310 నుంచి 420 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం అవసరం అవుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇంత తక్కువ మోతాదులో అవసరమయ్యే ఈ పోషకం శరీరానికి సరిపడా అందకపోతే, చాలామందిలో మెల్లమెల్లగా లోపం తలెత్తుతుంది. మెగ్నీషియం లోపం ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి. కండరాలు బిగుసుకుపోవడం, పట్టేయడం, కొందరిలో వణుకు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శరీరంలో నీరసం, బలహీనత, అలసట ఎక్కువగా అనిపించడం కూడా దీని వల్ల జరగవచ్చు. కండరాలు సాధారణంగా పనిచేయడానికి, వాటికి విశ్రాంతి కలగడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. అందుకే దీని లోపం ఉన్నప్పుడు కండరాలకు సంబంధించిన సమస్యలు త్వరగా బయటపడతాయి. నరాల పనితీరు సక్రమంగా సాగడానికి, శరీరంలో శక్తి ఉత్పత్తి జరగడానికి కూడా మెగ్నీషియం అవసరం. ఇది తగ్గిపోయినప్పుడు కొందరిలో మనసు ప్రశాంతంగా లేకపోవడం, చిరాకు, చికాకు కలగడం వంటివి కనిపిస్తాయి. దీని ప్రభావం నిద్ర మీద కూడా పడుతుంది. రాత్రి పూట సుఖంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో అంతరాయాలు కలగడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కూడా చదవండి  బూడిద గుమ్మడి రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.! గుండె ఆరోగ్యంపై మెగ్నీషియం లోపం తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఉండటానికి, రక్తపోటు అదుపులో ఉండటానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉన్నవారిలో గుండె స్పందనల్లో తేడాలు రావడం, రక్తపోటుపై ప్రభావం పడటం, అలాగే శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి.. రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఇంట్లో దొరికే అనేక ఆహార పదార్థాల్లో మెగ్నీషియం బాగానే ఉంటుంది. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం అందుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ లోపం చాలా ఎక్కువగా ఉంటే, వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మొత్తానికి చిన్నదిగా కనిపించే ఈ ఖనిజం మన శరీరంలోని ఎన్నో ముఖ్యమైన పనులను నియంత్రిస్తుంది. అలసట, కండరాల నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనిపిస్తే లేదా దీర్ఘకాలంగా వేధిస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                                                                                                                                *రూపశ్రీ. మీకు నచ్చవచ్చు  మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్టేనట..!                                 కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవిగా కనిపించినప్పటికీ ఎన్నో పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids), డైటరీ ఫైబర్ (Dietary Fiber), ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కీళ్ల ఆరోగ్యం, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థకు అవిసె గింజలు ఎలాంటి మేలు చేస్తాయి? వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నవారికి అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగపడతాయి? శరీరంలో వాపు (Inflammation) తగ్గించడంలో వీటికి ఉన్న పాత్ర ఏమిటి? వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుకోవడానికి అవిసె గింజలు ఎలా తోడ్పడతాయి? వీటిలోని పోషకాలు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం. అంతేకాకుండా అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? కొలెస్ట్రాల్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి అవిసె గింజలు ఎలా సహాయపడతాయి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో వివరించారు. అయితే అవిసె గింజలను పచ్చిగా తినాలా? వేయించి తీసుకోవాలా? పొడి చేసుకుని తీసుకోవడం మంచిదా? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు అవిసె గింజలను తీసుకోవచ్చా? థైరాయిడ్ మందులు వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అందరూ వీటిని తీసుకోవచ్చా? ఎవరు ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి? అనే సందేహాలకు కూడా సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మగారు అవిసె గింజల్లోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు, తీసుకునే సరైన పద్ధతి, తగిన మోతాదు, తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేశారు. మరి గుప్పెడు అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి? కీళ్ల ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు వరకు వీటి ప్రయోజనాలు ఏమిటి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.