బ్రహ్మపుత్ర నదిలో అండర్ వాటర్ ట్విన్ టన్నెల్ !

Publish Date:Feb 15, 2026

Advertisement

అస్సాం గడ్డపై రవాణా విభాగానికి సంబంధించి  ఇంజినీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈశాన్య భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో   దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే రెండోదైన రోడ్డు, రైలు అండర్ వాటర్ ట్విన్ టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తాజాగా పచ్చజెండా ఊపింది. గోహ్‌పూర్-నుమాలిగఢ్ మధ్య నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కోసం    18,662 కోట్ల రూపాయలు కేటాయించారు.

ప్రస్తుతం నేషనల్ హైవే-715 మీదున్న నుమాలిగఢ్ నుంచి హైవే-15 పైనున్న గోహ్‌పూర్‌కు చేరుకోవాలంటే సుమారు 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కాజీరంగ నేషనల్ పార్క్, బిశ్వనాథ్ పట్టణం మీదుగా సాగే ఈ ప్రయాణానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. అయితే బ్రహ్మపుత్ర నది కింద నిర్మించే ఈ నూతన సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే.. ఈ దూరం భారీగా తగ్గడంతో పాటు  ప్రయాణ సమయం కూడా కేవలం 20 నిమిషాలకు కుదించబడుతుంది. ఇది అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుంది.

ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సౌకర్యం కోసం మాత్రమే కాకుండా.. రక్షణ పరంగా కూడా భారత్‌కు అత్యంత కీలకం కానుంది.   చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలకు సరుకు రవాణా, సైనిక కదలికలను వేగవంతం చేసేందుకు ఈ సొరంగ మార్గం ఎంతగానో దోహదపడుతుంది.   ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కేవలం రెండు ప్రాంతాలను కలపడమే కాకుండా.. 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలను అనుసంధానిస్తుంది. 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 అంతర్గత జలమార్గాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.   ఇంజినీరింగ్-ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్  మోడల్‌లో దీనిని నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయి.

By
en-us Political News

  
ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏటా అందుబాటులో ఉన్న 65,000 హెచ్-1బీ వీసాల సంఖ్యను 25,000కు కుదించాలని బిల్లే పేర్కొంది. అంతేకాకుండా.. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతిని రద్దు చేసి, కేవలం అత్యధిక వేతనం పొందే నిపుణులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెమూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తమ సహచర కార్మికుడు మరణించాడని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌గౌడ్ మృతితో కార్మికుల నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా కొందరు కార్మికులు నిరసనగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.
ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ 22, డెవాల్డ్ బ్రెవిస్ 21 పరుగులు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.