లండన్ లో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగుయువకులు మృతి
Publish Date:Feb 28, 2026
Advertisement
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించి కన్నవారికి, పుట్టిన దేశానికి గర్వంగా నిలవాలని ఎంతో ఆశపడిన ఇద్దరు యువకులు అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. లండన్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలు కాగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. లండన్‌లోని సౌత్ క్రోయిడాన్ లో గత సోమవారం (ఫిబ్రవరి 23) అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన గంటి అభిషేక్(27) అక్కడిక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ కు చెందిన కామినేని సాయి శ్రీకర్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అభిషేక్, కామినేని సాయి శ్రీకర్ మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు యూకేలోని భారత కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/two-telugu-youth-died-in-fire-accident-36-214812.html





