ఇది మూడో ప్రపంచ యుద్ధమేనా?

Publish Date:Mar 7, 2026

Advertisement

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం  కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు పోరు కాదు ప్రపంచ దేశాల సమస్య. అన్ని దేశాల్లోని ప్రజల ఇంటి సమస్య. యుద్ధం అనగానే మనకు చాలా దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో జరిగే తుపాకుల మోత మాత్రమే అని అనిపిస్తుంది. కానీ ఇప్పటి గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ గా పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా  భారతదేశ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపు. పెద్ద కుదుపు. ఇండియాకు  అవసరమైన ఇంధన అవసరాలలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది.

  ఈ  కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఆ ప్రభావంతో  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేనా యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలునెలకొన్న గల్ఫ్ దేశాలలో దాదాపు కొటి మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. ఈ యుద్ధం   వారి ఉద్యోగాలు, భవిష్యత్, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నది.

తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.   ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి లేదా  పరిష్కరించడానికి  భారతదేశం వంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ తన పలుకుబడిని ఉపయోగించి ఆపడానికి కృషి చేయాలి.   బ్రిక్స్ ద్వారా చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకం చేసి శాంతి కోసం ఒత్తిడి తేవాలి.  

తెలుగువన్ యూట్యూబ్ చానెల్ వాస్తవ వేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ మధ్య  ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపే ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి పాఠం ఈ దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి.

 

By
en-us Political News

  
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.