నితీశ్ బాటలో సీఎం చంద్రబాబు నిజమెంత?

Publish Date:Mar 12, 2026

Advertisement

 

తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర రాజకీయాలకు వెళ్లడం ప్రమోషనా, డిమోషనా అని కంఠంనేని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, నితీశ్ కుమార్ సెంట్రల్ పాలిటిక్స్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే తన రాజకీయ వారసత్వాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. నితీశ్ కుమార్ చంద్రబాబు కంటే ఒక సంవత్సరం చిన్నవారని పేర్కొన్నారు. ఆయన విజయవంతమైన రాజకీయ నాయకుడని, ఎప్పుడు అధికారంలో ఉండాలో బాగా తెలిసిన నాయకుడని వ్యాఖ్యానించారు. మోదీలా ఎప్పటికీ అధికారంలో ఉండాలనే తత్వం నితీశ్‌కు లేదని తెలిపారు.

నితీశ్ కుమార్ వ్యక్తిగత జీవితం చాలా సాధారణమైందని, బీహార్ పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. ఎన్డీయేలో కీలక పాత్ర పోషించే నాయకుల్లో నితీశ్ కుమార్ ఒకరైతే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్య నేత అని అన్నారు. నితీశ్ మార్గంలోనే చంద్రబాబు ప్రయాణిస్తారా అని రవిశంకర్ ప్రశ్నించగా, టీడీపీ కార్యకర్తల్లో కూడా నాయకత్వంపై చర్చలు జరుగుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు.

2024లోనే నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాలని కొంతమంది చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు లోకేశ్‌దేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో రాష్ట్రపతిగా వెళ్లవచ్చని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటిదేమైనా జరుగుతుందా అని రవిశంకర్ ప్రశ్నించారు.

వైసీపీ విమర్శలకు టీడీపీ నుంచి గట్టిగా ప్రతిస్పందించే నాయకులు ఉన్నారని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అలాగే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆయన ఉపరాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత రాజకీయ శక్తి కొంత మేర తగ్గిందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి చంద్రబాబు విషయంలో ఉండదని అన్నారు.

చంద్రబాబుకు ‘విజన్ 2047’ లక్ష్యాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపై అనేక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా అమరావతిని ఆధునిక నగరంగా నిర్మించాలనే లక్ష్యం ఆయనకు ఉందన్నారు. ఆ ప్రణాళికలను భవిష్యత్తులో తన వారసుడు లోకేష్ ముందుకు తీసుకెళ్లే అవకాశముందని చర్చ జరిగింది.

అలాగే, ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసేన పార్టీ బలంగా ఉందని, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కువగా చురుకుగా పనిచేస్తారని రవిశంకర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కొన్నిసార్లు పక్కన పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి

 

By
en-us Political News

  
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.