తమిళనాట ఎన్నికల వేడి పీక్స్ చేరింది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ హీట్ రోహిణీకార్తె ఎండలను తలపింప చేస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ . ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం జననాయగన్ విడుదల ఆగడం వెనుక తన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకునేం కుట్రలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు. కరూర్ తొక్కిసలాట ఆ బాధితులకు ఏ విధంగా అయితే న్యాయం జరగాలని కోరుకుంటున్నానో.. అలాగే జననాయగన్ విషయంలో తనకు కూడా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.
కేవలం సినిమా గురించే కాకుండా.. విజయ్ తన ప్రచారంలో ప్రజా సమస్యలపై కూడా గట్టిగా గళం వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వేధిస్తున్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కుటుంబానికి చిన్న ఇబ్బంది కలిగినా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెంటనే ఢిల్లీకి పయనం అవుతారని, మరి సామాన్యులను ఇబ్బంది పెడుతున్న గ్యాస్ సిలిండర్ల సమస్యను పరిష్కరించడానికి ఎందుకు కేంద్రంతో చర్చలు జరపడం లేదని నిలదీశారు.
నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ పొలిటీషియన్ గా ఏ మేరకు సక్సెస్ అవుతారో ఈ ఎన్నికలు తేలుస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుచ్చి ఈస్ట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, సినిమా విడుదలకు ఆటంకాలు కల్పించడం ద్వారా తన రాజకీయ మైలేజీని తగ్గించాలని ప్రత్యర్థులు చూస్తున్నారన్న విజయ్ వ్యాఖ్యలు ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/unable-to-counter-me-politically-39-216621.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.