రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలుస్తున్నా : సీఎం రేవంత్
Publish Date:Jan 16, 2026
Advertisement
ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాకా-కొరాటా పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ “ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమాని పేర్కొన్నారు. జల్ జంగల్ జమీన్ అని నినదించిన పోరాటాల గడ్డ ఇది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని సీఎం రేవంత్ అన్నారు. అందుకే పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తానని చెప్పాని సీఎం వెల్లడించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా అభివృద్ధి పథంలో సాగేదని అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్టుల పూర్తి కోసం కృషి చేస్తున్నామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. చనాక- కొరటాకు సీ. రామచంద్రా రెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని రేవంత్ తెలిపారు. ప్రజలకు సేవలందించిన ఆ ఇద్దరి పేర్లు రెండు ప్రాజెక్టులకు పెట్టాలని అధికారులకు సూచన చేస్తున్నాని తెలిపారు. తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామని, అక్కడే ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం తీసుకొచ్చే పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం వేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసినట్లే ఆదిలాబాద్‌కూ ఇస్తామని కేంద్రం చెప్పిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అడిగితేనే అభివృద్ధి వస్తుందని, గత పాలకులు అడగకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వారి పాలన వల్ల అప్పులు మిగిలాయని, నాడు ఇచ్చిన బియ్యం ఎవరు తిన్నారో తెలియదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం ప్రజలు తింటున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసేవారిని, అభివృద్ధి చేసే వారినే గెలిపించుకోండని రేవంత్ స్పష్టం చేశారు
http://www.teluguone.com/news/content/chanakakorata-pumphouse-36-212611.html





