అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు.
ఉన్నావ్ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మైనర్ బాలికపై అత్యా.చార కేసులో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా తేలారు. 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. అయితే, ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన భార్య బీజేపీ తరపున పోటీచేయబోతున్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య సంగీత సెంగార్‌కు యూపీ పంచాయితీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ టికెట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. 2016లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు.
రే-ప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి భార్యకు టికెట్ ఇవ్వడాన్ని కమలనాథులు నిసిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ‘‘కుల్‌దీప్ సింగ్ తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఆయన జైల్లో ఉన్నారు. కుల్దీప్ చేసిన నేరాలకు అతడి భార్యను శిక్షించకూడదు. సుదీర్ఘ చర్చల అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చాం. ఇప్పటికే ఆమె ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలి తప్ప.. నేరస్తుడి భార్య కాబట్టి పట్టించుకోకుండా వదిలేయకూడదు.’’ అంటున్నారు. తప్పు చేసినా పర్వాలేదు.. గెలిచే సత్తా ఉంటే చాలు అన్నట్టుగా బీజేపీ తీరు ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/unnao-rap*-mla-wife-contesting-in-up-panchayat-elections-from-bjp-36-113446.html
ఒకే రోజు మూడు వేరువేరు ఘటనల్లో ఇద్దరు మరణించగా, ఓ మహిళలకు ఘోర అవమానం జరిగింది. ఓ వితంతువుపై గ్యాంగ్, ఓ జర్నలిస్టు, ఓ వ్యాపారి హత్య జరిగాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. సోనియా గాంధీ నాయకత్వంలో, పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది.
సంఘటనా స్థలానికి కిలో మీటర్ దూరంలో నివాసం ఉండే ప్రజలకు ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలించారు. స్కూళ్లలో పిల్లలు భోజనాలు చేస్తుండగా.. వారిని మధ్యలోనే లేపేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేందుకు ఘటనా స్థలానికి సమీపంలో నివాసం ఉండే ప్రజలందరినీ కేవలం ఐదంటే ఐదు నిముషాల వ్యవధిలో కట్టుబట్టలతో ఖాళీ చేయించి లక్కవరం పునరావాస కేంద్రానికి చేర్చారు.
ఈ విషయంలో భారత్ మాత్రం ఆచితూచి స్పందించింది. అమెరికా చర్యను నేరుగా ఖండించలేదు. మొక్కుబడి తంతు అన్నట్లు వెనిజువేలా ప్రజల సంక్షేమమే ముఖ్యమని, అన్ని పక్షాలూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనీ సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
వెనిజువేలా రాజథాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని మదురో కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు.
తాను అత్యంత గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిననీ, దేశాధ్యక్షుడిననీ పేర్కొన్న మదురో అమెరికా మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు.
మల్లోజుల, చంద్రన్న వంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాతే పార్టీ పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో పూర్తిగా అర్థమైందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దాడులు చేపట్టడంతో పాటు, పలు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఎదురైన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు పార్టీ కేడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు.
పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ లు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే కులాలు వేరు అన్న కారణంతో ప్రణయ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన లావణ్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.
ఇటీవల కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్.
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
నదీజలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు