LATEST NEWS
తిరుమలలో తప్పతాగి హల్ చల్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు చెప్పారు.  అన్నమయ్య భవన్ లో శనివారం (మే 24) డయల్ యువర్ ఈవో కార్యకరమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.  శ్రీవారి పుష్కరిణిలో శుభ్రంగా ఉండడం లేదని భక్తుల ఫిర్యాదు చేశారనీ,  అద్దె గదులలో బాత్రూంలు కొన్ని సరిగా క్లీన్ చేయడం లేదని కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. ఇక శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి, బంగారు వాకిలి దగ్గర ఎక్కువ తోపులాట జరుగుతోందని భక్తుల వద్ద నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. భక్తుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈవో స్పష్టం చేశారు. అలాగే  శ్రీవారి సేవలో సంస్కరణలు తీసుకువస్తున్నమన్న ఆయన ఇటీవల తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనల మేరకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.  తిరుమలను ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేస్తామన్నారు. 100 బిగ్ క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్ల కేటాయింపు విషయంలో నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు.  163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని అన్నారు.  భక్తులకు సాంప్రదాయ వంటలు మాత్రమే అందించాలని మరోమారు స్పష్టం చేశారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  టెక్నాలజీ ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.  త్వరలో జిపిటి చాట్ బోట్ అందుబాటులోకి తీసుకువస్తామనీ, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 4 సర్వీసులను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని మరో 10 సేవలు ట్రయల్ రన్ లో ఉన్నాయని ఈవో శ్యామలరావు వివరించారు.  
జీవన విధానంలో యోగా భాగం కావాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విశాఖ రానున్న నేపథయంలో సన్నాహక కార్యక్రమాలను కూడా ఘటనంగా నిర్వహిస్తున్నారు.  విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు.  యోగా   శరీరానికీ, మనసుకూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు   ఎనర్జిటిక్‌గా ఉండటానికి యోగాయే కారణమన్న అనిత..   ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక గంట యోగానికి సమయం కేటాయిస్తే..  రోజంతా ఉత్సహంగా గడిపేందుకు వీలుంటుందన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి,ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి,అధికారులు పాల్గొన్నారు. 
బీఆర్ఎస్ లో చీలిక పక్కా అయిపోయిందా?  కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమైపోయిందా? అంటే.. గులాబీ పార్టీ వర్గాల నుంచి ఔననే  సమధానమే వస్తోంది. నిజానికి కవిత  చాలా కాలంగా  సొంత కుంపటి’ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే..  కేటీఆర్, హరీష్ రావులను కలిపినట్లుగానే కేసీఆర్  ఏదో చేసి కవితను దారికి తెస్తారనే  ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి.  కవిత అమెరికా నుంచి వస్తూ వస్తూనే.. తెలంగాణ గడ్డ పై కాలుపెట్టీపెట్టక ముందే చేసిన ‘దయ్యాల’ వ్యాఖ్యలతో, ఆ కొద్ది పాటి దింపుడు కళ్ళెం ఆశ కూడా కొడిగట్టిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏదో మహాద్భుతం జరిగితే తప్పించి, గులాబీ పార్టీ చీలికను నిరోధించడం  ‘దేవుడి’ కి కూడా సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవును. భారత రాష్ట్ర సమితి లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావుకు, ఆయన కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత రాసిన రాజకీయ లేఖ సంచలనంగా మారింది.  నిజానికి, కవిత ఎవరో పరాయి వ్యక్తిలా, కన్న తండ్రికే  లేఖ రాయడమే ఒక సంచలనం అయితే..  ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలు మరింత సంచలనంగా మారాయి.  ముఖ్యంగా  బీఆర్ఎస్ రజతోత్సవ సభ తీరు తెన్నులు.. ఆ సందర్భంగా కేసీఆర్ చేసియన్ ప్రసంగం మంచి చెడులను ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. అదే సమయంలో ఆమె చేసిన మర్మ గర్భ వ్యాఖ్యలూ..  ముఖ్యంగా బీజేపీని విమర్శించ వలసినంతగావి మరించలేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  అంతకు మించి అమెరికా నుంచి  వస్తూనే, ఆ లేఖ రాసింది తానేనని స్పష్టం చేయడంతో పాటు, మా నాయన, కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి’ అంటూ చేసిన, వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. అలాగే..  లేఖ లీక్  కు సంబదించి కవిత లేవనెత్తిన ప్రశ్నలు.. ఆమె పుట్టింటి  కుట్రలకు అద్దం పడుతోందని అంటున్నారు.  నిజానికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్  అన్నట్లుగా పార్టీ నాయకురాలిగా కవిత లేఖ రాయడం తప్పు కాదు. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టవలసిన అవరం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితిని ఆమె తనకున్న అవగాహన మేరకు ప్రజాస్వామ్య స్పూర్తితో పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళారు. పార్టీ నాయకురాలిగా పార్టీకి పార్టీ అధ్యక్షునికి సూచనలు చేశారు. దాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కానీ  ఆమె  అక్కడితో ఆగ లేదు. కేసీఆర్ ను దేవుడిగా పేర్కొంటూనే.. ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని  పరోక్షంగానే అయినా తండ్రి పైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక విధంగా ధృతరాష్ట్రుడితో  పోలిక తెచ్చారా అన్నట్లుగా  ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.   కేసీఆర్ కుమార్తెగా  తాను రాసిన లేఖే లీక్ అయితే..  సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి? ఇది అత్యంత బాధాకరం. లేఖ ఎలా లీక్ అయిందో, పార్టీ ప్రజలు కూడా ఆలోచించాలి  అంటూ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. లేఖ లీక్ లోనే కుట్ర కోణం దాగుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, దేశంలో అడుగుపెడుతూనే, పార్టీని ముఖ్యంగా కన్న తండ్రి కేసేఆర్ ను ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఆమె,లక్ష్యం ఇంకేదో ఉందనే విషయాన్ని స్పష్టమౌతోందని పరిశీలకులు అంటున్నారు.     అదొకటి అయితే, కవిత.. నాన్నకు ప్రేమతో.. రాసిన లేఖ వెనక చాలా,  పేద్ద   కథే ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. ఇటీవల ఆమె నడకలో, నడతలో, భాషలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పు  నేపథ్యంలో కవిత అడుగులు ఎటుగా పడుతున్నాయి?  ఆమె తదుపరి రాజకీయ ప్రస్థానం ఎటుగా సాగుతోంది? ఆమె ఆమెగానే, అడుగులు వేస్తున్నారా.. లేక, నడిచేది ఆమే అయినా నడిపించే వారు వేరే ఉన్నారా? అనే ప్రశ్నలు, అనేక వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కవిత వెనక ఎవరున్నారు అనేది పక్కన పెడితే,  కవిత కారు దిగడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. నిజానికి..లిక్కర్ కుంభకోణం విచారణ మొదలైనప్పటి నుంచే ఆమెకు ఇటు ఫ్యామిలీలో,అటు పార్టీలో వ్యతిరేకత మొదలైందని అంటున్నారు. అక్కడి నుంచే ఆమె పార్టీకి, ఫ్యామిలీకి కూడా దూరం అవుతూ వచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి, ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత పార్టీని,ఫ్యామిలీని నమ్ముకుంటే కష్టమనే నిర్ణయానికి కవిత వచ్చారని అంటున్నారు. అందుకే..  ఆమె, పార్టీలో, ఫామిలీలో తమ స్థానం ఏమిటో స్పష్టం  చేయాలని, అన్న కేటీఆర్ తో సమాన హోదా కోసం పట్టుపడుతూ వచ్చారని అంటారు. అయితే.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో  పార్టీలో తన స్థానేమిటో తేట తెల్లకావడంతో పాటుగా ఆమె అమెరికా ప్రయాణానికి ముందు కేసీఆర్ మధ్యవర్తిత్వం వహించి మరీ కేటీఆర్, హరీష్ రావులను కలపడంతో.. కవితకు తన స్థానం ఏమిటో తెలిసివచ్చిందని, అందుకే ఆమె కొత్త దారులు వెతుక్కుంటున్నారని అంటున్నారు. అందుకే..  విమానం దిగుతూనే ఇక  మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా దయ్యాల  తూటాను, ఎవరికి తగలాలో వారికి తగిలే విధంగా పేల్చారని అంటున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందునుంచే ఉహించిన కవిత ఒకటి కంటే ఎక్కవ ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పడు.. ఆమె కారు దిగడం ఖాయమని తెలిపిన నేపధ్యంలో, ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు.. ఎటుగా అడుగులు వేస్తారు  అనేది చూడవలసి ఉందని అంటున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు, పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఆ దేశం పట్ల వ్యతిరేకత, ఏహ్యత ఏ స్థాయిలో వ్యక్తం అవుతోందంటే.. దేశ ప్రజలంతా ఎంతో ఇష్టపడే స్వీట్ మైసూర్ పాక్ పేరు మార్చేయాలంటూ నెట్టింట ఓ రేంజ్ లో డిమాండ్ వినిపిస్తోంది.  ఈ డిమాండ్ కు అనుగుణంగా  ఓ మిఠాయి వాలా వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లలో పాక్ అనే పదం లేకుండా వాటి పేర్లు మార్చేశాడు. ఔను నిజంగా నెటిజనుల ప్రతిపాదన రాజస్థాన్ లోని ఓ స్ట్వీట్స్ దుకాణం యజమానికి విపరీతంగా నచ్చేసింది.  అంతే వెంటనే తన దుకాణంలో విక్రయించే స్వీట్లకు పాక్‌ పదాన్ని తీసేసి ఆ స్వీట్లకు కొత్త పేర్లు పెట్టారు.  మైసూర్ పాక్  పేరును  మైసూర్ శ్రీగా మార్చేశారు.    జైపుర్‌లో గల ప్రముఖ  త్యోహార్‌ స్వీట్స్‌  యజమాని ఈమేరకు తమ దుకాణంలోని స్వీట్ల పేర్లకు పలు మార్పులు చేశారు.  ఒక్క మైసూర్ పాక్ పేరునే కాదు  మోతీ పాక్‌, ఆమ్‌ పాక్‌, గోండ్‌ పాక్‌ పేర్లను కూడా మార్చేశారు. వాటికి కూడా  మోతీ శ్రీ, ఆమ్‌ శ్రీ, గోండ్‌ శ్రీ అని కొత్తగా నామకరణం చేశారు. స్వర్ణ భాషం పాక్‌, చాందీ భాషమ్‌ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు.   వాస్తవానికి స్వీట్లకు ఉన్న పేరులో పాక్ అన్న పదానికి, పాకిస్థాన్ కీ సంబంధం లేదు. పాక్ అనే పదానికి సంస్కృతంలో వండటం అని అర్ధం. అయినా ఆ పదం పాకిస్థాన్ ను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో.. ఆ పదం పలకడానికీ, వినడానికి ఇష్టం లేకనే తమ దుకాణంలో ఆ స్వీట్ల పేర్లు మార్చేశానని త్యోహార్ స్వీట్స్ యజమారి అంజలీ జైన్ తెలిపారు.  
తిరుమలలో ముగ్గరు తాగుబోతు ఖాకీలు హల్ చల్ చేశారు.  మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు.  ఇక కొండపై భక్తులను  ఇబ్బందులకు గురిచేశారు.  మద్యం తాగిన పోలీసులను  టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పోలీసులూ కర్నూలుకు చెందిన   రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గాగుర్తించారు.  వీరిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తే 300 పాయింట్లు చూపినట్లుగా తెలుస్తోంది.  తిరుమలలో వరుస అపచారాలపై భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తప్పతాగిన కానిస్టేబుళ్లు అలిపిరి వద్ద తనిఖీలను దాటుకుని ఎలా వచ్చారన్న ప్రశ్న భక్తుల నుంచి వస్తున్నది. ఇటీవల కొన్ని రోజుల కిందట   తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్‌ చేసిన ఘటన మరువక ముందే.. ముగ్గురు పోలీసులు ఏకంగా తప్పతాగి తిరుమల కొండపైకి వచ్చి నానా హంగామా చేసిన సంఘటన జరగడంతో అసలు తిరుమలలో నిఘా ఉందా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  నమాజ్‌ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినిమా ‘చిత్రాంగద’తో బాలనటిగా తన కెరీర్‌ని ప్రారంభించిన శ్రీలీల.. ‘పెళ్లిసందడి’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసిన శ్రీలీల ఆ తర్వాత చేసిన సినిమాలతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది. ‘పుష్ప2’లో చేసిన ఐటమ్‌ సాంగ్‌తో యూత్‌లో మరింత క్రేజ్‌ సంపాదించుకొని టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అనిపించుకుంటోంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ్‌లో, ‘ఆషికి3’తో హిందీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ‘పరాశక్తి’ సినిమా వల్ల శ్రీలీల తమిళ్‌ ఎంట్రీ కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అరడజను సినిమాలతో శ్రీలీల బిజీగా అయిపోయింది. ‘పరాశక్తి’ తనకు తమిళ్‌లో మంచి క్రేజ్‌ తెస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఇప్పుడీ సినిమా సమస్యల్లో ఇరుక్కోవడంతో సినిమా రిలీజ్‌ అవుతుందా, లేదా అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది.  వివరాల్లోకి వెళితే.. ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాల దర్శకురాలు సుధా కొంగర చేస్తున్న ‘పరాశక్తి’ టీజర్‌ ఆమధ్య విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘అమరన్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో అతని ఇమేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అతని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘పరాశక్తి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అమరన్‌’ హిట్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకి శివకార్తికేయన్‌కు రూ.70 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమాను నిర్మిస్తున్న డాన్‌ పిక్చర్స్‌ అధినేతలు ఓ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ఈడీ అధికారులు ఆ నిర్మాతలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రచారంలో ఉన్న వార్తలను బట్టి చూస్తే ‘పరాశక్తి’ నిర్మాతల ద్వారా పెద్ద స్కామ్‌ జరిగిందని సమాచారం. శివకార్తికేయన్‌కి మార్కెట్‌ కంటే ఎక్కువ పారితోషికం ముట్టజెప్పారని, అందులో బ్లాక్‌మనీ ఎక్కువ ఉందని తెలుస్తోంది. ఆ డబ్బుతో అతనికి ఓ ఖరీదైన భవనాన్ని నిర్మిస్తున్నారని తమిళ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.  ‘పరాశక్తి’ నిర్మాతలు ఈ స్కామ్‌లో ఇరుక్కోవడం, ఈడీ అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడంతో అది శివకార్తికేయన్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సమస్య పెద్దది కావడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని సమాచారం. ఇంత భారీ సినిమాతో తమిళ్‌లో ఎంట్రీ ఇవ్వాలని భావించిన శ్రీలీలకు పెద్ద షాక్‌ ఇచ్చారు ‘పరాశక్తి’ నిర్మాతలు. తమిళ మీడియా కథనాల మేరకు ఇప్పట్లో సినిమా తిరిగి షూటింగ్‌ జరుపుకునే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు పలు కేసుల్లో ఇరుక్కోవడం, కోర్టుల చుట్టూ తిరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక భారీ చిత్రం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంది అంటే ఈ కేసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో, సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. 
జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్స్ ని మూసివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యాలు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అద్దె ప్రాతిపదికిన సినిమాలు ప్రదర్శిస్తుండంతో ఆదాయం సరిపోవడం లేదని, మల్టిప్లెక్స్ తరహాలో పర్శంటేజ్ ఇవ్వాలనేది థియేటర్ యాజమానుల ప్రధాన డిమాండ్. కొన్ని రోజుల క్రితం ఈ అంశంపై థియేటర్ యాజమాన్యం,డిస్ట్రిబ్యూటర్ లతో కొంత మంది నిర్మాతలు సమావేశం నిర్వహించారు. కానీ ఈ సమావేశంలో సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి ఫిలింఛాంబర్ లో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూసివేత నిర్ణయం నిరవధిక వాయిదా వేస్తున్నాం. ఈనెల 30న విశాఖపట్నంలో జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతుందని చెప్పాడు. ఈ సమావేశంలో   ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఇక థియేటర్స్ బంద్ వెనక  కొంత మంది సినీ పెద్దలు ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ వీరమల్లు రిలీజ్ పై టెన్షన్ మొదలైంది. దీంతో దామోదర ప్రసాద్ చెప్పిన మాటతో పవన్ అభిమానుల్లో జోష్ నెలకొని ఉంది.    
రంజాన్(Ramdan)పర్వదినాన్ని పురస్కరించుకొని అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)మార్చి 30 న' సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీపై, సల్మాన్ తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సల్మాన్ కెరీర్ లోనే అతి పెద్ద పరాజయాన్ని చవి చూసిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ ఓటిటి హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు ఓటిటి ప్రేమికులు సికందర్ ఎప్పుడెప్పుడు ఓటిటి లోకి అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి అంటే రేపట్నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అభిమానులకి ఈ ప్రకటన శుభవార్త అని చెప్పవచ్చు. సికందర్ లో సల్మాన్ సరసన రష్మిక(Rashmika Mandanna)జోడి కట్టగా, కాజల్ అగర్వాల్, సత్య రాజ్, షర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, సంజయ్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాడు.      
Akkineni Nageswara Rao, the legend of Indian and Telugu Cinema, has a huge emotional connection with audiences through his great films. His son, King Nagarjuna, built an empire away from his father's image with his hard work and passion. But they both have an unique coincidence in their careers.  The first film of Nagarjuna released on the same date as last film of ANR. Yes, maybe only die-hard Akkineni fans are aware of this coincidence but it is interesting decipher. On 23rd May, 1986, Nagarjuna's Vikram released and became a huge blockbuster establishing him as a lead actor.  28 years later, ANR's final hurrah, Manam, that too having all three generations of Akkinenis in same frame - ANR, Nagarjuna, Naga Chaitanya and Akhil, released on 23rd May 2014. The significance of Vikram for Nagarjuna is that, he could realise his dream of being an actor and then he slowly understood his limitations to grow further.  Without Vikram, Nagarjuna might have struggled to find better stories or confidence within to try out different films. He could deliver films like Geethanjali, Shiva that changed the course of Telugu Cinema at the dawn of 90's after just 3 years of his debut.    Without Manam, ANR's lifelong dream to act till his last breathe and share screen with his son, grandson at the same time, might not have realised. Also, for a legend, it proved to be the fitting last film, as it turned out to be another cult classic for Telugu Cinema.    Speaking about the unique coincidence, Akkineni Nagarjuna said, "For my debut and my father’s final film to release on the same day, decades apart, feels like cinema’s way of telling our story, a story of legacy, love, and a lifelong commitment to the craft."   Well, Nagarjuna completed 39 years of his career by May 23rd and he is gearing up to entertain audiences further in his landmark 40th year with Kuberaa along with Dhanush and Coolie along with Superstar Rajinikanth. 
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ముకుల్‌ దేవ్‌(54) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ముకుల్‌.. ముంబాయిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. ముకుల్‌ బాలీవుడ్‌ నటుడే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. కృష్ణ, ఏక్‌ నిరంజన్‌, కేడీ, అదుర్స్‌, సిద్ధం, బెజవాడ, నిప్పు చిత్రాల్లో విలన్‌గా నటించారు. ఆయన చివరగా నటించిన తెలుగు సినిమా 2013లో వచ్చిన ‘భాయ్‌’. 1996లో బాలీవుడ్‌ సినిమా ‘దస్తక్‌’తో సినీ రంగ ప్రవేశం చేశారు ముకుల్‌. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దాదాపు 60 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. 1970 సెప్టెంబర్‌ 17న హరిదేవ్‌ కౌశల్‌, అనూప్‌ కౌశల్‌ దంపతులకు ఢల్లీిలో జన్మించారు ముకుల్‌. ఇతను ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ దేవ్‌ తమ్ముడు. రాహుల్‌, ముకుల్‌.. ఈ ఇద్దరూ అనేక తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నారు ముకుల్‌. తల్లిదండ్రులు మరణించడంతో కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆ క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. 
నాచురల్ స్టార్ 'నాని'(Nani)మే 1 న వరల్డ్ వైడ్ గా 'హిట్ 3'(Hit 3)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో 'అర్జున్ సర్కార్' గా నాని తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నానితో పాటు మిగతా క్యారక్టర్ లలో చేసిన నటీనటులు కూడా తమ క్యారెక్టర్ల మేరకు మంచి పెర్ఫార్మెన్సు ని ప్రదర్శించి చిత్ర విజయానికి దోహదపడ్డారు. కలెక్షన్స్ పరంగా కూడా వంద కోట్ల మార్కుని అందుకొని నాని కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఈ నెల 29 నుంచి ఓటిటి లో 'నెట్ ఫ్లిక్స్'(Netflix)వేదికగా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారంగా వెల్లడి చేసింది. దీంతో ఓటిటి సినీప్రియుల్లో పండుగ  వాతావరణం వచ్చిందని చెప్పవచ్చు. శ్రీనిధిశెట్టి(Srinidhi Shetty)సూర్య శ్రీనివాస్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాధ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన హిట్ 3 కి  శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వాల్ పోస్టర్ సినిమా, యునానమిస్ ప్రొడక్షన్స్ పై నాని, ప్రశాంతి తిప్పరనేని నిర్మించగా మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించాడు.    
గత నెల ఏప్రిల్ 29 న శశికుమార్(M. Sasikumar)సిమ్రాన్(Simran)జంటగా 'అబీషాన్ జీవింత్'(Abishan Jeevinth)దర్శకత్వంలో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'(Tourist Family). కామెడీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకోగా, ఇప్పటి వరకు డెబ్భై ఐదు కోట్ల రూపాయిల దాకా వసూలు చేసింది. ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారకంగా వెల్లడి చెయ్యడంతో, మూవీ సాధించిన విజయం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. రజనీకాంత్(Rajinikanth),శివ కార్తికేయన్(Siva karthikeyan)రాజమౌళి(Rajamouli)లాంటి పలువురు సినీ ప్రముఖులు టూరిస్ట్ ఫ్యామిలీ చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కోవలోనే  రీసెంట్ గా సూర్య(Suriya)దర్శకుడు అబీషాన్ జీవింత్ తో పాటు టీం ని కలిసి అభినందించడం జరిగింది. దీంతో ఈ విషయంపై అబీషాన్ జీవింత్ 'ఎక్స్'(X)వేదికగా స్పందిస్తు 'సూర్య నన్ను కలిశారు. మూవీ  ఆయనకి ఎంత బాగా నచ్చిందో చెప్పారు. ఈ అనుభూతిని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. ఎప్పట్నుంచో ఉన్న బాధ ఇప్పుడు తీరినట్టుగా ఉంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ని వంద సార్లు చూసిన నేను ఇప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాను అంటు ట్వీట్ చేసాడు. టూరిస్ట్ ఫ్యామిలీ' ని మిల్లన్ డాలర్ స్టూడియోస్, ఎం ఆర్ పి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తగా నిర్మించగా యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ రోజు నుంచి జపాన్ లో కూడా ప్రదర్శితం కానుంది. ముందు ముందు తెలుగులోకి ఏమైనా డబ్ అవుతుందేమో చూడాలి.       
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు(Hari Hara veeramallu)మొదటిభాగం జూన్ 12 న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత వీరమల్లు థియేటర్స్ లోకి అడుగుపెడుతుండటంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వగా మరికొన్ని రోజుల్లో సదరు ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది. డిప్యూటీ సిఎంగా బిజీగా ఉండటంతో పవన్  ప్రమోషన్స్ లో పాల్గొనడం కష్టమనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని ఈవెంట్స్ లో పవన్ పాల్గొనబోతున్నట్టుగా  తెలుస్తుంది. ఇక జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్స్ ని మూసివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో పవన్ అభిమానుల్లో వీరమల్లు రిలీజ్ పై టెన్షన్ మొదలైంది. అద్దె ప్రాతిపదికిన సినిమాలు ప్రదర్శిస్తుండంతో ఆదాయం సరిపోవడం లేదని, మల్టిప్లెక్స్ తరహాలోనే పర్శంటేజ్ ఇవ్వాలనేది థియేటర్ యాజమానుల ప్రధాన డిమాండ్. అయితే ఈ నిర్ణయం వెనుక కొంత మంది సినీ పెద్దలు ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి తో మాట్లాడుతు సినిమా హాళ్ల మూసివేత కారణంగా ఎన్ని సినిమాలు నష్టపోతాయి.ఎంత టాక్స్ రెవిన్యూ కి ఇబ్బంది కలిగిస్తుంది. థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ లు  ఒక గ్రూప్ లాగా ఏర్పడి మూసివేత నిర్ణయాలు తీసుకోవడం వెనక ఎవరైనా ఉన్నారా అని  విచారించాలని చెప్పడం జరిగింది. రీసెంట్ గా   థియేటర్ల బంద్  అంశంపై  థియేటర్ యాజమాన్యం,డిస్ట్రిబ్యూటర్ లతో కొంత మంది నిర్మాతలు సమావేశం నిర్వహించారు. కానీ ఈ సమావేశంలో సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో   మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత  తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.   
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)విశ్వంభర(Vishwambhara)తర్వాత అనిల్ రావిపూడి(Anil ravipudi)దర్సకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో అధికారకంగా ప్రారంభమైన ఈ మూవీపై చిరు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే  ప్రమోషన్స్ కూడా వినూత్నంగా జరుగుతున్నాయి.చిరు ఓల్డ్ సినిమా కట్ అవుట్ లతో ప్రారంభమైన ఈ ప్రమోషన్ హీరోయిన్ నయనతార(Nayanthara)వరకు చాలా వినూత్నంగా జరిగింది. దీంతో మూవీలో ఎంటర్ టైన్ మెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్ధమవుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో స్టార్ట్ అవుతుందని, అనిల్ రావిపూడి అండ్ టీం ఆల్రెడీ అక్కడే ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. చిరుతో పాటు ప్రధాన తారాగణంపై కొన్నికీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారకంగా వెల్లడి చేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని  సమకూరుస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరు సినిమాని కూడా అంతకు మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. 2026 సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.        
  మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. #Mega157 అనేది వర్కింగ్ టైటిల్. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. వారి కోరిక ఈ చిత్రంతో తీరబోతుంది.   షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.   ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.  ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. అదే మ్యాజిక్ ని వచ్చే సంక్రాంతికి రిపీట్ చేయాలని చూస్తున్నాడు.    ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మాట ఆభరణం మనిషికి అంటారు పెద్దలు. మాటే మంత్రము అంటారు కవులు. మాట ఇతరులను ముగ్ధులను చేస్తుంది, ఆకర్షిస్తుంది. అందంగా ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా ఒక కళ. ఇప్పటి యూత్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడటం గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాట్లాడటంలో అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి.  ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణలో మనం ఎప్పుడూ ఇతరులతో వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. సంభాషణలో మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకానీ వాదనకు దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాదనే గొడవలకు దారి తీస్తుంది. సంభాషణలో ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. ఇతరులు చెప్పిన దాన్ని వారి ముఖం మీదే తప్పు అని ఖండిస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సంభాషణలో మనం మాట్లాడేది తప్పు అని మీరు గమనించినా లేక ఇతరులు తెలియజేసినా హుందాగా ఆ తప్పును అంగీకరించాలి. అంగీకరించడంలో కూడా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తం అవుతుంది. అంతేగానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకూడదు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ఇతర పనులు కూడా తప్పిదాలే అవుతాయి. ఒకదాని వెనుక ఒకటిగా తప్పుల చిట్టా పెరుగుతుంది. సంభాషణని ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ప్రారంభించాలి. అలాగే చిరునవ్వుతో ముగించాలి. అప్పుడే విలువను కాపాడుకోగలిగిన వారమవుతాము. నచ్చని విషయాలు ఉన్నా, న్యాయమైన విషయాలు లేకపోయినా వాటిని సుతిమెత్తగా నవ్వుతూనే చెప్పాలి తప్ప గొడవకు దారితీసేలా ఆవేశంగా ఉండకూడదు. ఇతరులు చెప్పే విషయాలను మనం ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి. వారు చెబుతున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీలో లేదా కూర్చున్న స్థానంలో కొంచెం ముందుకు వంగి వినాలి. వారికి అటెన్షన్ ఇస్తున్నామనే అభిప్రాయం  కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, దాపరికం లేకుండా చెబుతారు. ఇతరుల అభిప్రాయాలపట్ల సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడూ కూడా సంభాషణలో ఇతరులను ఆకర్షించాలంటే ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వాలి. మనం చెప్పాలనుకున్న విషయాలు, మనం చేయాలనుకున్న ఆలోచనలనూ ఇతరుల ఆలోచనలుగా చేసి వాటిని ఆమోదించాలి. విషయాలను మనం చూసే కోణంలో కాక ఇతరుల కోణంలోంచి చూడాలి, ఆలోచించాలి. మనం ఇతరులపట్ల చూపవలసింది గౌరవాన్ని అనే విషయం మరచిపోకూడదు. వారు చెప్పే మంచిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంభాషణలో అన్నీ నాకు తెలుసు అనుకొనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవతలి వారు అభిప్రాయాన్ని విషయాన్ని పూర్తిగా చెప్పేంతవరకూ వినాలి. అంతేకానీ మధ్యలో  తొందరపడి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. సూచనలు ఇచ్చే ముందు వారు చెప్పిన విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్నాకే ఇవ్వండి. ఇతరులతో సంభాషించే ముందు సంభాషణను అభినందనతో ప్రారంభించాలి. ఇతరులు చేసిన పొరబాట్లను బహిరంగంగా విమర్శించకూడదు. ఇతరులను విమర్శించే ముందు మీ తప్పుల్ని మీరు అంగీకరించాలి. ఇతరులకు ఆజ్ఞాపూర్వకమైన సూచనలు ఇవ్వవద్దు. దానికి బదులుగా సలహాపూర్వక సూచనలు ఇవ్వాలి. సంభాషణలో ఎప్పుడూ కూడా ఇతరులను అవమానించకూడదు. ఇతరులలో ఉన్న మంచి గుణాలను గాని లేక ఇతరులలో మీరు ఆశిస్తున్న మంచి గుణాలను వారికి ఆపాదించి, వారిని ఆ విధంగా ఉండేలా మలచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇతరులను ఆకర్షించుకోగలుగుతాము. ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచిని బయటకు చెప్పి వారిలో ఉన్న తప్పును ఇది ఇలా ఉండచ్చా?? అలా ఉంటుందని నాకు తెలియదు లాంటి మాటలతో చెప్పాలి. అలా చెబితే మన మాటల ద్వారా అది తప్పేమో అనే ఆలోచన చేసి చివరికి వారు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ మాటల్లో ఉన్న మర్మం, మాటకు ఉన్న ఆకర్షణ, మాటకున్న శక్తి.                                      ◆నిశ్శబ్ద.
మనం ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నప్పుడు కలిగే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అయితే ఎవరైనా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వారి భాగస్వామిని వారు నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటారు. వారి భావాలను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి డేటింగ్ భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పింది వినడం: మీ పార్టనర్ మీ మాటలను జాగ్రత్తగా వింటుంటే మీ మాటలను సీరియస్ గా తీసుకుంటే వారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అది నిజమైన ప్రేమకు సంకేతం వంటిది. ఎల్లప్పుడూ అండగా ఉండటం: కష్టమైనా, సుఖమైనా ఆ సందర్భంలో మీకు అండగా నిలిచేవారు నిజమైన భాగస్వామి. మీ సంతోషంలో, దుఖంలో మీ భాగస్వామి మీకు సపోర్టుగా ఉండాలి. మీ దుఖంలో పాలుపంచుకోవడం, మీకు ధైర్యాన్ని ఇవ్వడం..ఇది నిజమైన ప్రేమకు అర్థం. ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం: మీరు అనారోగ్యంగా ఉన్న సమయంలో మీ భాగస్వామి ప్రేమను సులభంగా అర్థంచేసుకోవచ్చు. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు మీ భాగస్వామి మిమ్మల్ని చిన్నపిల్లల్లా చూసుకుంటారు. సకాలంలో మందులు, ఆహారం అందిస్తారు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కోపంగా ఉన్నప్పుడు భరోసానివ్వడం: మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మాత్రమే మిమ్మల్ని శాంతిపజేస్తారు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమించనట్లయితే..మీ బాధ వారికి ఎలాంటి తేడా కలిగించదు. కాబట్టి మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భాగస్వా మి బాధపడి, మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తే అలాంటి వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి.  
కలలు అందరికీ వస్తాయి. అయితే ప్రతి కలలో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది అందరికీ. అలా కలలో కనిపించే వస్తువు, ప్రదేశం ఇతరం ఏదైనా సరే.. దాన్ని బట్టి మనిషికి కొన్ని విషయాలను సూచిస్తుంది మనిషి అంతరంగం. మనిషి కలలో ఏమి కనబడితే ఏమవుతుంది?? ఏది దేనికి సంకేతంగా భావించబడుతుంది?? దానికి వివరణలు ఏమిటి?? ఫ్రాయిడ్ తన సిద్ధం ద్వారా నిరూపించిన విషయాలు ఇవీ... దేవదూత : కలగన్నవారు ఆధ్యాత్మిక శక్తి, ఉన్నతాత్మ, దివ్యగుణాలను (దయ, ప్రేమ, కరుణ, పవిత్రత) పొందాలనే ఆకాంక్షలకు ప్రతీక దేవదూత కలలో కనిపించడం. శిశువు: కొత్త జన్మ, కొత్త ఆదర్శాలను గుర్తించడం, చిన్న పిల్లల్లాగా  నిస్సహాయతను వ్యక్తం చేయడం దీనికి సంకేతం. అలాగే పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనే కోరిక, గర్భధారణ విషయంలో భయానికి ప్రతీక. చెంపలు: ఇవి  పిరుదులకు ప్రతీకలు, ఇవి కలలోకి వస్తే లైంగికేచ్చ అంతర్లీనంగా సంఘర్షణలో ఉన్నట్టు అర్థం. చెంపలు ఈ భావాన్ని  వ్యక్తం చేస్తాయి.  కన్ను:  దూరదృష్టిని, ఆప్రమత్తతను సూచిస్తుంది. జరగబోయే వాటి గురించి అప్రమత్తతను తెలియజేయడం దీని అర్ధం.  పెళ్లి కూతురు:  స్త్రీల కలలలో ఎక్కువగా కనిపించేది పెళ్లి కూతురు. మగవాడు పెళ్ళికూతురు గురించి కలగనడు. పెళ్ళికూతురే కలలో పెళ్ళి కూతురిని చూస్తే ప్రేమను వేడుకొందన్న మాట. తల్లిదండ్రుల శృంఖలాల నుంచి బయటికి అడుగుపెట్టడం దీనికి సంకేతం.  దొంగ : విలువైనది దేనినైన తస్కరించేవాడు. స్త్రీల విషయంలో మానాన్ని, కలగన్న వాడే దొంగ అయితే తను చేసిన, చేయనున్న దోషాలను బయటపెట్టడం, దొంగ తండ్రిని సూచించవచ్చు. ఫ్రాయిడ్ ప్రకారం, దొంగల భయం శైశవంలో పాతుకుపోతుంది. మంచం ప్రక్కన నిలబడ్డ తండ్రిని, ఆకస్మికంగా నిద్ర లేచిన బిడ్డ చీకట్లో చూచి దొంగ అనుకొంటాడు.  శవం: ఇది ఎప్పుడూ మనుష్యులు చావడాన్నే సూచించదు. అవాంఛనీయ ఆశ. ప్రేమసంబంధాల అంతాన్ని సూచించవచ్చు. తను కాదనుకొన్నవారిని మరణం ద్వారా తొలగిస్తాడు. తానే శవమైతే అనారోగ్యాన్ని, మృత్యుభయాన్ని, తను అనుభవిస్తున్న రోగబాధను సూచించవచ్చు.  పోలీసు:  అధికారం, శిక్ష, రక్షణ, అంతరాత్మ ఇవన్నీ విడివిడిగా లేదా కలిపి. రాణి: రాణి కలలో కనిపిస్తే తల్లి కాబోతున్నట్టు సంకేతమట. స్నానాల గది : లైంగిక, రుగ్మత, రహస్యకార్యమేదైన ఉంటే దానికి ఇది సంకేతం.  సేతువు : ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెందటం. సేతువును దాటటమంటే కష్టాలను దాటడం. శ్మశానం : తన లేదా ఇతరుల మరణ వాంఛ. ప్రేమ భంగం లేదా సంబంధం తెగిపోవడం కూడా దీనికి సంకేతం. గుడి: ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం, అపరాధాలను ప్రక్షాళనం చేసుకోవడం.  వ్యవసాయ క్షేత్రం : ప్రేమ, పెండ్లి, సంతానాలను సూచిస్తుంది.  హోటలు: హోటల్ కలలోకి రావడం అరుదే. అయితే ఇది పరివర్తన దశ. హోటలు తాత్కాలిక నివాసం. వాటి అంతస్తులు చేతనా చేతనలను సూచిస్తాయి. ద్వీపం : ఏకాంత సూచకం. ఒంటరిగా మౌనంగా ఉండాలని అనుకోవడానికి ఇది సూచన.  ఊబి: పరిస్థితులు తనను ముంచుతున్నాయను కొంటాడు స్వాపి. ఇతరుల సహాయం లేక బయట పడలేననుకొంటాడు. ఊబి ఎలాగైతే మనిషిని తనలోకి లాక్కుని సజీవంగా మరణం తెస్తుందో అలాగే నిజంగా జరుగుతుందని భయాడతారు. ఇలా కలలో కొన్ని విషయాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవన్నీ ఫ్రాయిడ్ తన సిద్ధాంత  పరిశీలన ద్వారా  రూపొందించినవి.                                          ◆నిశ్శబ్ద.
వేగంగా మారుతున్న జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా జుట్టుపై కూడా కనిపిస్తుంది.ఇప్పట్లో చాలామంది  జుట్టు రాలడం, జుట్టుకు సంబంధించి  అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి,  ఇతర కారణాల వల్ల, జుట్టు రాలే సమస్య తరచుగా మొదలవుతుంది. జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం, బట్టతల రావడం వల్ల ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుని,  దాని పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. జుట్టురాలడంలో ఈ 4 కారణాలే ప్రధానం... పోషకాహార లోపాలు.. ఇప్పట్లో ప్రజల  ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఇవి కూడా అనారోగ్యంగా తయారవుతున్నాయి.  శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, జుట్టు మీద కూడా లోతైన ప్రభావం చూపుతుంది. బయోటిన్ లేకపోవడం వల్ల  జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా విటమిన్ సి,  ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. జుట్టు రాలే సమస్య వేగంగా అరికట్టడానికి, జుట్టు తిరిగి ఆరోగ్యంగా పెరగడానికి  ఆరోగ్య నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. ఫలితాలు వేగంగా ఉంటాయి. ఒత్తిడి,  శారీరక సమస్యలు.. భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం,  శారీరక ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేసే టెలోజెన్ ఎఫ్లూవియం అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా, జుట్టు రాలడం పెరుగుతుంది.  జుట్టును దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు   జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని నివారించడానికి మొదట ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించాలి . దీని కోసం  రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, రెగ్యులర్ వ్యాయామం,  హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్  ఫాలో కావడం చేయాలి. జన్యు కారణాలు.. కొన్నిసార్లు హెయిర్ ఫాల్ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల అంటే కుటుంబ చరిత్ర వల్ల కూడా రావచ్చు. దీనిని ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు, ఇది చాలా మందిలో బట్టతలకి దారి తీస్తుంది. అలోపేసియా అరేటా అనే పరిస్థితిలో  రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడి చేస్తుంది.  ఫలితంగా జుట్టు రాలుతుంది. అలోపేసియా అరేటా శరీరంలో ఎక్కడైనా జుట్టు రాలడానికి కారణం అయినప్పటికీ, ఇది సాధారణంగా తల, ముఖాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స ఎంపికలు మారుతూ ఉంటాయి. . కార్టికోస్టెరాయిడ్స్, ఇమ్యునోథెరపీ లేదా ఆరోగ్య నిపుణులు సూచించిన ఇతర మందులు కూడా ఉండవచ్చు. జుట్టు సంరక్షణలో చెడు అలవాట్లు.. ఈ రోజుల్లో  స్టైలింగ్ కోసం జుట్టుపై అనేక రకాల వస్తువులను ప్రయోగిస్తున్నారు.  దీని కారణంగా జుట్టు పాడైపోతోంది.  దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు సంరక్షణ కోసం సరైన పద్ధతులను పాటించాలి. హీట్ స్టైలింగ్‌ను తగ్గించాలి.  బిగుతుగా ఉండే కేశాలంకరణను నివారించాలి.  జుట్టుకు సరైన ఉత్పత్తులను ఉపయోగించాలి.                                      *నిశ్శబ్ద. 
మనిషి అన్నవాడికి స్పందించడం అవసరం అంటే కొన్ని సందర్భాలలో ఆనందం తో కన్నీరు వస్తే. బాధతో కన్నీరు వస్తుంది. అలా కన్నీరు పెట్టుకుంటే లాభమే. అని పరిశోదనలో తేల్చారు.కన్నీరు వల్ల లాభామ నష్టమా అన్న విషయం లో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా మరి. కొందరికి కన్నీరు అస్సలు రాదు.కొందరికి కన్నీరు అతికష్టం మీద వస్తుంది. కొందరికి కన్నీరు అలవోకగా వస్తుంది.వాళ్ళ నెత్తిన నీళ్ళ కుండ ఉందేమో అని అనిపించే విధంగా అదే ధారగా కన్నీరు పెట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తారు.కొందరు మనసులో ఉన్న బాధను దుఖం రూపం లో బయటికి వెళ్ళ గాక్కుతారు.పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటారు.గతం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బాహాటంగా మనస్పూర్తిగా ఏడవడం లేదా కుళ్ళి కుళ్ళి ఏడవడం మనం గమనించ వచ్చు.అసలు కన్నీరు పెట్టుకుంటే లాభమా నష్టమా చూద్దాం. మనిషి ఏడవడం దుఃఖించడం ఒక సాధారణ ప్రక్రియ.ఒక్కోరిలో ఒక్కో భావనలు ఉంటాయి.దానికి బదులుగా దుఃఖం పెల్లుబికి బయటికి వస్తూ ఉంటుంది.అసలు మనిషి ఎందుకు ఏడు స్తాడో దుఃఖం తో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసా? మీరు ఆలోచించారా ? ఈమేరకు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు పలు ఆశక్తి కరమైన అంశాలు వెలుగు చూసాయి.మనము ఏడవడం ద్వారా మనశరీరం, మెదడు రెండూ కీలక మని కనుగొన్నారు.అప్పుడే దానిఫలితాలు మనకు అందుతాయని అన్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే మొదటి సారి ఏడుస్తాడు.అసలు ఏడవడం ద్వారా వచ్చే లాభాము మీకు తెలియదు. ఏడవడం వల్ల వచ్చే లాభాలు అశక్తి కలిగించే అంశాలు తెలుసుకుందాం. 1)శరీరం డీ టాక్సీ ఫై అవుతుంది. *కన్నీరు మూడు రకాలు...  *రిఫ్లెక్స్ ద్వారా వచ్చే కన్నీరు...  *అదే పనిగా వచ్చే కన్నీరు...  *భావనాత్మ కంగా వచ్చే కన్నీరు... *రిఫ్లెక్స్ వల్ల వచ్చే కన్నీరు... కంటిలో పేరుకు పోయిన మట్టి,ఇతర పనికిరాని చెత్త అది కంటిని శుభ్రం చేస్తుంది. అదే పనిగా కంటి నుండి కన్నీరు ప్రవహిస్తుంటే అది మీ కళ్ళు చేమ్మగిల్లినట్లు. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.భావనాత్మకంగా వచ్చే కన్నీరు ఒత్తిడి వల్ల,లేదా ఉద్వేగాల వల్ల కన్నీరు బయటికి వస్తుంది.అవి మరల వేరే టాక్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కన్నీరు మన శరీరం లో ఉన్న వస్తువుల్ని శరీరం నుండి బయటికి వస్తుంది. మిమ్మల్ని మీరు శాంతింప చేసుకోవడం కన్నీరు సహకరిస్తుంది.. మన మనస్సు శాంత పరుచుకోవాలంటే ఏడవడం మంచి పద్ధతి.పరిశోదనలో ఏడవడం ద్వారా సింథటిక్ నర్వస్సిస్టం యాక్టివేట్ కావడాన్ని గమనించవచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తద్వారా మన శరీరానికి కొంత ఉపశమనం కల్పించడం లో సహకరిస్తుంది.కొంత సేపు ఏడ్చిన తరువాత శాంతం గా ప్రాశంతం గా ఉన్నట్లు  అనుభూతి పొందుతారు. మీకు సహకారం లభిస్తుంది.. ఒక వేళ మీరు నిరాశ చెందినట్లయితే ఏడవడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు సపోర్ట్ అవసరం.అని భావిస్తారు.చిన్న పిల్లలు సైతం తమ పై దృష్టి పెట్టాలంటే ఏడవడం ఆయుధం గా వాడతారు.ఇలా చేయడం ద్వారా తాము అనుకున్న లక్ష్యం పూర్తి చేసామని  భావిస్తారు. దుఃఖం నుండి బయటికి రావడానికి దోహదం చేస్తుంది.. ఏడవడం లేదా దుఃఖించడం అన్నది ఒక ప్రక్రియ దుఃఖం పడడం,ఆగ్రహంతో కూడా దుఃఖం వస్తుంది.ఎడుస్తున్నప్పుడు ఏడ్చే సమయంలో ఒక పద్ధతి ప్రకారం ఏడవడం అవసరం దీనిద్వారా దుఃఖం నుండి బయటికి వచ్చినట్లు బరువు దిగి పోయినట్లు భావిస్తారు. నొప్పి నివారిస్తుంది.. దీర్ఘ కాలం పాటు ఏడవడం వల్ల ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్ విడుదల అవుతుంది.ఇది ఫీల్ గుడ్ కెమికల్స్ గా పేర్కొన్నారు.శారీరక భావనాత్మక రెండువైపులా ఉన్న భావనను మనసులోని బాధను నివారించేందుకు సహకరిస్తుంది.ఒక్కో సారి ఎండోర్ఫిన్ విడుదల అయినప్పుడు మీ శరీరం ఒక నియమిత హద్దు వరకు వినే ప్రయత్నం చేస్తుంది.మన శరీరంలో ఉన్న ఆక్సిటోసిన్ ప్రశాంతత ఇస్తుంది. మూడ్ లో మార్పు వస్తుంది.. మన బాధను నొప్పిని తగ్గించడం లో సహకరిస్తుంది.ఏడవడం ద్వారా మీ మూడ్ కూడా బాగా అద్భుతంగా ఉంటుది.సత్వరంగా స్వేచ్చగా ఉండే విధంగా మీ మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు చల్ల బడుతుంది.శారీరకంగా బాగా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. భావనలను నియంత్రిస్తుంది... ఏడవడం అన్నది బాధ పడడం అన్నది మరొకరి బాధకు ఏడుపుకు జవాబుగా కాదు.చాలా సార్లు ఎప్పుడు ఏదైనా చాలా ఆనందం గా ఉంటారు. భయం లేదా ఒత్తిడి లో యాలె విశ్వ విద్యాలయం పరిశోధకులు అంటున్న మాట  ఏమిటి అంటే ఈ విధంగా బాధపడడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించు కునేందుకు సహకరిస్తుంది. అసలు సహజంగా ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తారు.. భయంకర మైన ఒత్తిడిలో ఉన్నప్పు డు ,లేదా తాను అనుకున్న లక్ష్యం లో ఓటమి పాలై నప్పుడు.తనకు కావాల్సిన ఆప్తులైన వారు దూరమై నప్పుడు. లేదా తమకి ఇష్టమైన వారే తమను తీవ్రంగా ద్వేషించి నప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవడం పొర్లి పొర్లి ఏడవడం.మనకు కనిపిస్తుంది. మానసిక భావోద్వేగాలతో  ముడి పడిన సంఘటనలకు కారణంతామే అని భావించిన వారు.అనుకోని విధంగా అనూహ్య విజయం సాధించినందుకు ఆనంద భాష్పాలు కంటినుండి వస్తాయి. వైద్య చికిత్స ఎప్పుడు అవసరం... ఏడవడం ఎలాంటి వస్తువంటే మీకు సుఖం లభిస్తుంది.బాధ కలుగుతుంది.అందుకు ప్రతిగా మీరు ఏడుస్తారు అది సర్వసాధారణం మీరు ఏడవడం వల్ల మీరు బాగా ఉన్నట్లు భావిస్తారు.ఇలా చేస్తున్నందుకు సిగ్గు పడవద్దని ఏడుపు వచ్చినప్పుడు మనస్త్రుప్తిగా ఏడవండి. ఆబాధనుండి విముక్తి పొందండి. ఏదైనా విషయం లో ఆనందం లభిస్తుందో.లేదా దుఃఖం కలిగిస్తుందో చాలా సార్లు అప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నా ఎడుస్తారని ఏలే విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞులు అంగీకరిం చారు.ఏడవడం వల్ల భావనాత్మక నియంత్రణ బయటికి వస్తుంది.సహాయ పడుతుంది. ఏడుపు మంచిదే. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                      
  సరైన విధంగా తింటే శాకాహారం ఇచ్చినంత గొప్ప ఆరోగ్యం ఇంకేదీ ఇవ్వగదనేది వైద్యుల మాట. కూరగాయలలో కూడా ప్రాంతీయతను బట్టి వివిధ రకాలుంటాయి. వీటిలో కొన్ని చూడడానికి కొన్ని వింతగా ఉంటే మరికొన్ని తిన్నప్పుడు ఆశ్చర్యకరమైన రుచి కలిగుంటాయి. అలాంటి వాటిలో కూర పనస కూడా ఒకటి. రూపంలో అచ్చం పనస పండును పోలి ఉండే కూర పనస రుచిలో మాత్రం అందరికీ షాకిస్తుంది. ఇది అచ్చం బ్రెడ్ రుచిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ కూర పనస తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. పోషకాలు.. కూర విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అదనంగా, ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యం.. అధిక ఫైబర్ కంటెంట్‌ ఉన్న కారణంగా, కూర పనసప్రేగు కదలికలను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.  గట్‌లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించడం, జీర్ణక్రియ, పోషకాల శోషణకు అవసరమైన ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. బరువు నిర్వహణ.. కూర పనసను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువ కాలం కడుపు  నిండిన అనుభూతిని కలిగిస్తుంది, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది.  అతిగా తినకుండా చేస్తుంది. అదనంగా, దాని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని అందిస్తాయి, రోజంతా సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచుతాయి.                    *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...