రాజన్న బిడ్డల వారసత్వ పోటీ .. నెగ్గేదెవరో?!

Publish Date:Jan 1, 2024

Advertisement

వారసత్వం సహజం అనేలా మారిపోయింది ప్రస్తుత రాజకీయాలలో. ఇక్కడా అక్కడా అని లేకుండా మన దేశమంతా ఈ వారసత్వపు రాజకీయాలు మనకి కనిపిస్తున్నవే. అయితే ఇది దక్షణాదిలో అందునా మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం ఎక్కువగా, ఇంకొంచం  స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ  వారసత్వపు పునాదులపైనే నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు దేశం పార్టీలో ప్రస్తుతానికైతే వారసత్వపు పోరు లేదు. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సారధ్యం వహిస్తుండగా.. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇదే పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ వారసత్వానికి, చంద్రబాబు వారసత్వానికి కూడా ఇప్పుడు ఎలాంటి పోటీ లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీతో విభేదించి సోంత కుంపటి గా వైసీపీ  పెట్టుకున్నారు. వైసీపీ వైఎస్ జగన్ కు చెందిన సొంత కంపెనీ. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, వైఎస్ఆర్ వారసత్వానికి మాత్రం పోటీ ఉంది.  జగన్ మోహన్ రెడ్డితో పాటు  వైఎస్ఆర్ తనయ షర్మిల కూడా వైఎస్ బ్రాండుకు వారసులుగా ఉన్నారు.

గత ఎన్నికల సమయంలో జగన్, షర్మిల ఇద్దరూ వైసీపీలో ఉండడంతో ఈ వారసత్వం కోసం పోటీ కనిపించలేదు. వైసీపీ అనే పొలిటికల్ కంపెనీలో షర్మిల ఒక ఉద్యోగిగా చేరి.. ఆమె బాధ్యత నిర్వహించి బయటకొచ్చేశారు. ఇంకా చెప్పాలంటే అధినేత కష్టకాలంలో ఉండగా షర్మిల వారసురాలిగా బాధ్యత తీసుకున్నారు. కానీ, కష్టం పోయి మంచి రోజులు వచ్చాక అదే వారసురాలిని బయటకి తరిమేశారు. దీంతో షర్మిల వైఎస్ఆర్ వారసురాలిగా అదే బ్రాండ్ తో తెలంగాణలో మరో బ్రాంచి ఓపెన్ చేసుకున్నారు. కానీ, అక్కడా ఆ బ్రాంచ్ వృద్ధిలోకి రాకుండా సొంతవారే అడ్డుతగులుతుండడంతో ఇప్పుడు షర్మిల అసలు సిసలైన వైఎస్ఆర్ వారసురాలిని నేనే అంటూ తిరిగి తన తండ్రి పనిచేసిన కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వానికి పోటీ నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వం కోసం ఆయన కుమారుడు, కుమార్తె తలపడుతున్నారు. పోటీ పడుతున్నారు.  

వైఎస్ వార‌స‌త్వం అనే వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కీల‌క మ‌లుపు తిప్పేలా కఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో వన్ అండ్ ఓన్లీగా జగన్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడిగా చెలామణి అయ్యారు. అయితే ఇప్పుడు ఆయ‌న సోద‌రి ష‌ర్మిలే ఆయనకు పోటీ వస్తున్నారు. తాను కూడా వైఎస్ బిడ్డ‌నేన‌ని, తాను కూడా ఆయన రాజ‌కీయ వార‌సురాలినేని అంటూ ప్ర‌చారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందునా  తండ్రి చివరి శ్వాస వరకూ పనిచేసిన పార్టీ కాంగ్రెస్ నుంచి అన్నతో తలపడడానికి రెడీ కావడం షర్మిలకు మరింత అడ్వాంటేజ్గా మారింది. అప్పుడు వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు, తెచ్చిన పాలసీలు, కట్టిన ప్రాజెక్టులు అన్నీ చెప్పుకొనేందుకు షర్మిలకు అవకాశం దక్కనుంది. తన తండ్రి వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ అని గర్వంగా చెప్పుకొనేందుకు షర్మిలకు ఎలాంటి అడ్డంకులు లేవు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే వైఎస్ఆర్ కలలను సాకారం చేస్తుందని.. అసలు సిసలైన రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొనేందుకు షర్మిలకు ఆస్కారం ఉంది.

రాజకీయాలలో కుమారుడు, కుమార్తెల వారసత్వంలో ఎలాంటి తేడాలు ఉండవు. వారసుడంటే కేవలం కుమారుడు మాత్రమే కాదు.. కుమార్తెలకు కూడా హక్కు ఉంటుంది. కనుక తన తండ్రికి గుర్తింపునిచ్చిన పార్టీలో ఉన్న వారికే ఈ వారసత్వంపై ఎక్కువ హక్కు ఉంటుంది. ఆ మాటకొస్తే వైసీపీకి వైఎస్ఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆయన ఆశయాల ఆధారంగానే పుట్టిన పార్టీగా మాత్రమే చెప్పుకుంటారు. కానీ  వైఎస్ఆర్ ది కాంగ్రెస్ తో విడదీయరాని బంధం. కనుక ఇప్పుడు షర్మిల అప్పుడు తండ్రి కాంగ్రెస్ లో ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు అదే స్థానంలో కూర్చుంటే ఆమెనే అసలు సిసలైన వారసురాలిగా భావించాల్సి వస్తుంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి  ఎదుర్కోవడం కఠిన పరీక్షగానే మారుతుంది. ఇప్పటికే నాలుగున్నరేళ్ల పాలనలొ జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  వైఎస్ బ్రాండ్ ను దాదాపుగా ఆయన పార్టీలో  కనిపించకుండా చేసేశారు. ఇప్పుడు తన తండ్రి పేరు చెప్పుకుని కాంగ్రెస్ తరఫున షర్మిల రంగంలోకి దిగితే  జగన్ ను కఠిన పరీక్షే అవుతుందనడంలో సందేహం లేదు.  ఇప్పుడు వైఎస్   వారసత్వ  పోటీ లో ప్రజలు ఎవరిని గుర్తిస్తారు? ఎవరిని ఆదరిస్తా రన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.