ఇదీ డబుల్ ఇంజిన్ పవర్.!

Publish Date:Jul 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన   అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన లోకేష్.. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని  డబుల్ ఇంజిన్ సర్కార్  వల్లనే రాష్ట్రానికి మెగా పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వేగంగా సాధ్యమవుతున్నాయన్నారు.

 ఐదేళ్ల  వైసీపీ పాలనలో అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన ఆయన  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో  కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను శరవేగంగా పరిగెత్తిస్తున్నదన్నారు. అమరావతిని కేవలం భవనాల నగరంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీ కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిఉద్ఘాటించారు.

గతంలో భారత  రైల్వే రంగంలో భద్రత, పరిశుభ్రత లోపించేవని, కానీ ప్రధాని మోడీ ముందుచూపు వల్ల దేశంలో వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' ఆటోమేటిక్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో కూడిన సరికొత్త రైల్వే విప్లవం నడుస్తోందని లోకేష్ కొనియాడారు. దశాబ్దాల నాటి ఆంధ్రుల కల అయిన విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ప్రధాని మోడీ వెంటనే మంజూరు చేసి కార్యరూపంలోకి తెచ్చారని, ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన లోకేష్.. మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ' ప్రసాద్' పథకం కింద నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారని, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కట్టుగా పని చేస్తే నియోజకవర్గం ఎలా మారుతుందో చెప్పడానికి మంగళగిరి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని  వివరించారు. ఒక రూపాయి ఆదాయానికి ఒక రూపాయి నలభై పైసల ఖర్చు ఉన్నప్పటికీ.. సూపర్ సిక్స్ హామీలైన తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ, మెగా జాబ్ క్యాలెండర్ వంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

గతంలో పెట్టుబడులు లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందనీ..  కూటమి ప్రభుత్వం వచ్చాక రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలతో పాటు ఫైటర్ జెట్ తయారు చేసే  అమ్కా  వంటి భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, పొరుగు రాష్ట్రాల యువతే ఏపీ వైపు చూసేలా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు తాను చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేర్చుకునేవాడినని, కానీ ఇప్పుడు కుప్పం నేతలు కూడా మంగళగిరిని చూసి నేర్చుకునే స్థాయికి ఇక్కడి అభివృద్ధిని తీసుకెళ్లామని సగర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో మంగళగిరిని ఐటీ,  పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Nara Lokesh Mangalagiri, Amaravati Capital Development, AP Double Engine Government, Andhra Pradesh Mega Investments South Coast Railway Zone Vizag

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.