టీటీడీలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు

Publish Date:Feb 5, 2025

Advertisement

జగన్ అరాచకపాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయానికి రాష్ట్రం అన్ని రంగాలలో అధమ స్థానంలో ఉంది. వ్యవస్థలు నిర్వీర్యమై ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి  అధ్వానంగా ఉంది. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రక్షాళన చేసి మళ్లీ అభివృద్ధి బాట పట్టించాల్సిన పరిస్థితి. అందుకే అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల దేవుడిని దర్శించుకున్న చంద్రబాబు అక్కడే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ఆరంభిస్తానని ప్రకటించారు. అదే చేశారు. చేస్తున్నారు. తిరుమల ప్రక్షాళన మొదలైంది. జరగాల్సింది ఇంకా చాలా ఉంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ పనికి నడుంబిగించింది.

తిరుమలపై ఈ నెల 11 చంద్రబాబు సమీక్ష చేయనున్న నేపథ్యంలో కీలక చర్యలు, సంచలన నిర్ణయాలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారంటూ వారిపై బదిలీ వేటు వేసింది. వీరు కాకుండా మరో 300 మంది అన్యమతస్తులు టీటీడీలో వివిధ విభాగాల్లో కొలువులు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. వారిని కూడా దశల వారీగా బదలీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం టీటీడీ బదిలీవేటు వేసిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు.  

తిరుమలలో అన్యమతస్తులు ఉండడానికి వీలులేదని టీటీడీ చెబుతోంది. హిందువులు వినా మరో మతానికి చెందిన వారికి టీటీడీలో కొలువులు సరికాదన్న భావనతో  ముందుగా టీటీడీలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో కొందరు టీటీడీలో కొలువులో చేరారు. 
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీలో హిందూయేతరులు ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నారు.  టీటీడీలో ఉద్యోగం చేస్తున్న అన్యమతస్తులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోకి మార్చడం లేదంటూ వీఆర్ఎస్ ఇవ్వడం చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు.  ఆ మేరకు ఆరా తీయగా టీటీడీలో 300 మందికి పైగా అన్యమతస్తులు పని చేస్తున్నట్లు తేలింది. ఇప్పుడు వారిని టీటీడీ నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది.

తొలి దశలో 18 మందిపై బదిలీ వేటు వేసింది.  ముందు ముందు మిగిలిన వారిని కూడా టీటీడీ నుంచి వేరే రాష్ట్రప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడమో, వీఆర్ఎస్ ఇవ్వడమో చేస్తామని టీటీడీ చెబుతోంది. ఇక తిరుమల కొండపై పారిశుదధ్య పరిస్థితిని మెరుగుపరచడానికి టీటీడీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. తిరుమలలో పారిశుద్ధ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని భక్తులు చెబుతున్నారు. అలాగే తిరుమలలో భక్తుల సౌకర్యాలు, అన్న, జల ప్రసాదాల వితరణ భేషుగ్గా ఉందంటున్నారు. అలాగే తిరుమల కొండపై హోటళ్లలో తినుబండారాల నాణ్యత కూడా మెరుగుపడిందనీ, అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతా భేషుగ్గా ఉందని భక్తులు చెబుతున్నారు. తాజాగా మంగళవారం తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాన్ని టీటీడీ బ్రహ్మాండంగా నిర్వహించిందని భక్తులు ప్రశంసిస్తున్నారు. స్వామి వారి వాహన సేవలను తిలకించి తరించడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్ల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.