అంబటినోట టీటీడీపై ప్రశంసలు.. అన్నప్రసాదం అద్భుతం అంటూ పొగడ్తలు
Publish Date:Nov 9, 2025
Advertisement
తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యత విషయంలో వైసీపీ హార్డ్ కోర్ నేతలు కూడా ప్రశంసించక తప్పడం లేదు. ప్రత్యర్థుల ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎత్తి చూపడానికీ, వంక పెట్టడానికి ఇసుమంతైనా అవకాశం లేకుండా.. తెగడ్తలు గుప్పిద్దామన్నా నోటినుంచే పొగడ్తలు వచ్చేలా అన్న ప్రసాదం నాణ్యత, రుచి, శుభ్రత ఉంటున్నాయి. ఇందుకు తాజా నిదర్శనమే..నిత్యం తెలుగుదేశం ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకులపైనా విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత, అన్న ప్రాసాదం క్యాంటిన్ లో శుచి, శుభ్రతల గురించి మైమరిచి మరీ పొగడ్తల వర్షం కురిపించారు. వైసీపీ హయాంలో అన్న ప్రసాదం ఒక్కటే కాదు, చివరాఖరికిరి తరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉందన్న ఆరోపణలు భక్తుల నుంచే వచ్చాయి. అవేమీ రాజకీయ ఆరోపణలకు కావని లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ గురించిన సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది కూడా. వైసీపీ హయాంలో అసలు తిరపతిలో భక్తుల సౌకర్యాలను గురించి పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ, తిరుమల కొండపై పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సౌకర్యాల కల్పన ఉందన్న ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వరంలో నడుస్తున్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు. ఆ క్యాంటిన్ ను నిర్వహిస్తున్న తీరు, అక్కడి శుచి, శుభ్రత, అన్నప్రసాదం నాణ్యత, రుచి అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా.. తాను కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆహారం నాణ్యత, నిర్వహణ, పారిశుధ్యం, భక్తులకు అన్నప్రసాదం వడ్డన ఇలా అన్నీ ఏగ్రేడ్ లో ఉన్నాయంటూ ప్రశంసించారు. ఇదే ప్రశంస వేరే ఎవరినుంచైనా వచ్చి ఉంటే.. వైసీపీ.. రాజకీయం చేసి ఉండేది. ఎల్లో మీడియా ప్రచారం అంటూ ఊరూవాడా ఏకం చేసేసేది. కానీ ఇక్కడ ఈ పొగడ్తలు వైసీపీ సీనియర్ నాయకుడు, కరుడుగట్టిన తెలుగుదేశం వ్యతిరేకి అయిన అంబటి రాంబాబు నుంచి వచ్చాయి. దీంతో వైసీపీకి గొంతులో పచ్చవెలగకాయ పడినట్లు అయ్యింది. ఇటీవలి కాలంలో టీటీడీపై వైసీపీయులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇకపై వారు టీటీడీపై విమర్శ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించకతప్పని పరిస్థితిని అంబటి రాంబాబు పొగత్తలు కల్పించాయి.
http://www.teluguone.com/news/content/ttd-annaprasadam-amazing-25-209242.html





