ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ మృతి

Publish Date:Apr 23, 2026

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతూ..  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ) చికిత్స పొందుతూ కన్నుమూశారు. విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేసే ఆయన..  కార్మికుల భవిష్యత్తు కోసం ప్రాణాలను త్యాగం చేయడం ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన శంకర్‌గౌడ్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం నాడు బస్టాండ్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో   80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆయన పరిస్థితి విషమించింది. తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (ఏప్రిల్ 24) తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచారు.  కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శంకర్‌గౌడ్ స్వగ్రామం నర్సంపేట మండలంలోని ముత్తోజిపేటకు తరలించారు.  

సీఎం దిగ్భ్రాంతి

శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి  ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.  శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్ష ఆర్టీసీ కార్మికులతో ప్రభు త్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెమూడో రోజుకు చేరుకుంది.  ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తమ సహచర కార్మికుడు మరణించాడని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌గౌడ్ మృతితో కార్మికుల నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా కొందరు కార్మికులు నిరసనగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. 

అంతకు ముందు..  కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో హాస్పిటల్ వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ ను చూసేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్ళారు. అయితే ఆమెను ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తాను ప్రజాప్రతినిథిననీ,    ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించడానికి వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారనీ కవిత పోలీసులను నిలదీశారు.  అక్కడే రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు. ఈ సమయంలో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.  

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్మికులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు   ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల కమిటీ  శుక్రవారం (ఏప్రిల్ 24) కార్మిక సంఘాలతో చర్చలు జరపనుంది.

By
en-us Political News

  
ఏపీ సి ఐ డి తన విచారణ లో భారీ స్థాయిలో అక్ర మాలు జరిగినట్లు నిర్ధారించడంతో ఈడీ చర్యలు మరింత వేగం పుంజుకు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్70లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో నగరం లోని మరికొందరు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా అధికారులు రికార్డులు, డిజిటల్ పరిక రాలు, ఆర్థిక లావాదే వీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇండియాలోనూ రోబోల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తమిళనాడులోని కాంచీపురంలో దేశంలోనే మొట్టమొదటి డార్క్‌ ఫ్యాక్టరీని పాలిమాటెక్అ నే సంస్థ ప్రారంభించింది.
గత మార్చిలో భారత్ రష్యా నుండి రోజుకు సుమారు 2.25 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది, ఇది ఇప్పటివరకు నమోదైన గరిష్ట స్థాయి. ఈ నెలలో ఏప్రిల్ మాసంలో కూడా రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల సరఫరా కొనసాగుతుందని అంచనా. ప్రస్తుతం భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 50 శాతానికి చేరుకుంది. తక్కువ ధరకు లభిస్తున్న ఈ చమురు.. దేశ ఇంధన బిల్లు భారాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.
భారత్, రష్యా నౌకలకు రక్షణ నష్టపరిహార కవరేజీ ఇవ్వగల ఆమోదిత బీమా సంస్థల సంఖ్యను 11కి పెంచింది. వీటిలో గాజ్ప్రోమ్ ఇన్సూరెన్స్, రోస్గోస్స్ట్రాఖ్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి.ఈ ఇన్సూరెన్స్ కవరేజి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ చెల్లుబాటు అవుతుంది. అలాగే బ్యాలెన్స్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చెల్లుబాటు ఈ ఏడాది ఆగస్టు 19 వరకూ ఉ:టుంది. సోగ్లాసీ, స్బేర్బ్యాంక్ ఇన్సూరెన్స్, ఉగోరియా, ఏఎస్టికె ఇన్సూరెన్స ల కవరేజీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకూ, అలాగే.. విఎస్కె, సోగాజ్, అల్ఫాస్ట్రాఖోవానియే, ఇంగోస్స్ట్రాఖ్ ల కవరేజీ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పొడిగించింది.
ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏటా అందుబాటులో ఉన్న 65,000 హెచ్-1బీ వీసాల సంఖ్యను 25,000కు కుదించాలని బిల్లే పేర్కొంది. అంతేకాకుండా.. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతిని రద్దు చేసి, కేవలం అత్యధిక వేతనం పొందే నిపుణులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ 22, డెవాల్డ్ బ్రెవిస్ 21 పరుగులు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.